బైట్‌డాన్స్: సొంతంగా స్మార్ట్‌ఫోన్ తయారు చేస్తున్న టిక్‌టాక్ కంపెనీ

ఫొటో సోర్స్, Getty Images
వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ యాజమాన్య సంస్థ బైక్‌డాన్స్.. స్మార్ట్‌ఫోన్ల తయారీలోకి విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పుడు అత్యంత వేగంగా పెరుగుతున్న సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్. దాదాపు 50 కోట్ల మంది రెగ్యులర్ యూజర్లు దీనికి ఉన్నారు.
ఈ యాప్‌లో యూజర్లు 15 సెకన్ల వీడియోలు పోస్ట్ చేయవచ్చు. యాప్ స్టోర్ల నుంచి 100 కోట్లకన్నా ఎక్కువ సార్లే దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారని అంచనా.
ఈ యాప్ సృష్టికర్త బైట్‌డాన్స్. ఈ సంస్థ తాజాగా స్మార్టిసాన్ అనే డివైజ్ మేకర్ నుంచి పేటెంట్ హక్కులు, ఉద్యోగులను కొనుగోలు చేసి స్మార్ట్‌ఫోన్ తయారీకి నడుంకట్టింది.
టిక్‌టాక్‌తో పాటు.. హలో యాప్, స్లాక్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న లార్క్, వీడియో చాట్ యాప్ ఫ్లిప్‌చాట్, న్యూస్ అగ్రిగేటర్ టూటియావో వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే ఇతర వీడియో, న్యూస్ యాప్‌లు కూడా బైట్‌డాన్స్ సంస్థకు ఉన్నాయి.
అయితే.. అన్నిటిలోకీ టిక్‌టాక్ చాలా ప్రజాదరణ పొందింది. అటు పశ్చిమ ప్రపంచ యూజర్లు, ఇటు తూర్పు ప్రపంచ యూజర్లు ఇరువైపులా ఈ యాప్‌ను ఇష్టపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది.
ఈ యాప్ ఇటీవలే.. ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ మద్దతున్న స్టార్టప్‌గా ఊబర్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానంలోకి వెళ్లింది. ఈ యాప్‌కి 7,500 కోట్ల డాలర్లుగా విలువకట్టారు.
టిక్‌టాక్ కంపెనీ గత ఏడు నెలలుగా కొత్త ఫోన్ తయారీలో తలమునకలైందని చైనా ఫైనాన్షియల్ మేగజీన్ కాయిజింగ్ పేర్కొంది.

ఫొటో సోర్స్, SOUTH CHINA MORNING POST
స్మార్ట్‌ఫోన్లలో కొత్త ట్రెండ్లు
ఒక యాప్‌కు లభించిన ప్రజాదరణను పెట్టుబడిగా చేసుకుంటున్న మొదటి సంస్థ బైట్‌డాన్స్ కాదు. 2013లో చైనీస్ సెల్ఫీ-యాప్ తయారీ సంస్థ మీటు.. సెల్ఫీలు తీసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఫోన్లు తయారు చేయటం ప్రారంభించింది.
మీటు ఫోన్లకు చైనాలో ప్రజాదరణ గల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేశారు. అందులో డ్యూయల్ పిక్సెల్ కెమెరాలు, వేగవంతమైన ఆటో-ఫోకస్‌లతో పాటు.. ప్రతి యూజర్ ప్రత్యేక ఫీచర్లతో సెట్టింగులు ఎంపిక చేసుకోగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫొటో-ఎడిటింగ్ ఫిల్టర్లు కూడా ఉన్నాయి.
కానీ.. చైనా మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ తయారీదారుల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో.. మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ డివైజ్ వినియోగదారులను ఆకట్టుకోగలదా అనే దానిమీద సందేహాలు నెలకొన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
''కొత్తగా వచ్చే తయారీదారులు స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి ప్రవేశించటం, లాభాలు పొందటం చాలా చాలా కష్టం. ప్రత్యేకించి ఆపిల్, శాంసంగ్, హువే వంటి పెద్ద బ్రాండ్లు వినియోగదారుల మీద కోట్లాది రూపాయల మార్కెటింగ్‌తో కార్పెట్ బాంబింగ్ చేస్తున్న తరుణంలో అది మరింత కష్టం'' అని సీసీఎస్ ఇన్‌సైట్‌లో టెక్నాలజీ ఎనలిస్ట్ బెన్ వుడ్.. బీబీసీ న్యూస్‌తో పేర్కొన్నారు.
ఫేస్‌బుక్, గూగుల్, అమెజాన్ వంటి టెక్నాలజీ దిగ్గజాలు కూడా తమ ప్రధాన వ్యాపారాల వెలుపలి రంగాలకూ విస్తరించి.. వివిధ స్థాయి విజయాలు సాధించాయి.
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పాపులర్ యాప్‌లను సొంతం చేసుకుని సోషల్ నెట్‌వర్క్‌లు, కమ్యూనికేషన్లలో విజయం సాధించిన ఫేస్‌బుక్.. తన సొంత ఆండ్రాయిడ్ లాంచర్ యాప్ 'హోమ్'తో మొబైల్ రంగంలోకి విస్తరించటంలో విఫలమైంది.

ఫొటో సోర్స్, Getty Images
అలాగే.. గూగుల్ పిక్సెల్ ఫోన్లు సఫలమైతే.. దాని సోషల్ నెట్‌వర్క్ గూగుల్ ప్లస్ క్రమంగా ప్రజాదరణ కోల్పోతూ ఈ ఏడాది ఆరంభంలో మూతపడింది.
ఇక అమెజాన్ సంస్థ తయారుచేసిన టాబ్లెట్లు, ఈ-రీడర్లు ప్రజాదరణ పొందితే.. అది 2014 మేలో విడుదల చేసిన ఫైర్ ఫోన్‌కు వినియోగదారుల నుంచి స్పందన రాలేదు.
ఈ ఫోన్ వల్ల తనకు 17 కోట్ల డాలర్ల నష్టం సంభవించిందని అమెజాన్ ఐదు నెలల్లోనే పేర్కొంది. 2015 సెప్టెంబర్‌లో ఈ ప్రొడక్టును మార్కెట్ నుంచి ఉపసంహరించటానికి ముందుగానే స్మార్ట్‌ఫోన్ ఇంజనీర్లను విధుల నుంచి తొలగించింది.
ఇవి కూడా చదవండి:
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- టిక్‌టాక్‌లో ఫేమస్ అయితే డబ్బులు సంపాదించొచ్చా
- ఆఫీస్‌లో టిక్‌టాక్ వీడియోలు తీసి పోస్ట్ చేసినందుకు 11 మంది ఉద్యోగులపై చర్యలు
- ఐఫోన్ వివాదం: వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన యాపిల్ సంస్థ
- యాపిల్: 12 ఏళ్ల పాటు నష్టాలు చూసిన ఈ కంపెనీ నేడు ప్రపంచంలో నం.1
- యాపిల్ అసాధారణ నిర్ణయం..
- మెటికలు విరుచుకుంటే కీళ్లనొప్పులు వస్తాయా..
- ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులివ్వడం క్రిమినల్ నేరం, మూడేళ్ల వరకూ జైలు శిక్ష.. బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ
- హ్యారీ పోటర్ థీమ్‌తో 'పోకెమాన్' గేమ్
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- Man vs Wild: డిస్కవరీ చానల్ షోలో బియర్ గ్రిల్స్‌తో ప్రధాని మోదీ అరణ్యయాత్ర
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








