అజయ్ దేవ్‌గణ్-కిచ్చా సుదీప్: హిందీ జాతీయ భాషా? భారతదేశంలో అధికార భాషలు ఏవి?

ఫొటో సోర్స్, @AmitShah
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''భిన్న భాషలు, భిన్న మాండలికాలు మన దేశపు బలం. కానీ విదేశీ భాషలకు చోటు దొరకకుండా ఉండటానికి మన దేశానికి ఒక భాష అవసరం ఉంది. అందుకే స్వాతంత్ర్య సమరయోధులు హిందీని రాజ భాష (జాతీయ భాష)గా అమలు చేయాలని కాంక్షించారు.''
హిందీ దివస్ (హిందీ దినోత్సవం) సందర్భంగా 2019 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలివి.
అమిత్ షా ఇదే అభిప్రాయాన్ని ట్విటర్‌లో కూడా వ్యక్తం చేశారు. ఆయన హిందీలో చేసిన ట్వీట్‌లో ''భారతదేశం భిన్న భాషల దేశం. ప్రతి భాషకూ దాని సొంత ప్రాధాన్యం ఉంది. కానీ మొత్తం దేశానికి ఒక భాష ఉండటం చాలా అవసరం. ఆ భాష అంతర్జాతీయంగా భారత గుర్తింపు కావాలి. నేడు దేశాన్ని ఐక్యం చేయగల ఒక భాష ఏదైనా ఉందంటే.. అది అత్యధికంగా మాట్లాడే భాష - హిందీయే'' అని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
హిందీ భాషను ఒకే దేశ భాషగా చేయాలన్నది మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ల స్వప్నం అంటూ.. హిందీ భాష ప్రతి ఇంటికీ, ప్రతి ఒక్కరికీ చేరాలని అమిత్ షా హిందీ దివస్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా భాష మీద దుమారం రేపాయి. రాజకీయంగానూ సాంస్కృతికంగానూ కలకలం రేకెత్తించాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి 'హిందీ జాతీయ భాష' ప్రతిపాదన మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు స్పందిస్తూ.. హిందీ భాషను రుద్దే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
విమర్శలు వెల్లువెత్తటంతో అమిత్ షా వివరణ ఇస్తూ.. ప్రాంతీయ భాషల మీద హిందీని రుద్దాలని తాను ఎన్నడూ అనలేదని చెప్పారు. మాతృభాష తర్వాత హిందీ నేర్చుకోవాలని మాత్రమే తాను కోరానన్నారు. ‘‘నేను కూడా హిందీయేతర రాష్ట్రమైన గుజరాత్ నుంచే వచ్చాను. ఎవరైనా రాజకీయాలు చేయాలనుకుంటే వారి ఇష్టం’’ అని వ్యాఖ్యానించారు.

అజయ్ దేవ్‌గణ్-కిచ్చా సుదీప్ ట్వీట్లు
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
తాజాగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ హిందీ జాతీయ భాష అంటూ కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
‘‘సోదరా కిచ్చా సుదీప్, నీ అభిప్రాయం ప్రకారం హిందీ మన జాతీయ భాష కాకపోతే నువ్వు నీ మాతృభాషలో తీసిన సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నావు? హిందీ మన మాతృభాష, జాతీయ భాష కూడా. ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతుంది కూడా’’ అని అజయ్ దేవ్‌గణ్ హిందీలో ట్వీట్ చేశారు.
దీనికి కిచ్చా సుదీప్ స్పందిస్తూ.. ‘‘అజయ్ దేవ్‌గణ్ సర్.. నేను ఆ మాట చెప్పిన పరిస్థితి వేరు. ఈసారి కలిసినప్పుడు నేను అలా ఎందుకు అన్నానో మీకు వివరిస్తా. ఎవరినీ బాధించేందుకు, రెచ్చగొట్టేందుకు, చర్చకు ఆస్కారం ఇచ్చేందుకు అలా అనలేదు. నేనలా ఎందుకు చేస్తా సర్’’ అని ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
‘‘మీరు హిందీలో చేసిన ట్వీట్‌ను నేను అర్థం చేసుకున్నా. ఎందుకంటే నేను హిందీ నేర్చుకున్నాను, (ఆ భాషను) గౌరవిస్తాను, ప్రేమిస్తాను కాబట్టి. మీరేం అనుకోకుంటే ఒక విషయం.. నేను కూడా కన్నడలోనే రిప్లై ఇచ్చి ఉంటే (మీ) పరిస్థితి ఏంటి? మేం కూడా భారత్‌కు చెందినవాళ్లమే కదా సర్.. కాదా’’ అని మరొక ట్వీట్ చేశారు.
దీనికి అజయ్ దేవ్‌గణ్ బదులిస్తూ.. ‘‘మిత్రమా.. అపార్థాలను తొలగించినందుకు కృతజ్ఞతలు. సినీ పరిశ్రమ అంతా ఒక్కటే అని నేను నమ్ముతా. మనం అన్ని భాషలనూ గౌరవిస్తాం, మన భాషను కూడా అంతా గౌరవించాలని కూడా కోరుకుంటాం. బహుశా ఈ విషయం చెప్పే క్రమంలో ఏదో తగ్గినట్లుంది’’ అని ఇంగ్లీషులో ట్వీట్ చేశారు.
దీనికి కిచ్చా సుదీప్ ముగింపు పలుకుతూ.. ఏదైనా క్రియేటివ్ రీజన్‌తో తనకు ట్వీట్ చేసి ఉంటే సంతోషించేవాడినని, ఏదైనా పూర్తి సమాచారం తెలియకుండా స్పందించడం సరికాదని తెలిపారు.

భారత జాతీయ భాష ఏమిటి?
నిజానికి.. 'జాతీయ భాష హిందీ' అనే ప్రతిపాదన, దాని మీద వివాదం ఇప్పటిది కాదు. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఈ అంశం తరచుగా తీవ్ర వివాదాలకు కారణమవుతోంది.
రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి ఒక జాతీయ భాష అనేది లేదు. జాతీయ స్థాయిలో అధికార భాషలుగా హిందీ, ఇంగ్లిష్‌లు కొనసాగుతున్నాయి. వీటితో పాటు.. రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూలులో చేర్చిన 22 భాషలకు కూడా అధికార భాషల హోదా ఉంది.
జాతీయ భాష అంటే.. జాతీయ పతాకం, జాతీయ జంతువు తరహాలో భారతదేశానికి, సంస్కృతికి ఒక చిహ్నంగా ఉండే భాష. ఒక భాషను ఒక దేశానికి జాతీయ భాషగా ప్రకటించటం అంటే.. ఆ దేశానికి చెందిన ప్రజలందరూ ఆ భాషా సంస్కృతులకు చెందిన వారనే సందేశాన్ని ప్రపంచానికి చాటడమేనని చెప్పొచ్చు.
అధికార భాష అంటే.. ఆ దేశ లేదా రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో, పాలన, అధికార యంత్రాంగం సమాచార మార్పిడిలో మిగతా రాష్ట్రాలతో సంప్రదింపుల్లో ఉపయోగించే భాష. పార్లమెంటు, అసెంబ్లీ సహా చట్టసభల చర్చల్లో, కోర్టు విచారణల్లో ఉపయోగించే భాష.
ఇక భిన్న భాషలున్న భారతదేశంలో సాంస్కృతికంగా దేశ సమైక్యతకు దోహదం చేయటానికి ఒక జాతీయ భాష అవసరమనే వాదన.. స్వాతంత్య్రానికి ముందు నుంచీ ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించే జాతీయ భాష ఒకటి కావాలన్న అంశం మీద స్వాతంత్ర్యం ముందూ, తర్వాతా సుదీర్ఘ చర్చ జరిగింది.
స్వాతంత్ర్యం తర్వాత దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాషను జాతీయ భాషగా చేయాలన్న ప్రతిపాదనల మీద వాడివేడిగా చర్చ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. ఈ అంశం అనేక వివాదాలకు, హింసాత్మక నిరసనోద్యమాలకు కూడా కారణమైంది.
హిందీ ఏకైక అధికారిక భాషగా ఉంటే.. దానివల్ల హిందీ రాని ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నది ప్రధాన అభ్యంతరమైతే.. తమది కాని భాషను తమపై బలవంతంగా రుద్దటం ఏమిటనేది రెండో అభ్యంతరం.

ఫొటో సోర్స్, Getty Images
జాతీయోద్యమం.. హిందీ ప్రచారం...
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో మొదలైన జాతీయోద్యమంలో భాగంగా.. ‘ఒక దేశం, ఒక భాష, ఒక సంస్కృతి’ అనే భావనను కూడా కొందరు నాయకులు బలపరుస్తూ వచ్చారు.
ఆ క్రమంలో హిందీ మాట్లాడని దక్షిణాది రాష్ట్రాలను - హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలను సమైక్యం చేసే ఉద్దేశంతో మహాత్మా గాంధీ స్వాతంత్య్రానికి మూడు, నాలుగు దశాబ్దాలు ముందుగానే దక్షిణాదిన హిందీ ఉద్యమం ప్రారంభించారు.
ఆయన నేతృత్వంలోనే అనీబిసెంట్ 1918లో నాటి మద్రాసు (నేటి చెన్నై) నగరంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభను స్థాపించారు. మద్రాస్ ప్రెసిడెన్సీతో పాటు దక్షిణాదిన ఉన్న హైదరాబాద్, మైసూర్ తదితర సంస్థానాల్లో హిందీ భాష నేర్చుకోవటాన్ని ప్రోత్సహించటం ఈ సంస్థ లక్ష్యం.

ఫొటో సోర్స్, Wiki
1937 హిందీ వ్యతిరేక ఉద్యమం...
1937లో నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని సి.రాజగోపాలాచారి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
దీనిని.. ద్రవిడ ఉద్యమ నాయకుడు పెరియార్ ఇ.వి.రామస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. నాటి జస్టిస్ పార్టీ సారథ్యంలో ప్రజలు ఉద్యమించారు. దాదాపు మూడేళ్ల పాటు ఈ ఉద్యమం సాగింది.
ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. వందలాది మంది అరెస్టయ్యారు. మరోవైపు రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొనటాన్ని నిరసిస్తూ 1939 అక్టోబర్‌లో రాజగోపాలాచారి ప్రభుత్వం రాజీనామా చేసింది.
ఆ తర్వాత 1940 ఫిబ్రవరిలో నాటి మద్రాస్ బ్రిటిష్ గవర్నర్ హిందీ తప్పనిసరి బోధన ఉత్తర్వులను రద్దు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజ్యాంగ సభలో ఏం జరిగింది?
స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ భారత ప్రభుత్వం పాలనా వ్యవహరాలన్నీ ఇంగ్లిష్ భాషలో సాగేవి. భారత ప్రజలకు ఒక జాతీయ భాషగా.. హిందువులు - ముస్లింల మధ్య ఐకమత్యానికి దోహదపడేలా హిందుస్తానీ భాషను ఉపయోగించాలని మహాత్మా గాంధీ అభిప్రాయపడేవారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ భాష వైపే మొగ్గింది.
స్వాతంత్య్రానికి ముందే పాలన, రాజకీయ వ్యవహారాలను పరిష్కరించుకోవటం కోసం బ్రిటిష్ ప్రభుత్వం భారత రాజ్యాంగ సభను 1946లో ఏర్పాటు చేసింది. ఈ సభలో ఆరంభం నుంచే భాష అనే అంశం వివాదాస్పదంగా మారింది.
జాతీయ పతాకం ఖరారైంది. జాతీయ భాష చర్చకు వచ్చేటప్పటికి సభలో కొందరు సభ్యులు హిందీ కావాలంటే.. ఇంకొందరు హిందుస్తానీ కావాలన్నారు. మరికొందరు ఇంగ్లిష్ వైపు మొగ్గుచూపారు. సంస్కృతం, బెంగాలీ, ఒడియాలను కూడా కొందరు సభ్యులు ప్రతిపాదించారు.
అయితే.. భావోద్వేగపరంగానూ జాతీయంగానూ సమైక్యత సాధించటం కోసం ఒక భారతీయ భాష ఉండాలని.. అధికారిక కార్యక్రమాలు, రాష్ట్రాలతో సంప్రదింపుల కోసం ఇంగ్లిష్ స్థానాన్ని ఆ భారతీయ భాషతో భర్తీ చేయాలని రాజ్యాంగసభలో చాలా మంది సభ్యులు భావించేవారు.
కానీ.. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఒకవైపు పాకిస్తాన్ వేరే దేశంగా ఏర్పడింది. మరోవైపు గాంధీ హత్యకు గురయ్యారు. దీంతో హిందుస్తానీ భాష ప్రాధాన్యం కోల్పోయింది. దానిని రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ నుంచి కూడా తొలగించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
హిందీ విషయంలో చీలిక...
భారతదేశానికి హిందీ భాష అధికారిక భాషగా ఉండాలని ఉత్తరాది ప్రాంత సభ్యులు పట్టుబట్టారు. జాతీయ స్థాయిలో హిందీని అధికారిక భాషగా అమలు చేయాలని, అన్ని రాష్ట్రాల్లో హిందీ భాషను అధికారిక భాషగా ప్రవేశపెట్టాలని వాదించారు.
''ఒక భాష ప్రజలను ఐక్యం చేస్తుంది. రెండు భాషలు ప్రజలను విడదీస్తాయి. సంస్కృతిని భాష పరిరక్షిస్తుంది. భారతీయులు సమైక్యం కావాలని, ఒక ఉమ్మడి సంస్కృతిని అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారు కనుక భారతీయులందరూ హిందీని తమ భాషగా సొంతం చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది'' అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా అభిప్రాయపడ్డారు.
కానీ.. ఈ వాదనలతో దక్షిణాది రాష్ట్రాల సభ్యులు కొందరు విభేదించారు. హిందీని ఏకైక అధికారిక భాషగా చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హిందీ మాట్లాడని ప్రజల మీద ఆ భాషను బలవంతంగా రుద్దటానికి హిందీ మాట్లాడే ప్రాంతాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
''మా భాష కాని ఇంగ్లిష్ భాషనే అయిష్టంగా నేర్చుకున్నాం. ఇప్పుడు హిందీని బలవంతంగా నేర్చుకోవటానికి మేం సిద్ధంగా లేం. కేంద్ర ప్రభుత్వ భాషను మాట్లాడని వారిని బానిసలుగా చేసుకునే భయం మాకు కలుగుతుంది. ఇప్పటికే వేర్పాటు కోరుతున్న శక్తులు దక్షిణ భారతదేశంలో ఉన్నాయని దక్షిణ భారత దేశ ప్రజల తరఫున నేను హెచ్చరించదలచుకున్నాను. యూపీలోని నా గౌరవ మిత్రులు 'హిందీ సామ్రాజ్యవాదా'న్ని బలంగా రుద్దటం వల్ల ఉపయోగం ఉండదని చెప్తున్నా. మొత్తం భారతదేశం కావాలా లేదంటే హిందీ-భారతదేశం కావాలా అనేది వారి ఇష్టం'' అని టి.టి.కృష్ణమాచారి పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
మున్షీ - అయ్యంగార్ ఫార్ములా...
ఎటూ తెగని ఈ చర్చలతో భిన్నాభిప్రాయాలతో రాజ్యాంగ సభ చీలిపోయే పరిస్థితి తలెత్తింది.
దేశవ్యాప్తంగా హిందీ అభివృద్ధి చెందలేదు కనుక.. ఆ భాష అభివృద్ధి చెందే వరకూ ఇంగ్లిష్‌ను కూడా అధికారిక భాషగా కొనసాగించాలని కొందరు సూచించారు. నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కూడా హిందీ వైపే మొగ్గుచూపారు. అయితే.. హిందీ మాట్లాడని వారి మీద దానిని బలవంతంగా రుద్దకూడదని పేర్కొన్నారు.
ఆ నేపథ్యంలో అధికారిక భాషల విషయంలో సభ్యులందరికీ ఆమోదయోగ్యమైన అంశాలను రూపొందించే పనిని రాజ్యాంగ సభ సభ్యులైన కె.ఎం.మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్‌లకు అప్పగించారు. వారు రూపొందించిన ఫార్ములాను 'మున్షీ - అయ్యంగార్' ఫార్ములాగా వ్యవహరిస్తారు.
ఈ ఫార్ములా అధికారిక భాష అని మాత్రమే చెప్పింది కానీ.. జాతీయ భాష ప్రతిపాదన ఏదీ చేయలేదు. దీని ప్రకారం.. హిందీని దేవనాగరి లిపిలో భారత సమాఖ్య అధికార భాషగా అమలు చేయటంతో పాటు.. ఇంగ్లిష్‌ను కూడా 15 సంవత్సరాల పాటు అధికారిక భాషగా కొనసాగించాలి.
ఆ పదిహేను సంవత్సరాల కాలం తర్వాత.. పార్లమెంటు చట్టం ద్వారా ఇంగ్లిష్‌ను అధికారిక భాషగా కొనసాగించవచ్చునని రాజ్యాంగంలోని ఆర్టికల్ 343లో పొందుపరచారు. ఈ ఫార్ములాను రాజ్యాంగ సభ 1948 సెప్టెంబర్ 14వ తేదీన ఆమోదించింది.
ఈ అంశాలను పొందుపరచిన రాజ్యంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. అయినా.. హిందీని అధికార భాషగా ఆమోదించిన సెప్టెంబర్ 14వ తేదీని 'హిందీ దివస్'గా నిర్వహిస్తున్నారు.

ఎనిమిదో షెడ్యూలులో అధికారిక భాషలు...
అదే సమయంలో దేశంలో హిందీ భాషను పెంపొందించటానికి.. దేశంలోని ఇతర ప్రధాన భాషలను ఉపయోగించుకోవటం ద్వారా హిందీని సుసంపన్నం చేయటం కోసం ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషలను అధికారిక భాషలుగా గుర్తిస్తూ రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో చేర్చారు.
అయితే.. అనంతర కాలంలో ఈ షెడ్యూలులోని భాషల ప్రాధాన్యం మరింతగా పెరిగింది. హిందీతో పాటు ఈ భాషలను కూడా అభివృద్ధి చేయటం భారత ప్రభుత్వ రాజ్యాంగ విధి అయింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 344(1), ఆర్టికల్ 355ల ప్రకారం ఎనిమిదో షెడ్యూలులో ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. అవి:
1. అస్సామీస్, 2. బెంగాలీ, 3. గుజరాతీ, 4. హిందీ, 5. కన్నడ, 6. కశ్మీరీ, 7. కొంకణి, 8. మలయాళం, 9. మణిపురి, 10. మరాఠీ, 11. నేపాలీ, 12. ఒడియా, 13. పంజాబీ, 14. సంస్కృతం, 15. సింధీ, 16. తమిళం, 17. తెలుగు, 18. ఉర్దూ, 19. బోడో, 20. సంతాలీ, 21. మైథిలి, 22. డోగ్రీ.
వీటిలో తెలుగు, తమిళం వంటి వాటితో పాటు 14 భాషలు భారత రాజ్యాంగంలో మొదటి నుంచీ ఉన్నాయి. సింధీ భాషను 1967లో చేర్చారు. 1992లో కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను చేర్చారు. అనంతరం 2004లో బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలీ భాషలను చేర్చారు.
రాష్ట్రాలు ఈ భాషల్లో ఒకటి లేదా ఎక్కువ భాషలను తమ అధికారిక భాష లేదా భాషలుగా ఎంచుకోవచ్చు.
మరోవైపు.. ఇంగ్లిష్, భోజ్‌పురి పాలీ, తుళు తదితర 38 భాషలను కూడా ఎనిమిదో షెడ్యూలులో చేర్చాలని, అధికారిక భాషలుగా గుర్తించాలని డిమాండ్లు ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
1965 హిందీ వ్యతిరేక ఉద్యమం...
ఇంగ్లిష్‌ను అధికారిక భాషగా కొనసాగించటానికి రాజ్యాంగంలో ప్రాథమికంగా పేర్కొన్న 15 ఏళ్ల కాలం 1965 జనవరి 26వ తేదీతో ముగిసింది.
అయితే.. అధికారిక భాషగా హిందీని మాత్రమే కొనసాగిస్తూ ఇంగ్లిష్‌ను తొలగించటానికి అవసరమైన విధంగా హిందీ భాష అభివృద్ధి చెందలేదు. దీంతో 1963లో కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటులలో ఇంగ్లిష్ భాష వినియోగాన్ని కొనసాగించటం మీద కొత్త అధికారిక భాషల చట్టాన్ని రూపొందించారు.
నాడు ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ, హోంమంత్రిగా లాల్‌బహదూర్ శాస్త్రిలు ఉన్నారు. లాల్‌బహదూర్ ఈ బిల్లును 1963 ఏప్రిల్ 13న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
'రాజ్యాంగంలో పేర్కొన్న 15 సంవత్సరాల గడువుతో నిమిత్తం లేకుండా (అంటే 1965 తర్వాత కూడా) హిందీతో పాటు ఇంగ్లిష్‌ను కూడా అధికారిక భాషగా కొనసాగించవచ్చు‘ అని ఈ బిల్లు పేర్కొంది.
కానీ.. బిల్లులో ఇంగ్లిష్‌ను అధికార భాషగా ‘కొనసాగించవచ్చు’ (.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ మే కంటిన్యూ...) అనే పదాలు వాడటం పట్ల దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘కొనసాగించవచ్చు’ అనే పదాన్ని ‘కొనసాగించాలి’ (‘ఇంగ్లిష్ లాంగ్వేజ్ మే కంటిన్యూ’ బదులు ‘ఇంగ్లిష్ లాంగ్వేజ్ షల్ కంటిన్యూ’) అని ఉండేలా బిల్లును మార్చాలని డీఎంకే రాజ్యసభ సభ్యుడు సి.ఎన్.అన్నాదురై డిమాండ్ చేశారు.
పార్లమెంటులో వాడివేడి చర్చ అనంతరం ఈ బిల్లును ఉభయసభలూ ఆమోదించాయి. రాష్ట్రపతి అదే ఏడాది మే 10వ తేదీన ఆమోదించటంతో చట్టంగా మారింది.
దీంతో తమిళనాడులో అన్నాదురై హిందీ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు. విద్యార్థుల నుంచి భారీ ఎత్తున నిరసన పెల్లుబికింది.
మరోవైపు.. ఇంగ్లిష్ భాషను హిందీయేతర రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దబోమని హామీ ఇచ్చిన నెహ్రూ 1964లో చనిపోయారు. దీంతో ఆయన హామీని గౌరవించరన్న ఆందోళన కూడా తమిళనాడులో తీవ్రమైంది.
ఈ నేపథ్యంలో 1965 జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పారా మిలటరీ బలగాలను మోహరించింది. ఈ హింసలో దాదాపు 70 మంది ఆందోళనకారులు, ఇద్దరు పోలీసులు చనిపోయారని అధికారిక అంచనా.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
అధికారిక భాషా చట్టానికి 1967 సవరణ
నాటి ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌శాస్త్రి హామీతో ఆందోళనలు చల్లారాయి. అయితే.. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అధికార భాషా చట్టానికి సవరణ చేయటానికి హిందీ రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో చట్టాన్ని సవరించే ప్రయత్నాలు ముందుకు సాగలేదు.
1966లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. 1967 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ తగ్గినా తిరిగి అధికారంలోకి వచ్చింది. కానీ తమిళనాడులో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. హిందీ వ్యతిరేక ఉద్యమానికి సారథ్యం వహించిన డీఎంకే అధికారంలోకి వచ్చింది.
దీంతో 1963 అధికార భాషా చట్టంలోని సెక్షన్-3ను 1967 డిసెంబర్‌లో సవరించారు.
హిందీని అధికారిక భాషగా ఎంచుకోని రాష్ట్రంతో సమాచార మార్పిడికి ఇంగ్లిష్‌ను అధికార భాషగా ఉపయోగించటం తప్పనిసరి చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నిటికీ 1965కు ముందున్నట్లుగా హిందీతో పాటు ఇంగ్లిష్ భాష వినియోగాన్ని తప్పనిసరి చేశారు.
అలాగే.. ఏవైనా రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా ఒక రాష్ట్ర అధికార భాష హిందీ కాకపోయినట్లయితే.. ఆ రెండు రాష్ట్రాల మధ్య సమాచార సంబంధాలకు ఇంగ్లిష్‌నే అధికార భాషగా ఉపయోగించటం తప్పనిసరి.
దేశంలో హిందీ అధికారిక భాషగా లేని రాష్ట్రాలతో పాటు పార్లమెంటు కూడా.. ఇంగ్లిష్ భాష వినియోగాన్ని నిలిపివేస్తూ తీర్మానాలు చేసే వరకూ ఇంగ్లిష్ అధికార భాషగా కొనసాగుతుంది.
కానీ.. హిందీ విషయంలో 1968లో, 1986లో, 2004 ల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉద్యమాలు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు సభలు తేల్చిందేమిటి?
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- మీ పిల్లలను ఏ భాషలో చదివిస్తారు? మాతృభాషలోనా.. లేక ఇంగ్లిష్‌లోనా
- తెలుగులో వాడుక భాషకు పట్టం గట్టిందెవరు?
- పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా
- చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...
- అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు
- టీవీ చానల్స్ నిలిపివేత ఎమ్మెస్వోల ఇష్టమా? ట్రాయ్ పాత్ర ఏంటి?
- ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















