పొగతాగడం మానేయాలనుకుంటే... ఇలా ప్రయత్నించండి

పొగతాగడం

కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన వేళ చాలా మంది పొగరాయుళ్లు సిగరెట్ తాగడం మానేయాలని తీర్మానం చేసుకుంటారు. కానీ, చాలా మంది ఆ బలహీనతను అధిగమించలేరు. ఇలాంటి వారికోసం ఇంగ్లండ్ ప్రజారోగ్య విభాగం ఓ సలహా ఇస్తోంది.

అదేమిటంటే, సిగరెట్లు మానేయలేకపోతే వాటికి బదులుగా ఈ-సిగరెట్లు కాల్చడానికి ప్రయత్నించండి అని చెబుతోంది.తాము నిర్వహించిన ప్రయోగంలో సంప్రదాయ సిగరెట్ల కంటే ఈ-సిగరెట్లు చాలా తక్కువ హానికరమైనవని తేలిందని పేర్కొంది.

వీడియో క్యాప్షన్, పొగతాగడం మానేయాలనుకుంటే ఇలా ప్రయత్నించండి

షాహబ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన డాక్టర్ లయన్ ఈ ప్రయోగం గురించి వివరించారు. ఆయన తన ప్రయోగంలో భాగంగా మూడు గాజు కూజాలను తీసుకున్నారు. ఒక గాజు కూజాలో ఒక వ్యక్తి సగటున ఒక నెలపాటు కాల్చే సిగరెట్లను పెట్టారు. మరో గాజు కూజాలో ఆవిరిని వెదజల్లే ఈ-సిగరెట్లను అదే నెలపాటు తీసుకున్నారు. ఇంకో గాజు కూజాలో స్వచ్ఛమైన గాలిని తీసుకున్నారు.

సిగరెట్ల పొగతో నిండిన గాజు కూజాను పరిశీలిస్తే అందులో ఉన్న దూది పూర్తిగా నల్లటిరంగులోకి మారిపోయింది. ఒక నెలపాటు సిగరెట్లు తాగే వారి ఊపిరితిత్తులు కూడా ఇలాగే ఉంటాయన్నమాట.

ఈ-సిగరెట్లు ఉన్న గాజు కూజాను పరిశీలిస్తే అందులోని దూది నల్లటి రంగులో కనిపించలేదు కానీ, కాస్త తడిగా ఉంది.

ఈ ప్రయోగం ద్వారా సిగరెట్ల కంటే ఈ-సిగరెట్లు తక్కువ హానికరం అని చెప్పొచ్చని డాక్టర్ తెలిపారు. అయితే, ఆవిరిని వదిలే ఈ- సిగరెట్ల వాడకంపై ప్రపంచం ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ-సిగరెట్లను దీర్ఘకాలం వాడటం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇంకా తెలియలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)