విష్ణు విన్యాసం: చాదస్తపు లెక్చరర్‌గా శ్రీవిష్ణు నవ్వించాడా?

ఫొటో సోర్స్, sreevishnu29/Insta
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 4 నిమిషాలు
శ్రీవిష్ణుకి మంచి గుర్తింపు ఉంది. కామిక్ టైమింగ్‌తో 'సింగిల్' సినిమాలో మెప్పించాడు. విష్ణు విన్యాసంలో ఈ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా?
కథ ఏమిటంటే.. విష్ణుకి న్యూమరాలజీ, జాతకాలు, వాస్తు రకరకాల మూఢ నమ్మకాల పిచ్చి. ఇంట్లోని వాష్ రూమ్‌కి వాస్తు లేదని , పక్కింటి వాష్ రూమ్‌ని వాడి రెంట్ కట్టేంత చాదస్తం. అతనో కాలేజీలో జూనియర్ లెక్చరర్.
మనీషా (నయనసారిక) అదే కాలేజీలో సీనియర్ లెక్చరర్‌గా చేరుతుంది. అందరూ విష్ణుని రిజెక్ట్ చేస్తే ఆమె తన వద్ద జూనియర్‌గా తీసుకుంటుంది.
అతనితో కలిసి సిగరెట్, మందు తాగుతుంది. ప్రేమించేలా చేస్తుంది.
అయితే, ఆమెకి ఒక సమస్య ఉంటుంది. అదేంటి? అది తెలిసిన తర్వాత విష్ణు రియాక్షన్ ఏంటి? ఇది మిగతా కథ.


ఫొటో సోర్స్, sreevishnu29/Insta
సొసైటీలో సైన్స్ ఎంత పెరిగినా అదే స్థాయిలో మూఢ నమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. జాతకాలు, జ్యోతిష్యం ఆధారంగా గతంలో అనేక సినిమాలు వచ్చాయి. మచ్చ ఉన్న అమ్మాయిని చేసుకుంటే దశ తిరుగుతుందని నమ్మే కథ లేడీస్ టైలర్ (1986). ఆ రోజుల్లో పెద్ద హిట్.
విష్ణు విన్యాసం కూడా కామెడీకి స్కోప్ ఉన్న కథ. శ్రీవిష్ణుకి వన్‌లైనర్స్ , పంచ్‌లు కరెక్ట్‌గా కుదిరితే చెలరేగిపోతాడు. అయితే, ఈ సినిమాలో అక్కడక్కడ మాత్రమే నవ్వు వస్తుంది. కొన్నిసార్లు హీరో ఏదో గొణుక్కుంటున్నట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ మీరు నవ్వాలి అన్నట్టు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు.
దీనికి కారణం కథ సింగిల్ లైన్ కావడమే. అనేక పాత్రలు , లేయర్లు ఉంటే వర్కౌట్ అయ్యేది. రెండు గంటల సినిమాలో ఎక్కువ సమయం హీరో హీరోయిన్ల సీన్స్ ఉండడంతో రిపిటేషన్ అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ చూసిందే చూసినట్టు అనిపిస్తుంది.
శ్రీవిష్ణు బలం, చుట్టూ ఆర్టిస్టుల సపోర్ట్. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్ ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోలేదు. దాంతో హీరో క్యారెక్టర్ బలహీనపడింది. కొత్త సంఘటనలు లేకపోవడంతో ప్రేక్షకుడికి ఆసక్తి తగ్గింది.

ఫొటో సోర్స్, sreevishnu29/Insta
‘అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు’
క్లైమాక్స్‌లో హీరోయిన్ సమస్యకి అసలు కారణం తెలిసినా అది కన్విన్సింగ్‌గా అనిపించదు.
ఫస్టాఫ్ వరకూ బాగానే లాక్కొచ్చిన కొత్త దర్శకుడు యధునాథ్ మారుతీరావు సెకండాఫ్‌లో తడబడ్డాడు. కథని పెద్దగా పట్టించుకోకుండా కేవలం వన్‌లైనర్లతో నవ్వించడమే ఆయన ఉద్దేశం అయినప్పటికీ సగమే వర్కౌట్ అయ్యింది.
ఒక సీన్‌లో హీరో తల్లి అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటుంది. ఒక దశలో ప్రేక్షకుడి పరిస్థితి కూడా అదే.
సాయి శ్రీరామ్ కెమెరా సినిమాకి అదనపు బలం.

ఫొటో సోర్స్, sreevishnu29/Insta
ప్లస్ పాయింట్స్:
1.ఫస్టాఫ్
2.శ్రీవిష్ణు టైమింగ్
3.రెండు గంటల నిడివి
మైనస్ పాయింట్స్:
1.సెకండాఫ్
2.సంగీతం
(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













