బీ కేర్‌ఫుల్: బరువు పెరిగితే.. క్యాన్సర్ ముప్పు

మహిళ

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌లోని క్యాన్సర్ బాధితుల్లో 6.3 శాతం మందికి అధిక బరువు, ఊబకాయమే కారణమట
    • రచయిత, అలెక్స్ థెర్రెన్
    • హోదా, బీబీసీ న్యూస్

అధిక బరువు కారణంగా క్యాన్సర్‌‌ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చిరిస్తున్నారు.

ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జీవన శైలిలో మార్పులు చేసుకుంటే 37.7 శాతం క్యాన్సర్‌‌ కేసులను తగ్గించుకునే వీలుందని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు.

బ్రిటన్‌లోని క్యాన్సర్‌‌ బాధితుల్లో 6.3 శాతం మందికి అధిక బరువు, ఊబకాయమే కారణమని తాజాగా 'క్యాన్సర్‌‌ రీసెర్చ్ యూకే' అనే సంస్థ జరిపిన పరిశీలనలో వెల్లడైంది.

ఇదే సంస్థ 2011లో జరిపిన అధ్యయనంలో అది 5.5 శాతంగా ఉన్నట్టు తేలింది. అంటే 0.8 శాతం పెరిగింది.

దీంతో ప్రమాదకరంగా మారుతున్న ఊబకాయం బారిన పడకుండా అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.

అయితే, ఇదే సమయంలో పొగతాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌‌ కేసులు 19.4 శాతం నుంచి 15.1శాతానికి తగ్గినట్టు తేలింది.

బీరు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌లోని క్యాన్సర్‌‌ కేసుల్లో 3.3% కేసులకు కారణం ఆల్కహాల్

మద్యం సేవించడం తగ్గించి, పొగ తాగడం మానేసి, శరీర బరువును అదుపులో పెట్టుకోగలగితే బ్రిటన్‌లో 10 క్యాన్సర్‌‌ కేసుల్లో నాలుగింటిని నివారించే వీలుందని పరిశోధకులు అంచనా వేశారు.

line

ఏ కారణంతో ఎన్ని క్యాన్సర్‌ కేసులు నమోదు అవుతున్నాయో చూద్దాం:

పై జాబితాలో పేర్కొన్న కారణాలన్నీ నివారించదగినవే. అందుకు కావాల్సిందల్లా జీవన శైలిలో మార్పులు చేసుకోవడమే.

ఈ విషయాల పట్ల జాగ్రత్త పాటిస్తే ఒక్క బ్రిటన్‌లోనే ప్రస్తుతం ఉన్న క్యాన్సర్‌‌ బాధితుల్లో 135,000 కేసులను నివారించదగినవే అని పరిశోధకులు వెల్లడించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)