భారత సమాజ వర్గీకరణకు 'కెమెరా' బ్రిటిష్ పాలకులకు ఎలా ఉపయోగపడిందంటే..

భారత దేశం, బ్రిటిష్ ప్రభుత్వం, కులాల వర్గీకరణ, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్, దిల్లీ

ఫొటో సోర్స్, DAG

ఫొటో క్యాప్షన్, 20వ శతాబ్దపు తొలి నాళ్లలో నాట్యకారిణులు. ఈ ఫోటోను ఎడ్వర్డ్ టౌరినెస్ తీశారు.
    • రచయిత, సుధా జి తిలక్
  • చదివే సమయం: 4 నిమిషాలు

భారత దేశం 19వ శతాబ్ధపు ద్వితీయార్థంలో ఎలా ఉండేదో తెలుసుకునేందుకు, వర్గీకరించేందుకు ఫోటోగ్రఫీ బ్రిటిష్ వారికి ఒక ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగపడింది.

టైప్‌క్యాస్టింగ్: ఫోటోగ్రాఫింగ్ ది పీపుల్స్ ఆఫ్ ఇండియా పేరుతో దిల్లీకి చెందిన డీఏజీ ఆర్ట్ గ్యాలరీ నిర్వహించిన ప్రదర్శనలో.. భారత సమాజ వర్గీకరణకు, వ్యక్తుల లేదా వృత్తుల గుర్తింపును నిర్ధరించేందుకు, దేశంలోని సంక్లిష్ట సామాజిక విభేదాలను వలస ప్రభుత్వం సులువుగా అర్థం చేసుకునేందుకు కెమెరాను ఉపయోగించిన 1855 నుంచి 1920 మధ్య కాలానికి చెందిన 200 అరుదైన ఫోటోలను ఒకచోటకు చేర్చారు.

ఆ 65 ఏళ్ల కాలానికి సంబంధించిన ఈ ప్రదర్శన.. ఈశాన్య భారతంలోని లెప్చా, భూటియాల నుంచి, వాయువ్యంలో అఫ్రిదీలు, నీలగిరిలోని తోడాలు, పశ్చిమ భారతంలోని పార్సీలు, గుజరాతీ సంపన్నుల వరకు మనుషుల భౌగోళిక విస్తరణను ప్రతిబింబిస్తుంది.

వలస పాలనలో సామాజికంగా దిగువ స్థాయి వర్గాలుగా పేర్కొన్న నృత్యకారిణులు, వ్యవసాయ కూలీలు, క్షురకులు, పాములను ఆడించే వాళ్లను కూడా ఇది పట్టి చూపుతుంది.

ఈ చిత్రాలు భారతీయ వైవిధ్యాన్ని గురించి మాత్రమే కాదు, ఫోటోగ్రఫీ ద్వారా వారు, వీరు అంటూ వర్గాలుగా స్థిరపరిచేందుకు, సులభంగా గుర్తించగలిగే వర్గాలుగా మార్చేందుకు ఉపయోగించిన తీరుకు అద్దం పడతాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ది పీపుల్ ఆఫ్ ఇండియా పేరుతో 1868-1875 మధ్య ప్రచురితమైన 8 వాల్యూమ్‌ల ఫోటో‌గ్రాఫిక్ సర్వే‌ కేంద్రీకృతంగా ఉన్న ఈ ప్రదర్శనను, చరిత్రకారిణి సుదేష్ణ గుహ రూపొందించారు. వీటిలో ప్రధానంగా, వలస పాలన కాలపు పరిస్థితులను కళ్లకు కట్టే శామ్యూల్ బౌర్న్, లాలా దీన్ దయాళ్, జాన్ బర్క్, షెపర్డ్ అండ్ రాబర్ట్‌సన్ వంటి ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలను చేర్చారు. వీటిని సిల్వల్ జెలటిన్ కోటింగ్ ప్రింట్ చేసి ఆల్బమ్‌గా మార్చారు.

"ఈ ఫోటోల సేకరణను మొత్తంగా కలిపి చూస్తే, ఎథ్నోగ్రాఫిక్ ఫోటోగ్రఫీ చరిత్రను.. అది బ్రిటిష్ పాలకులపై, భారతీయులపై చూపిన ప్రభావాన్ని వివరిస్తుంది. అప్పటి పరిస్థితుల గురించి లోతైన అవగాహన కలిగించే ఇలాంటి సేకరణ భారత్‌లో గతంలో ఎన్నడూ చూడలేదు" అని డీఏజీ సీఈఓ ఆశిష్ ఆనంద్ చెప్పారు.

ఆ ఎగ్జిబిషన్‌ నుంచి కొన్ని ఎంపిక చేసిన చిత్రాలివి:

భారత దేశం, బ్రిటిష్ ప్రభుత్వం, కులాల వర్గీకరణ, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్, దిల్లీ

ఫొటో సోర్స్, DAG

ఫొటో క్యాప్షన్, పిడకలను మోస్తున్న మహిళల చిత్రం, దీనిని 1890లో బొంబాయ్‌లో ఎడ్వర్డ్ టౌరినెస్‌ తీశారు. సాధారణంగా మహిళలు ఇంటి లోపల చేసే పనులను, ఫోటో కోసం ఆరుబయట తీశారు.
భారత దేశం, బ్రిటిష్ ప్రభుత్వం, కులాల వర్గీకరణ, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్, దిల్లీ

ఫొటో సోర్స్, DAG

ఫొటో క్యాప్షన్, 1890లో భారతీయ మహిళ, ఫెలిక్స్ మోరిన్ తీసన ఈ ఫోటో ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఫోటో అప్పటి ఎథ్నోగ్రఫిక్ దృష్టిని మాత్రమే కాకుండా, ప్రారంభంలో ఫోటోగ్రఫిక్ శైలికి కూడా అద్దం పడుతుంది.
భారత దేశం, బ్రిటిష్ ప్రభుత్వం, కులాల వర్గీకరణ, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్, దిల్లీ

ఫొటో సోర్స్, DAG

ఫొటో క్యాప్షన్, ఇది 1862 నాటి చిత్రం. 'ఖైబర్ పాస్ నుంచి వచ్చిన అఫ్రిదీల సమూహం'. ఈ ఫోటోను చార్లెస్ షెపర్డ్ తీశారు. పఠాన్ తెగకు చెందిన వీరిని అఫ్గాన్ సరిహద్దుల వెంబడి స్వతంత్రంగా సంచరించే జాతి అని బ్రిటిషర్లు అభివర్ణించారు.
భారత దేశం, బ్రిటిష్ ప్రభుత్వం, కులాల వర్గీకరణ, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్, దిల్లీ

ఫొటో సోర్స్, DAG

ఫొటో క్యాప్షన్, వీధిలోనే క్షవరం చేస్తున్న ఫోటో ఇది. వీధుల్లో జరిగే పనులు, రోజువారీ జరిగే విషయాలు.. సాధారణ కార్మికులను వర్గీకరణ అంశాలుగా మారుస్తాయి.
భారత దేశం, బ్రిటిష్ ప్రభుత్వం, కులాల వర్గీకరణ, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్, దిల్లీ

ఫొటో సోర్స్, DAG

ఫొటో క్యాప్షన్, బొంబాయి ఫోటోగ్రాఫిక్ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడైన విలియం జాన్సన్ 1857లో 'ది ఇండియన్ అమెచ్యూర్స్ ఫోటోగ్రాఫిక్ ఆల్బమ్' సంచికలో 'బ్రాహ్మణ మహిళలు' అనే పేరుతో ఈ చిత్రాన్ని ప్రచురించారు. ఈ ఇద్దరు మహిళలు తెలివైనవారని, తండ్రి, భర్త ప్రోత్సాహంతో బొంబాయిలోని మిషన్ స్కూల్‌లో ఇంగ్లిష్ అభ్యసించేందుకు వచ్చారని అందులో రాశారు.
భారత దేశం, బ్రిటిష్ ప్రభుత్వం, కులాల వర్గీకరణ, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్, దిల్లీ

ఫొటో సోర్స్, DAG

ఫొటో క్యాప్షన్, బ్రిటిష్ పాలకుల బంగ్లా ముందు కూర్చుని పార్సీల బృందం తమ దుస్తులు, వేషధారణ ద్వారా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ ఫోటోను విలియం జాన్సన్ తీసినట్లుగా భావిస్తున్నారు.
భారత దేశం, బ్రిటిష్ ప్రభుత్వం, కులాల వర్గీకరణ, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్, దిల్లీ

ఫొటో సోర్స్, DAG

ఫొటో క్యాప్షన్, సిక్కిం, భూటాన్, టిబెట్‌కు చెందిన భూటియాల గ్రూప్ ఇది. ఆ కాలంలో ఈ ప్రాంతాలన్నీ బ్రిటిష్ పాలనలో ఉండేవి. 1890లో బెంజమిన్ సింప్సన్ ఈ చిత్రాన్ని తీశారు.
భారత దేశం, బ్రిటిష్ ప్రభుత్వం, కులాల వర్గీకరణ, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్, దిల్లీ

ఫొటో సోర్స్, DAG

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్రలో పురాతన రాతి బౌద్ధ విగ్రహాల వద్ద సంగీీత వాద్య కళాకారులు కూర్చున్న ఈ చిత్రాన్ని చార్లెస్ స్కాట్ తీశారు.
భారత దేశం, బ్రిటిష్ ప్రభుత్వం, కులాల వర్గీకరణ, ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్, దిల్లీ

ఫొటో సోర్స్, DAG

ఫొటో క్యాప్షన్, 19వ శతాబ్దపు చివర్లో సింగపూర్‌లో ఉన్న భారతీయ కుటుంబం ఇది.