#BloodNormal: పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, ASALEO CARE
శానిటరీ ప్యాడ్స్ టీవీ ప్రకటనల్లో రక్తాన్ని చూపించడంపై వచ్చిన ఫిర్యాదులను ఆస్ట్రేలియా యాడ్స్ సెల్ఫ్ రెగ్యులేషన్ సంస్థ ‘యాడ్ స్టాండర్డ్స్’ తోసిపుచ్చింది.
సాధారణంగా శానిటరీ ప్యాడ్స్ ప్రకటనల్లో రక్తాన్ని ఎరుపు రంగులో కాకుండా నీలి రంగులో చూపుతుంటారు.
కానీ, లిబ్రా అనే సంస్థ రక్తాన్ని ఎరుపు రంగులోనే చూపిస్తూ గత నెలలో టీవీల్లో ప్రకటనలు ఇచ్చింది. ప్యాడ్లపై, లోదుస్తులపై రక్తం మరకలను చూపించింది. మహిళ కాళ్లపై రక్తం కారుతున్నట్లుగా ఉన్న దృశ్యాలు కూడా వీటిలో ఉన్నాయి.
ఆస్ట్రేలియాలో రక్తాన్ని ఎరుపు రంగంలో చూపిస్తూ శానిటరీ ప్యాడ్ల ప్రకటనలు ఇవ్వడం ఇదే తొలిసారి.
ఈ యాడ్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 600కుపైగా వీక్షకులు యాడ్ స్టాండర్డ్స్‌కు ఫిర్యాదులు చేశారు. 2019లో అత్యధిక ఫిర్యాదులు వచ్చిన యాడ్ ఇదే.

ఫొటో సోర్స్, ASALEO CARE
అయితే, ఆ ఫిర్యాదులన్నింటినీ యాడ్ స్టాండర్డ్స్ తోసిపుచ్చింది. ఈ ప్రకటనల ద్వారా లిబ్రా గొప్ప సందేశం ఇస్తోందని అభినందించింది.
సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ, నెలసరి గురించి అపోహలను తొలగించేలా ఆ ప్రకటనలు ఉన్నాయని ప్రశంసించింది.
లిబ్రా మాతృ సంస్థ అసలియో కేర్ కూడా ఈ ప్రకటనలను సమర్థిస్తూ మాట్లాడింది.
నెలసరి సమయంలో ఎంతో మంది మహిళలు, బాలికలు ఎదుర్కొనే సమస్యలను ఈ యాడ్స్ చక్కగా చూపించాయని పేర్కొంది.
'పీరియడ్స్ సాధారణం. వాటిని చూపించడం కూడా సాధారణమే కావాలి' అని ఈ యాడ్స్‌లో లిబ్రా నినాదం ఇచ్చింది.
ఈ యాడ్‌లో చూపించిన దృశ్యాలు 'అభ్యంతరకరంగా, అసహ్యకరంగా' ఉన్నాయని ఫిర్యాదుదారుల్లో కొంతమంది పేర్కొన్నారు.
''టీవీల్లో రక్తం లాంటివి చూసేందుకు కొందరు ఇష్టపడకపోవచ్చు. కానీ, ఆ ప్రకటనలు ఎలాంటి నియమాలనూ ఉల్లంఘించలేదు'' అని యాడ్ స్టాండర్డ్స్ వారికి బదులిచ్చింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ప్రైమ్ టైమ్‌లో గానీ, చిన్నారులు టీవీలు చూసే సమయంలో ఆ యాడ్స్ ఇవ్వకూడదన్న వాదనను కూడా యాడ్ స్టాండర్డ్స్ తోసిపుచ్చింది.
''నెలసరి పట్ల మహిళలు సిగ్గు పడే విధంగానో, వాళ్లేదో తక్కువని చూపించేలానో ఆ ప్రకటనలు లేవు'' అని యాడ్ స్టాండర్డ్స్ కేస్ రిపోర్ట్‌లో పేర్కొంది.
తమ అనుబంధ సంస్థ ఎస్సిటీ.. బ్లడ్‌నార్మల్ (#BloodNormal) పేరుతో చేపట్టిన కార్యక్రమం ఆధారంగా ఈ ప్రకటనలు రూపొందించినట్లు అసలియో కేర్ తెలిపింది.
#BloodNormalలో భాగంగా శానిటరీ ప్యాడ్ల ప్రకటనలపై రక్తాన్ని నీలి రంగులో కాకుండా ఎరుపు రంగులో చూపించే ట్రెండ్ 2017లో బ్రిటన్‌లో మొదలైంది. యూరప్, అమెరికా, దక్షిణాఫ్రికా.. ఇలా అన్నీ దేశాలకు ఈ ప్రకటనలు విస్తరిస్తున్నాయి.
2011లో ఆల్వేస్ అనే సంస్థ తొలిసారి శానిటరీ ప్యాడ్లపై ఎర్రటి చుక్కను చూపిస్తూ ప్రకటనలు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు
- అఫ్గానిస్థాన్ రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో రక్తసిక్త వాస్తవాలు
- అందం కోసం వాడే క్రీములతో అనర్థాలెన్నో
- ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'.. మానవ విపత్తులా మారిన ఫేస్‌బుక్ ఈవెంట్
- ఈ సుఖవ్యాధులు రోజుకు 10 లక్షల మందికి సోకుతున్నాయి.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయి
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- డేటింగ్ యాప్స్ వాడే వాళ్లు అందం కోసం ఏం చేస్తున్నారో ఊహించగలరా
- ఈ బంగారు టాయిలెట్‌ను ప్యాలస్ నుంచి ఎత్తుకెళ్లారు
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- అమెరికా గూఢచర్యం: ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పావురాలు సీక్రెట్ ఏజెంట్స్‌గా ఎలా పని చేశాయి... గుట్టు విప్పిన సిఐఏ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








