బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన దంపతుల ఖాతాలోకి అనుకోకుండా 1.20 లక్షల డాలర్లు వచ్చిపడ్డాయి. అవి ఎలా వచ్చాయో వారికి తెలీదు. కానీ వెంటనే అందులో లక్ష డాలర్లు ఖర్చు పెట్టేశారు. వాళ్లు డబ్బులు దొంగిలించారని బ్యాంకు కేసు పెట్టింది.
రాబర్ట్, టిఫనీ విలియమ్స్ దంపతుల బీబీ అండ్ టీ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ ఏడాది మే 31వ తేదీ వీరి ఖాతాలోకి బ్యాంకు పొరపాటున 1,20,000 డాలర్లు డిపాజిట్ చేసింది. అంటే దాదాపు 90 లక్షల రూపాయలు.
నిజానికి ఆ డబ్బులను ఒక పెట్టుబడి సంస్థకు బదిలీ చేయాల్సి ఉండగా పొరపాటున వీరి ఖాతాలో జమ చేశారని పోలీసులు చెప్పారు.
అయితే తమ ఖాతాలోకి డబ్బులు ఎలా వచ్చాయో విలియమ్స్ దంపతులకు తెలీదు. కానీ ఖాతాలో డబ్బులు చూడగానే ఖర్చు చేయటం మొదలుపెట్టారు. ఆ డబ్బులతో ఒక ఎస్‌యూవీతో పాటు ఇతర వస్తువులూ కొనుగోలు చేశారని పోలీసులు చెప్తున్నారు.
బ్యాంకు సిబ్బంది జూన్ 20వ తేదీన తమ పొరపాటును గుర్తించారు. వెంటనే విలియమ్స్ ఖాతాలో నుంచి డబ్బును వెనక్కు తీసుకుని సరైన ఖాతాలోకి పంపించారు.
అయితే.. అప్పటికే ఆ దంపతులు దాదాపు 1,07,000 డాలర్లు (దాదాపు రూ. 77 లక్షలు) ఖర్చు పెట్టేశారని పోలీసులు చెప్పారు.
బ్యాంకు సిబ్బంది వీరిని సంప్రదించినపుడు.. ''తన దగ్గర ఆ డబ్బులేవీ లేవని వారికి అన్నీ ఖర్చు పెట్టేశామని చెప్పారు'' అని పోలీసులు ఫిర్యాదులో పేర్కన్నట్లు సీబీఎస్ న్యూస్ తెలిపింది.
ఖర్చు చేసిన డబ్బులను తిరిగి చెల్లించటానికి ఒక ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తామని విలియమ్స్ చెప్పారు. అయితే.. ఆ తర్వాత ఆ దంపతులు మళ్లీ బ్యాంకు సిబ్బందితో మాట్లాడలేదని పోలీసులు పేర్కొన్నారు.
దీంతో బ్యాంకు డబ్బును ఈ దంపతులు చోరీ చేశారంటూ బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డబ్బుతో ఒక చెవర్లే ట్రావెర్స్ ఎస్‌యూవీతో పాటు రెండు కార్లు, ఒక క్యాంపర్, ఒక రేస్ కారు, ఇతర గృహోపకరణాలు కొనుగోలు చేశారని ఫిర్యాదులో వివరించారు. అంతేకాదు.. స్నేహితులకు 15,000 డాలర్లు సాయం కూడా చేశారని చెప్పారు.
దర్యాప్తు అధికారులు జూలైలో ఈ దంపతులతో మాట్లాడినపుడు.. తమ బ్యాంకు ఖాతాలోకి వచ్చిన డబ్బులు తమవి కావని తమకు తెలుసునని రాబర్ట్ (36), టిఫనీ (35) అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ డబ్బులు రాకముందు వీరి ఖాతాలో సగటున 1,000 డాలర్లు బ్యాలెన్స్ ఉండేది.
ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు.
''క్లయింటు గోప్యతా ప్రమాణాల దృష్ట్యా ఈ అంశం వివరాల గురించి మేం వ్యాఖ్యానించలేం. మా క్లయింట్ల మీద ప్రభావం చూపే ప్రతి అంశాన్నీ సత్వరం పరిష్కరించటానికి ప్రయత్నిస్తాం'' అని బీబీ అండ్ టీ బ్యాంక్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు పంపిన ఒక ప్రకటనలో చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- ‘ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు’.. బరువు 130 కేజీలు.. వారానికి ఏడు కోళ్లు తింటాడు.. ఐదు రోజులు జిమ్‌లోనే ఉంటాడు
- ‘పాకిస్తాన్లో మైనార్టీలకు రక్షణ లేదు.. భారత్‌లో ఉంటా.. ఆశ్రయం ఇవ్వండి’ - ఇమ్రాన్ ఖాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థన
- ఎన్ఆర్సీ: పౌరసత్వం చట్రంలో నలిగిపోతున్న అసోం చిన్నారులు
- ఆత్మహత్యల ఆలోచనలను గుర్తించడమెలా, వారితో ఎలా మాట్లాడాలి
- పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి నిరాకరించిన 10 మంది శ్రీలంక క్రికెటర్లు
- విశాఖపై ఆర్థిక మాంద్యం ప్రభావం: ఆర్డర్లు తగ్గాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి
- చంద్రయాన్ 2: మోదీ కెమెరాలను చూసే ఇస్రో చీఫ్ శివన్‌ను ఓదార్చారా.. అసలు నిజం ఏమిటి – Fact Check
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- అక్కడ వేల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.. వజ్రాలు వర్షంలా కురుస్తాయి
- అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?
- చంద్రయాన్-2: విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు ఇస్రోకు మళ్లీ సాధ్యమేనా
- "చనిపోయిన భర్త జుట్టు, గోళ్లతో చేసే సూప్ తాగిస్తారు"
- మంగాయమ్మ: ఐవీఎఫ్ పద్ధతిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








