రాత్రి పూట చవగ్గా వచ్చే పవన విద్యుత్‌ను దాచుకోవచ్చు ఇలా..

ఫొటో సోర్స్, Getty Images
కొంచెం తికమకపెట్టేలా ఉన్నా ఇది నిజం. రాత్రి పూట చవగ్గా వచ్చే పవన విద్యుత్‌ను ఉపయోగించి వాయువును ద్రవంగా మార్చి నిక్షిప్తం చేసుకోవచ్చు. తిరిగి దాన్ని వాయువుగా మార్చి అవసరమైనప్పుడు మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.
పవన విద్యుత్ రాత్రి పూట చవగ్గా వస్తుంది. ఎందుకంటే అప్పుడు వినియోగం తక్కువగా ఉంటుంది.
అలా రాత్రి సమయంలో ఉత్పత్తైన విద్యుత్ ద్వారా ఓ ట్యాంక్‌లోని వాయువును చల్లబరుస్తారు. దీంతో అది అతిశీతల ద్రవంగా మారుతుంది.
తిరిగి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కొంచెం వేడి చేస్తారు. ఇప్పుడు ఆ ద్రవం తిరిగి వాయువుగా మారుతుంది. వాయువుగా తిరిగి విస్తరించే క్రమంలో, టర్బైన్ తిరగడానికి సాయపడుతుంది. అలా మళ్లీ విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు.
పీటర్ డియర్‌మాన్ అనే ఓ ఔత్సాహిక ఇంజినీర్ తన గ్యారెజ్‌లో ఇలాంటి వ్యవస్థను అభివృద్ధి చేశారు.
ఇప్పుడు దీన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఈ ప్రయత్నాల వెనుక హైవ్యూ అనే సంస్థ ఉంది. ఈ సాంకేతికత ఆధారంగా పనిచేసే 50 మెగావాట్ల ప్లాంట్‌ను ఉత్తర ఇంగ్లండ్‌లో నిర్మిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

ఫొటో సోర్స్, HIGHVIEW
బ్రిటన్ ప్రభుత్వం కూడా ఈ సాంకేతికతను ప్రోత్సహిస్తోంది.
ద్రవరూప నైట్రోజన్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ)ని ఈ విధానంలో ఉపయోగించుకుంటారు. సాధారణ బ్యాటరీల్లా దీని కోసం అరుదైన ఖనిజాలేవీ తవ్వి తీయాల్సిన అవసరం లేదు.
పీటర్ డియర్‌మాన్ కాలేజీలకు వెళ్లి ఇంజినీరింగ్ చదువుకోలేదు. తనకు తానుగా నేర్చుకున్నారు.
ద్రవరూప హైడ్రోజన్ ఆధారంగా పనిచేసే కారును తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆయన ఈ కొత్త విధానం అభివృద్ధి చేశారు. దీని ద్వారా విద్యుత్‌ను నిక్షిప్తం చేయొచ్చన్న ఆలోచన ఆయనకు తట్టింది.
ఇప్పుడు పీటర్.. హైవ్యూ సంస్థలో కొంత వాటా కూడా పొందారు. విద్యుత్ నిక్షిప్తంలో పెద్ద వ్యాపారం ఉండబోతోందని ఆ సంస్థ అంచనాలు వేస్తోంది.
హైవ్యూ తలపెట్టిన ప్లాంటు నిర్మాణం పూర్తయ్యాక రోజూ 25 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా చేస్తుంది. అయితే, డిమాండ్ బాగా పెరిగిన సమయాల్లోనే దీన్ని వినియోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదివరకు మూతపడ్డ ఓ పవర్ ప్లాంట్ స్థానంలో ఈ కొత్త ప్లాంట్‌ను నిర్మించబోతున్నామని హైవ్యూ అధిపతి జేవియర్ కేవడా చెప్పారు.
''స్థిరమైన గ్రిడ్‌ను నిర్వహించడానికి అత్యవసర సేవలను ఈ ప్లాంటు అందిస్తుంది. ఇలాంటి విద్యుత్ నిక్షిప్త వ్యవస్థల ద్వారానే కార్బన్ రహిత భవిష్యత్తు సాధ్యమవుతుంది'' అని ఆయన అన్నారు.
బ్రిటన్ వాణిజ్య, ఇంధన శాఖ చీఫ్ సైంటిఫిక్ సలహాదారుడు జాన్ లాహెడ్ ఈ సాంకేతికతపై ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి.
- ఇంటర్నెట్ ఎలా పుట్టింది? రెండు కంప్యూటర్ల మధ్య బదిలీ అయిన తొలి పదం ఏంటి?
- హిందుత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?
- నోబెల్ ప్రైజ్: విశ్వ రహస్యాల శోధనకు, కొత్త గ్రహాన్ని కనిపెట్టినందుకు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు పురస్కారం
- సూర్యకాంతం: ఇప్పుడు గుండమ్మను ఎక్కడి నుంచి తేవాలి?
- గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- భారతదేశంలో ఇంటర్నెట్ను అత్యధికంగా వాడుతున్నదెవరు...
- గాలి నుంచి విమాన ఇంధనం తయారీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








