ఐఫోన్ వివాదం: వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన యాపిల్ సంస్థ

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల ఐఫోన్ల విషయంలో యాపిల్ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
పాత ఐఫోన్ల పనితీరును తగ్గించేలా ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు చేసిన మాట నిజమేనని సంస్థ అంగీకరించింది.
అమెరికాలో యాపిల్‌పై కొందరు వినియోగదారులు దావాలు కూడా వేశారు.
ఈ నేపథ్యంలో యాపిల్ క్షమాపణలు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాటరీ ధరల్లో భారీ తగ్గింపు
పాత బ్యాటరీలు మార్చుకునే వారికి తక్కువ ధరకే కొత్త బ్యాటరీలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
బ్యాటరీ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొత్త ఏడాదిలో ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురానున్నట్లు వివరించింది.
వెబ్‌సైట్‌లో సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఐఫోన్ బ్యాటరీ ధరను 79 డాలర్ల నుంచి 29 డాలర్లకు, అంటే దాదాపు 63 శాతం తగ్గిస్తున్నట్లు యాపిల్ పేర్కొంది.
పాత ఐఫోన్లు మరింత కాలం మన్నాలనే ఉద్దేశంతోనే తాము ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు చేశామని, కానీ దీనిపై వినియోగదారుల్లో అనేక సందేహాలు తలెత్తినట్లు యాపిల్ చెప్పుకొచ్చింది.
వారి విశ్వాసాన్ని తిరిగి పొందేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పింది.
ఇజ్రాయెల్, ఫ్రాన్స్ దేశాల్లోనూ యాపిల్‌పై కేసులు నమోదయ్యాయి.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








