ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ పేరేంటో తెలుసా?

ఫొటో సోర్స్, Google
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) తన తాజా వెర్షన్‌కు తిను బండారమో, తీపి పదార్థం పేరో పెట్టడం లేదు. 2009లో ప్రారంభించిన ఆ సంప్రదాయానికి ఆండ్రాయిడ్ ఈసారి ముగింపు పలికింది.
ఇప్పటివరకూ వస్తున్న వెర్షన్ల క్రమం ప్రకారం దీని కొత్త వెర్షన్ క్యూ అక్షరంతో ప్రారంభం కావాలి.
ఆండ్రాయిడ్ మొదటి రెండు వర్షన్లు ఇలా కాకుండా ఆల్ఫా, బీటా పేర్ల మీద వచ్చాయి.
ఆ తర్వాత ఇప్పటివరకూ వచ్చిన అన్ని వెర్షన్లను ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం 'సీ' నుంచి 'పీ' వరకూ తీపిపదార్థాల పేరు వచ్చేలా పెట్టారు.
ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇంతకు ముందు జెల్లీబీన్, కిట్‌కాట్, లాలీపాప్ లాంటి పేర్లు పెడుతూ వచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కానీ, లేటెస్ట్ వెర్షన్ ఏదో తెలుసుకోవాలనుకునే వినియోగదారులను ఆ పేర్లు గందరగోళానికి గురిచేస్తుండడంతో, ఇప్పటివరకూ ఉన్న సంప్రదాయానికి గుడ్‌బై చెప్పినట్లు గూగుల్ చెప్పింది.
ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే కొత్త ఎడిషన్‌ను ఆండ్రాయిడ్ 10 అని పిలుస్తారు.
ఇది నిజానికి ఆండ్రాయిడ్ 17వ వర్షన్ అయినా, అందరికీ సులభంగా తెలిసేలా దీనికి 10 అని పెట్టింది.
ప్రతి ఏటా వెర్షన్‌ను విడుదల చేస్తున్నప్పుడు ఈ పేర్లు పెట్టే సంప్రదాయం ఆహ్లాదంగా ఉండేది అని గూగుల్ ఒక బ్లాగ్‌లో చెప్పింది.
"కానీ ఈ పేర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ అర్థం కావడం లేదని మాకు గత కొన్నేళ్లుగా ఫీడ్ బ్యాక్ వస్తోంది"
"ఉదాహరణకు కొన్ని భాషల్లో మాట్లాడినపుడు ఎల్, ఆర్ అక్షరాల మధ్య తేడా ఉండడం లేదు" అని గూగుల్ చెప్పింది.
ఒక గ్లోబల్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆండ్రాయిడ్ వెర్షన్ పేర్లు స్పష్టంగా, ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ చేరేలా ఉండాలని గూగుల్ భావించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌కు పేరు పెట్టేందుకు గూగుల్ ఒక ఒపీనియన్ పోల్ కూడా నిర్వహించింది.
అందులో అది 'క్యూ' అక్షరంతో వచ్చే కొన్ని పేర్లు ఇచ్చి, వాటిలో ఒకటి ఎంపిక చేయమంది.
చివరకు అందరికీ అర్థమయ్యేలా కొత్త సంప్రదాయానికి తెరతీస్తూ ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్‌కు ఆండ్రాయిడ్ '10' అనే పేరు పెట్టింది.
ఇవి కూడా చదవండి:
- మునిగిపోతున్న ఈ దేశాన్ని కాపాడేదెలా
- ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?
- కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా
- ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు
- చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








