అగరుబత్తీ - సిగరెట్: ఏ పొగ ఎక్కువ ప్రమాదకరం?

వీడియో క్యాప్షన్, వీడియో: అగరుబత్తీ వెలిగిస్తున్నారా... అయితే జాగ్రత్త

అగరుబత్తీల నుంచి వచ్చే పొగ సిగరెట్ పొగ కంటే ప్రమాదకరమని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. క్యాన్సర్‌ సహా అనేక ఇతర శ్వాసకోశ సమస్యలకు ఆ పొగ కారణమవుతుందని హెచ్చరిస్తున్నాయి. గతంలో ఐరాసకు చెందిన ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ ప్రచురించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

చాలామంది పూజల కోసం, ఇంట్లో సువాసన కోసం అగరుబత్తీలను ఉపయోగిస్తారు. కానీ, ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం అగరుబత్తీల పొగ చాలా ప్రమాదకరమని తేలింది.

వీటి నుంచి కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజెన్ డయాక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు విడుదలవుతాయి. ఈ పొగ ప్రభావం మనిషి డీఎన్‌ఏ పైన కూడా పడే అవకాశం ఉంది.

దేవాలయాల పరిసరాల్లో ఈ పొగ కారణంగా కాలుష్యం కూడా ఎక్కువవుతుంది. అందుకే అగరుబత్తీలను వెలిగించే సమయంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. చిన్న పిల్లలు ఉండే ఇంట్లో వీటిని వినియోగించేప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)