చైనా కొత్త విధానం: మొబైల్ ఫోన్ కొని, వాడాలంటే అందులో ముఖాన్ని స్కాన్ చేసుకోవాల్సిందే

ఫొటో సోర్స్, AFP
చైనా ప్రభుత్వం తమ దేశంలోని కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులను గుర్తించేందుకు గాను కొత్త విధానం అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇకపై కొత్త మొబైల్ ఫోన్ కొని దాన్ని వాడాలంటే అందులో ముఖాన్ని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
సెప్టెంబరులోనే ప్రకటించిన ఈ కొత్త విధానాన్ని ఆదివారం నుంచి అమలు చేస్తున్నారు. ''సైబర్ స్పేస్‌లో ప్రజల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలు పరిరక్షించడమే మా ధ్యేయం'' అని అధికారులు చెప్పారు.
చైనాలో జనాభా సర్వే కోసం ఇప్పటికే ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వాడుతున్నారు.
ఇలాంటి టెక్నాలజీల విషయంలో చైనా ప్రపంచంలోని మిగతా దేశాల కంటే ముందుంది. అయితే, ఇటీవల కాలంలో వీటి వాడకాన్ని పెంచుతుండడం అక్కడ చర్చకు దారితీస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త నిబంధనలు ఏమిటి?
కొత్తగా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినా, డాటా సేవల కోసం రిజిస్టర్ చేసుకున్నా ఇంతవరకు వారి జాతీయతను తెలిపే గుర్తింపు కార్డులు, ఫొటోను స్కాన్ చేస్తే సరిపోయేది.. ఇప్పుడు దాంతో సరిపోలేందుకు ముఖాలనూ స్కాన్ చేయాల్సి ఉంటుంది.
దేశంలో ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరి గుర్తింపు పక్కాగా ఉండేలా.. వాడుతున్నదెవరో తెలుసుకునేలా నిబంధనలు అమలు చేయాలని చాలాకాలంగా చైనా ప్రయత్నిస్తోంది.
దీనివల్ల ఆన్‌లైన్‌లో వివిధ వేదికలపై కంటెంట్ పోస్ట్ చేసేవారిని అవసరమైనప్పుడు సులభంగా గుర్తించగలుగుతారు.
చైనా పారిశ్రామిక, ఐటీ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ నిబంధనలతో ఆ దేశంలోని ప్రతి మొబైల్ వినియోగదారుడి గుర్తింపు ప్రభుత్వం వద్ద ఉంటుంది. అక్కడ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులే అధికంగా ఉండడంతో ఇంటర్నెట్ వినియోగదారుల గుర్తింపూ సులభతరమవుతుంది.
చైనా కృత్రిమ మేధపై అధ్యయనం చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి జెఫ్రె డింగ్ దీనిపై మాట్లాడుతూ.. ఇంటర్నెట్ మోసాలు అరికట్టడం, సైబర్ సెక్యూరిటీ పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని చెప్పారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్లు, గుర్తు తెలియని ఇంటర్నెట్ ఖాతాలు ఇక ఉండవని అన్నారు.
అదేసమయంలో ప్రజలపై పూర్తి నిఘాకు కూడా ఇది అవకాశం కల్పిస్తుందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజలు ఏమంటున్నారు?
సెప్టెంబరులో ఈ కొత్త నిబంధనలను చైనా ప్రభుత్వం ప్రకటించినప్పుడు అక్కడి మీడియా దీనికేమీ పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. కానీ, సోషల్ మీడియా వేదికగా మాత్రం చాలామంది ఆందోళన వ్యక్తంచేశారు.
''ఇది అమల్లోకి వస్తే ప్రజలను ప్రభుత్వం పూర్తిగా మానిటర్ చేస్తుంది. ప్రభుత్వం ఎందుకింతలా భయపడుతోంది'' అని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ సినా వీబో యూజర్ ఒకరు అన్నారు.
చైనాలో ఇప్పటికే ఎన్నో డాటా బ్రీచ్ ఉదంతాలున్నాయని చాలామంది నెటిజన్లు గుర్తు చేశారు.
మరికొందరు మాత్రం ఇదంతా టెక్నాలజీలో భాగంగా జరుగుతున్నదంటూ తేలిగ్గా తీసుకున్నారు.
కాగా చైనా ప్రభుత్వం తనకు నచ్చని, తన ప్రజలు చూడకూడదని భావించే కంటెంట్‌ను ఆ దేశంలో ఇంటర్నెట్‌లో రాకుండా నియంత్రణలు విధించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫేషియల్ రికగ్నిషన్ వాడకం ఎలా ఉంది?
ప్రజలపై నిఘా పెడుతుందన్న పేరు చైనాకు చాలాకాలంగా ఉంది. 2017లో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా 17 కోట్ల సీసీ టీవీలు అమర్చింది. 2020 నాటికి వాటిని 40 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు సోషల్ క్రెడిట్ సిస్టం పేరుతో ప్రజల ప్రవర్తనకు కొలమానాలు పెడుతోంది. 2020 నాటికి దేశంలోని ప్రతి పౌరుడూ విస్తృతమైన డాటాబేస్‌లో ఉండేలా చేసి.. ప్రతి పౌరుడికీ ర్యాంకింగ్ ఇస్తారు.
ఫేషియల్ రికగ్నిషన్ విధానం నిఘా వ్యవస్థలో కీలకంగా మారనుంది. ఇది పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. పోలీసులు ఒక నిందితుడిని పట్టుకోవాలనుకుంటే ఆ వ్యక్తి 60 వేల మందిలో ఉన్నా కూడా ఈ టెక్నాలజీ సహాయంతో గుర్తించగలుగుతారు.
జిన్‌జియాంగ్ ప్రావిన్సులో వీగర్ ముస్లింలను ఉంచిన క్యాంపుల్లో వారిని ట్రాక్ చేయడానికి సర్వేలెన్స్ కెమేరాల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడుతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
చైనాలో రోజువారీ జీవితం, వాణిజ్య లావాదేవీల్లో ఈ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. దుకాణాలు, సూపర్‌మార్కెట్లలో పేమెంట్లూ ఈ విధానంలోనే చేస్తున్నారు.
అయితే, దీన్ని వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. ఈ ఏడాది ఒక వన్యప్రాణి అభయారణ్యం వద్ద సందర్శకులకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయడంతో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు కోర్టులో కేసు వేశారు.
ఓ యూనివర్సిటీలో విద్యార్థుల హాజరు, ప్రవర్తనను మానిటర్ చేయడానికి ఫేషియల్ రికగ్నిషన్‌ను వాడిన వ్యవహారం అక్కడ వివాదాస్పదం కావడంతో స్కూళ్లు, కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ వాడకాన్ని తగ్గించేలా చర్యలు చేపడతామని సెప్టెంబరులో చైనా ప్రభుత్వం ప్రకటించింది.
అదే ప్రభుత్వం ఇప్పుడు దీన్ని విస్తృతం చేయాలనుకోవడంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని జెఫ్రె డింగ్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- స్టాకర్వేర్: భార్యాభర్తల పరస్పర నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- ఆంధ్రప్రదేశ్: ఉపాధి హామీ కార్మికులు 8.58 లక్షల మందికి రూ. 53.47 కోట్లు మూడేళ్లుగా పెండింగ్.. కారణం ఏమిటి?
- ప్రభుత్వానికి రూ.92000 కోట్లు బకాయి పడ్డ ఎయిర్టెల్, వొడాఫోన్: ఇది 5జీ ఆశలకు విఘాతమా
- ఇంటర్నెట్ ఎలా పుట్టింది? రెండు కంప్యూటర్ల మధ్య బదిలీ అయిన తొలి పదం ఏంటి?
- Xiaomi: భారత మార్కెట్లో ఈ చైనా బ్రాండ్ ఆధిపత్యం ఎలా సాధ్యమైంది?
- ఇన్ఫోసిస్: సీఈఓ, సీఎఫ్ఓలపై వచ్చిన ఆరోపణలపై విచారణను ప్రారంభించిన ఐటీ సంస్థ
- చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
- భారతదేశంలో ఇంటర్నెట్ను అత్యధికంగా వాడుతున్నదెవరు...
- హువావే: అమెరికా నిషేధం తర్వాత.. భవిష్యత్తు భారత్‌తో ముడిపడివుందా?
- రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించిన రోబో చేయి
- గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు
- షావొమీ 108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్: పిక్సెల్ పెరిగితే ఫొటో క్వాలిటీ పెరుగుతుందా
- పాస్‌వర్డ్‌లతో భద్రత లేదా? బయోమెట్రిక్స్ సురక్షితమేనా?
- పెగాసస్ ఎటాక్: వాట్సాప్‌ను తీసేస్తే మీ ఫోన్ సేఫ్ అనుకోవచ్చా?
- చైనాలో 5జీ నెట్వర్క్ ప్రారంభం... ప్రపంచ టెక్నాలజీలో భారీ ముందడుగు
- చవగ్గా వచ్చే విద్యుత్‌ను దాచుకోవచ్చు ఇలా..
- 'రాజుల కోట' నుంచి అమూల్యమైన వజ్రాలను ఎత్తుకెళ్లిన దొంగలు
- పోర్న్ తారల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు తొలగిస్తోంది?
- అబ్బాయిలకు శిక్షణనిస్తే అమ్మాయిలపై వేధింపులు తగ్గుతాయా
- 97 ఏళ్ల వయసులో నోబెల్... విజేతల చరిత్రలోనే అత్యధిక వయస్కుడు జాన్ గుడ్ఇనఫ్
- నోబెల్ ప్రైజ్: విశ్వ రహస్యాల శోధనకు, కొత్త గ్రహాన్ని కనిపెట్టినందుకు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు పురస్కారం
- ముస్లిం వీగర్లను వేధించారని 28 చైనా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అమెరికా
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- చైనా, తైవాన్‌ల మధ్య ‘వికీపీడియా’ యుద్ధం
- గాలి నుంచి విమాన ఇంధనం తయారీ
- చంద్రయాన్-2: 'ఇస్రో ప్రయోగం విఫలమైందనడం సరి కాదు...'
- తిమింగలాల బరువును ఎలా కొలుస్తారు?
- పక్షవాతంతో కదలలేనివాళ్లు ఈ రోబో సూట్‌తో నడవొచ్చు
- మహిళా ఆవిష్కర్తలు తక్కువ మందే ఉంటారెందుకు
- గోదావరిలోంచి బోటు వెలికితీత: ముందుకు సాగని ఆపరేషన్
- ఫేస్‌బుక్ వర్చువల్ ప్రపంచం.. యూజర్లు కార్టూన్లా మారి తిరిగేయొచ్చు
- మొబైల్ ఫోన్ల డెలివరీలో మోసం.. వ్యక్తిగత వివరాలు నేరగాళ్లకు తెలిస్తే ముప్పే
- స్కూళ్ల ఫేస్‌బుక్ అకౌంట్లలోని ఫోటోలతో అశ్లీల 'మార్ఫింగ్' దందా
- గూగుల్ ఇమేజెస్ ఆవిష్కరణకు కారణమైన జెన్నిఫర్ లోపెజ్ గౌనుకు కొత్త రూపం
- గూగుల్ యాప్స్ లేకుండా హువావే కొత్త ఫోన్లు.. మేట్ 30 ప్రోలో మూవీ కెమెరా
- అమెరికా గూఢచర్యం: ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పావురాలు సీక్రెట్ ఏజెంట్స్‌గా ఎలా పని చేశాయి... గుట్టు విప్పిన సిఐఏ
- ఐఫోన్ 11 కెమెరాలను చూస్తే భయమేస్తోందా... అయితే మీకు ట్రైపోఫోబియా ఉన్నట్లే
- ఐఫోన్11: భారత మార్కెట్లో యాపిల్ ఫోన్ల ఆధిపత్యం సాధ్యమేనా
- సోషల్ మీడియా నుంచి మీ పర్సనల్ డేటాను వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా...
- కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద క్షిపణి పరీక్ష విజయవంతం... డీఆర్డీవోను ప్రశంసించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- భారత్‌లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
- స్మార్ట్ ఫోన్లు మన మాటలు, సంభాషణలను రహస్యంగా వింటున్నాయా?
- స్మగ్లర్లు ఈ చెక్‌పోస్టులను దాటి ముందుకెళ్లడం అసాధ్యం
- చంద్రయాన్ 2: మరో ముఖ్య అంకం విజయవంతం.. ఆర్బిటర్ నుంచి వేరుపడిన 'విక్రమ్'
- లైంగిక వేధింపులు: బస్సులు, రైళ్ళలో అసభ్యంగా వేధించే వాళ్ళను పట్టిచ్చే పరికరం రెడీ
- క్యామ్ స్కానర్ యాప్ వాడుతున్నారా... తస్మాత్ జాగ్రత్త
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
- ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ పేరేంటో తెలుసా...
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- స్మార్ట్ ఫోన్లనే డ్రగ్స్‌లాగా మార్చితే..
- డీప్ ఫేక్: నకిలీ వీడియోలను ఎలుకలు గుర్తిస్తాయా...
- కాన్పు నొప్పులను తట్టుకొనేందుకు వీఆర్ హెడ్సెట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








