ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
ఇ-సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకాలపై నిషేధం విధించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
పొగతాగడాన్ని నియంత్రించడంలో ఇ-సిగరెట్లు విఫలమయ్యాయని, స్కూల్ పిల్లల్లో పోగతాగడాన్ని ఇవి పెంచాయని పేర్కొన్నారు. అందువల్లే ఇ-సిగరెట్ల ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు, ఉత్పత్తి, నిల్వలు, ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు.
ఇ-సిగరెట్లపై నిషేధానికి ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. ప్రతిపాదిత ఆర్డినెన్స్‌ను ఉల్లంఘించినవారికి గరిష్టంగా ఒక ఏడాది జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు.
యువత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇ-సిగరెట్లపై నిషేధానికి నిర్ణయం తీసుకున్నట్లు సీతారామన్ చెప్పారు.
అమెరికాలో చేసిన ఒక అధ్యయనాన్ని ఆమె ఈ సందర్భంగా ఉటంకించారు. అమెరికాలో 10 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఇ-సిగరెట్ల వాడకం 77.8 శాతం, మాధ్యమిక తరగతి విద్యార్థుల్లో 48.5 శాతం పెరిగినట్లు
ఆ అధ్యయనంలో తెలిసిందని చెప్పారు.

ఫొటో సోర్స్, Pti
ఇ-సిగరెట్ల వాడకం వల్ల అమెరికాలో ఏడుగురు చనిపోయినట్లు తెలిపారు. దీర్ఘకాలం ఇ-సిగరెట్ల వాడకం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేమిటో శాస్త్రీయంగా రుజువుకావాల్సి ఉందని అన్నారు.
దేశంలో ఇ-సిగరెట్ల బ్రాండ్లు చాలా ఉన్నాయని, అయితే ఇవన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని నిర్మల సీతారామన్ చెప్పారు. ఇ-సిగరెట్ల నుంచి వెలువడే పొగలో నికోటిన్ ఎక్కువ మొత్తంలో ఉంటోందని తెలిపారు.
ఈండ్ (ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివెరీ సిస్ట్స్)పై నిషేధం విధించాలని గత ఫిబ్రవరిలో అన్ని రాష్ట్రాలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లేఖ రాసింది.
పొగతాగనివారిలో నికోటిన్ వ్యసనం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోని అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇ-సిగరెట్లపై పూర్తిగా నిషేధం విధించాలని గతంలోనే సూచించింది.
ఇవి కూడా చదవండి
- ఒక్క పఫ్ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు
- యూట్యూబ్: నకిలీ క్యాన్సర్ చికిత్స వీడియోలతో యూట్యూబ్ సొమ్ము చేసుకుంటోందా?
- టీవీ చానల్స్ నిలిపివేత ఎమ్మెస్వోల ఇష్టమా? ట్రాయ్ పాత్ర ఏంటి?
- బెంజమిన్ నెతన్యాహు: ఇజ్రాయెల్ ఆర్మీ కమాండో నుంచి.. ఐదోసారి దేశ ప్రధాని రేసు వరకూ...
- 'మమ్మల్ని కొట్టకండి, కాల్చి చంపేయండి...'
- ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'.. మానవ విపత్తులా మారిన ఫేస్‌బుక్ ఈవెంట్
- 9/11 పుట్టిన తేదీ, 9.11 గంటలు పుట్టిన సమయం, పాప బరువు 9.11 పౌండ్లు.. ఏమిటీ చిత్రం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








