Ind Vs Zimbabwe: భారీ స్కోరు దిశగా భారత్, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ, భారీ స్కోరు దిశగా వెళ్తోంది.
20 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్లకు 201 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 30 బంతుల్లో 55 పరుగులు చేసి ఔటయ్యాడు.
హార్డిక్ పాండ్యా, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు.
అభిషేక్ శర్మ 26 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు, శర్మ నాలుగు మ్యాచుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు.

ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా సూపర్ 8 మ్యాచ్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఫోర్లు సిక్సులతో తొలి మూడు ఓవర్లలోనే స్కోరును 45 పరుగులు దాటించారు.
అయితే 3.4 ఓవర్ల వద్ద భారత్ తొలి వికెట్ పడింది. సంజు శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి అవుటయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 48 పరుగులు.
ముజర్బానీ బౌలింగ్ లో బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి శాంసన్ పెవిలియన్ దారిపట్టాడు.
మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు చేసి ఔటయ్యాడు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్ కోసం భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది. జింబాబ్వే తమ జట్టులో ఒక మార్పు చేసింది. భారత జట్టులో అక్షర్ పటేల్, సంజు శాంసన్ తిరిగి చేరారు.
ఈ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ 11 నుంచి వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్‌లను తప్పించారు.
సెమీఫైనల్స్ రేసులో భారత్ నిలవాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం.
ఇందులో భారత్ జింబాబ్వేను ఓడించగలిగితే, సెమీఫైనల్‌కు చేరుకోవడానికి వెస్టిండీస్‌ను కూడా ఓడించాల్సి ఉంటుంది.
(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














