BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
వెనెజ్వెలాలో అమెరికా 'ఆయిల్ గేమ్' భారత్‌కు ప్రయోజనకరమా?
భారత్ ఒకప్పుడు వెనెజ్వెలా నుంచి రోజుకు 4 లక్షల బ్యారెళ్ల చొప్పున ముడి చమురును దిగుమతి చేసుకునేది. అయితే, 2020లో అమెరికా ఆంక్షలు కారణంగా 2020లో వెనెజ్వెలా నుంచి చమరు దిగుమతులను భారత్ నిలిపివేసింది. గతేడాది నవంబర్‌నాటికి భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో వెనెజ్వెలా వాటా 0.3శాతమే.
గుజరాత్: సింహంపైకి ప్రయోగించిన మత్తుబాణం గురి తప్పి ట్రాకర్ ప్రాణం తీసింది.. జంతువు స్పృహతప్పేంత మోతాదు మనిషి ప్రాణం ఎలా తీసింది?
ఎనస్థీషియా లేదా ట్రాంక్విలైజర్ మందులు చాలా ప్రమాదకరమైనవి. ఇవి నాడీ వ్యవస్థ, గుండె రక్తప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. మోతాదులో తేడా వస్తే రోగి రక్తపోటు, గుండె కొట్టుకొనే వేగం ఒక్కసారిగా పెరగవచ్చు లేదా అకస్మాత్తుగా పడిపోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.
''అవును.. మదురో సత్యసాయిబాబా భక్తుడే, పుట్టపర్తికీ వచ్చారు’’
''వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, సిలియా ఫ్లోరెస్ 2005లో పుట్టపర్తిలోని సత్య సాయి బాబా ఆశ్రమాన్ని సందర్శించి, బాబా ఆశీర్వాదాలు పొందారు.మదురో వచ్చిన సమయంలో ఓ పెద్ద కార్యక్రమం కూడా జరుగుతోంది. అప్పుడు బాబాను వారు లోపలికి వెళ్లి కలిసినట్టు ఉన్నారు. రిక్వెస్ట్ చేసి ఫొటో తీసుకున్నారు’’
ప్యాసింజర్ విమానాలను భారత్ సొంతంగా తయారు చేసుకోగలదా, రష్యాతో ఒప్పందం ఏమైంది?
దేశీయంగా ప్రయాణికుల విమానాలను తయారు చేయాలని భారత్ ఎంతోకాలంగా అనుకుంటోంది. కానీ, ఈ దిశగా చాలా పరిమితమైన విజయాన్ని మాత్రమే సాధించింది. చిన్న, మధ్య స్థాయి విమానాలను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం 1959లో 'నేషనల్ ఏరోస్పేస్ లేబోరేటరీస్ (ఎన్ఏఎల్)'ను ఏర్పాటు చేసింది.
పాకిస్తాన్ నిర్బంధంలో భారతీయ మహిళ.. ఈ మహిళ అక్కడకు ఎందుకు వెళ్లారు, ఇస్లాంలోకి మారి అక్కడి పౌరుడిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు?
సరబ్జీత్ కౌర్ నవంబరు 4న సిక్కు యాత్రికులతో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లారు. మరుసటి రోజు ఆమె బాబా గురునానక్ జయంతి సందర్భంగా నాన్కానా సాహెబ్‌ను దర్శించాల్సి ఉంది. కానీ, నవంబరు 7న షేఖ్‌పురా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు తాను స్వచ్ఛందంగా ఇస్లాం మతంలోకి మారి నాసిర్ హుస్సేన్ అనే పాకిస్తానీ పౌరుడిని వివాహం చేసుకున్నట్టు వాంగ్మూలం ఇచ్చారు.
వెనెజ్వెలా విషయంలో భారత్ ప్రకటనపై విమర్శలెందుకు వస్తున్నాయి? ఆ ప్రకటనలో ఏముంది?
వెనెజ్వెలా అధ్యక్షుడు మదురోను అమెరికా బంధించిన 24 గంటల తర్వాత.. చాలా జాగ్రత్తగా, ఆచితూచి స్పందించింది భారత్. అయితే, ఈ స్పందనపై అనేక విమర్శలు వస్తున్నాయి. దౌత్య వ్యవహారాల నిపుణులు కూడా విదేశాంగ విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలు ఎందుకీ విమర్శలు? నిపుణులు ఏమంటున్నారు?
'నేను అధ్యక్షుడిని.. నన్ను కిడ్నాప్ చేశారు', న్యూయార్క్ కోర్టులో నికోలస్ మదురో ఏం చెప్పారు?
వెనెజ్వెలా నాయకుడు నికోలస్ మదురో మొదటిసారి న్యూయార్క్ సిటీ కోర్టు రూమ్ లోపల అడుగుపెట్టేముందు ఆయన కాళ్లకు వేసిన సంకెళ్ల గొలుసుల శబ్దం వినిపించింది.
వీడియో, ప్రపంచానికి వైన్ మత్తు దిగిపోతోందా? , వ్యవధి 15,53
వైన్ ధరలు పడిపోవడం, తయారీ ఖర్చులు పెరిగిపోతుండటంతో వైన్ పరిశ్రమ మీద కష్టాల మబ్బులు కమ్ముకుంటున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, యుద్ధాలు, రాజకీయ కారణాలు వాటికి దోహదపడుతున్నాయి.
నాన్: రాజ దర్బారుల్లో వడ్డించే ఈ వంటకం సామాన్యుడి కంచం వరకూ ఎలా వచ్చింది?
మెత్తని నాన్ను రుచికరమైన బటర్ చికెన్ గ్రేవీతో తింటే ఆ మజానే వేరు. దక్షిణాసియాలో ప్రసిద్ధి చెందిన ఈ ఫ్లాట్ బ్రెడ్ (నాన్), ఈ రీజియన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌకర్యవంతమైన ఆహారాల్లో ఒకటి. అలాగే విదేశాల్లో బాగా పాపులర్ అయిన భారతీయ వంటకాల్లో ఒకటి.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
రహమాన్ డకైత్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
భూతకోల: ఏమిటీ ఆచారం, బయటి ప్రాంతాలలో దీనిని ప్రదర్శించకూడదా?
బయటివారికి ఇదొక వేషంలా కనిపిస్తుంది కానీ, తుళు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం. అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు. వేషంగా వేసుకుంటే సహించరు. భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు.
తెలుగుప్రజలు అరుణాచలానికి ఎక్కువగా ఎందుకు వెళతారు?
18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.






















































