గూగుల్ ఇమేజెస్ ఆవిష్కరణకు కారణమైన జెన్నిఫర్ లోపెజ్ గౌనుకు కొత్త రూపం

జెన్నీఫర్ లోపేజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాజాగా జరిగిన ఫ్యాషన్ వీక్‌లో జెన్నీఫర్ లోపెజ్

గూగుల్ ఇమేజెస్‌ ఆవిష్కరణకు కారణమైన 20 ఏళ్ల కిందటి ఆకుపచ్చని గౌనును అమెరికన్ గాయని జెన్నిఫర్ లోపెజ్ ఆధునీకరించి మరోసారి ధరించారు.

50 ఏళ్ల జెన్నిఫర్ లోపెజ్ తొలిసారిగా 2000 ఫిబ్రవరిలో జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో ఈ గౌను ధరించారు.

ఆ కార్యక్రమం తర్వాత ఈ డ్రెస్సులో ఉన్న జెన్నిఫర్ ఫొటోల కోసం అనేక మంది ఇంటర్నెట్‌లో వెతికారని, దాంతో ఫొటోల కోసం కొత్త ఫీచర్ తీసుకురావాలన్న ఆలోచనతో, 'గూగుల్ ఇమేజెస్‌'ను ఆవిష్కరించామని గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్‌ కొన్నేళ్ల తర్వాత వెల్లడించారు.

ఆధునీకరించిన ఆ డ్రెస్సును ధరించి ఆమె తాజాగా ఒక ఫ్యాషన్ షోలో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు.

'వర్సేస్ ఎస్/ఎస్ 2020' పేరుతో ఇటలీలోని మిలాన్‌ నగరంలో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో శుక్రవారం నాడు ఆమె ఈ కొత్త డ్రెస్సుతో ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేశారు. ఆమె ర్యాంప్‌పై నడుస్తున్నప్పుడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో లక్షల మంది వీక్షించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

లైన్

ఈ కార్యక్రమంలో "ఓకే గూగుల్. ఇప్పుడు అసలైన డ్రెస్సును చూపించు" అని స్మార్ట్ స్పీకర్‌ ముందు అనగానే... జెన్నిఫర్ లోపెజ్ ఈ డ్రెస్సుతో బయటకొచ్చి, వీక్షకుల కేరింతల నడుమ ర్యాంప్‌ మీద క్యాట్‌వాక్ చేశారు.

2000 ఫిబ్రవరిలో జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో జెన్నిఫర్ లోపేజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2000 ఫిబ్రవరిలో జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్

1998లో గూగుల్‌ సెర్చింజన్‌ను ప్రారంభించారు. కానీ, అప్పుడు గూగుల్ ఇమేజెస్ రాలేదు. అది 2001 జులైలో అందుబాటులోకి వచ్చింది.

"గూగుల్ ప్రారంభించిన కొత్తలో, కంప్యూటర్‌లో కొన్ని పదాలను టైప్ చేసి ఏ విషయం గురించి అయినా తెలుసుకునే సదుపాయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పట్లో అదే అద్భుతంగా అనిపించేది. అయితే, ప్రస్తుత ఫీచర్లతో పోలిస్తే, అది అంత గొప్పేమీ కాదని ఇప్పుడు అనిపిస్తుంటుంది" అని 2015లో ఎరిక్ ష్మిట్‌ అన్నారు.

"గూగుల్‌లో కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు మా సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సర్జీ బ్రిన్ ఆలోచిస్తుండేవారు. 2000 ఫిబ్రవరిలో గ్రామీ అవార్డుల కార్యక్రమం సందర్భంగా జెన్నిఫర్ లోపెజ్ ఆకుపచ్చ గౌనులో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. జెన్నిఫర్ ఆ గౌనుతో ఉన్న ఫొటో కోసం అనేక మంది ఇంటర్నెట్‌లో శోధించారు. అంత భారీ స్పందన మేము ఎన్నడూ చూడలేదు. కానీ, నెటిజన్లు ఏం కోరుకుంటున్నారో అది మేం అప్పుడు ఇవ్వలేకపోయాం. ఆ సమస్యకు పరిష్కారంగా.. గూగుల్ ఇమేజెస్ పుట్టింది" అని ఎరిక్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)