యాపిల్ వైర్‌లెస్ చార్జింగ్ ప్రాజెక్టు రద్దు

ఫొటో సోర్స్, APPLE
అమెరికా టెక్ దిగ్గజం 'యాపిల్' ప్రయాణంలో ఇదో అసాధారణ పరిణామం. తాను అభివృద్ధి చేస్తున్న ఒక ప్రొడక్ట్ తన ప్రమాణాలకు తగినట్లుగా రాకపోవడంతో ఆ ప్రాజెక్టునే రద్దు చేసింది.
ఐఫోన్, స్మార్ట్ వాచ్, ఎయిర్‌పాండ్ లాంటి డివైస్‌లను ఒకేసారి వైర్‌లైస్ ఛార్జింగ్ చేయడానికి వీలు కల్పించే సాధనాన్ని తీసుకొస్తామని 2017 సెప్టెంబరులో యాపిల్ ప్రకటించింది.
ఈ సాధనం పేరు ఎయిర్‌పవర్. ఛార్జింగ్ సమయంలో ఎయిర్‌పవర్ విపరీతంగా వేడెక్కుతోందని, దీనిని యాపిల్ ఇంజినీర్లు నియంత్రించలేకపోయారని, ప్రాజెక్టును ఆపేయడానికి ఇదే కారణమనే సమాచారం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
''ఎయిర్‌పవర్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాం. అయితే, మేం నిర్దేశించుకున్న ఉన్నతస్థాయి ప్రమాణాలను ఇది అందుకోలేదని మేం గుర్తించాం. అందుకే ప్రాజెక్టును రద్దు చేశాం'' అని యాపిల్ ప్రకటించింది. వివరాలను వెల్లడించలేదు.
ఎయిర్‌పవర్ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి దీనిపై వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి.
ఇదో ప్రపంచస్థాయి వైర్‌లెస్ చార్జింగ్ పరికరమని, 2018లో దీనిని విడుదల చేస్తామని యాపిల్ లోగడ తెలిపింది.
ఎయిర్‌పవర్ వేడిని నియంత్రించడంలో సమస్యలు ఉన్నట్లు ఇంజినీర్లు గుర్తించారనే అర్థంలో యాపిల్ ఉత్పత్తులను విశ్లేషించే జాన్ గ్రుబర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
'భవిష్యత్తు వైర్‌లెస్‌దే'
యాపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సారథి డాన్ రిసియో బీబీసీకి ఇచ్చిన ఈమెయిల్ ప్రకటనలో ఎయిర్‌పవర్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు క్షమాపణ చెప్పారు.
భవిష్యత్తు వైర్‌లైస్‌దేనని తాము నమ్ముతున్నామని, వైర్‌లైస్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.
ఎయిర్‌పవర్ ప్రాజెక్టు రద్దు యాపిల్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు 'ఎయిర్‌పాడ్స్' అమ్మకాలపై ప్రభావం చూపే ఆస్కారముంది. ఇప్పటివరకు ఎయిర్‌పాడ్స్‌ను వినియోగదారులకు అమ్మేటప్పడు భవిష్యత్తులో వీటిని ఎయిర్‌పవర్‌తో చార్జింగ్ చేసుకోవచ్చనే మాట యాపిల్ చెబుతూ వచ్చింది.
ఎయిర్‌పవర్ ఎలా పనిచేస్తుందనే బొమ్మ కూడా ఎయిర్‌పాడ్స్ ప్యాకింగ్‌పై ఉంది.
హువాయి, సామ్‌సంగ్ లాంటి యాపిల్ పోటీసంస్థలు తమ డివైస్‌ల వైర్‌లెస్ చార్జింగ్‌కు అవసరమైన ఉత్పత్తులను ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- మహిళలకు పురుషులతో సమానంగా ఆర్థిక హక్కులు అందిస్తున్న దేశాలెన్ని...
- ఫేస్‌బుక్: ప్రైవసీకి ప్రాధాన్యమిచ్చే వేదికగా మార్చేస్తామంటున్న మార్క్ జుకర్‌బర్గ్
- మన దేశానికి సెకండ్ హ్యాండ్ దుస్తులు ఎక్కడి నుంచి వస్తాయి?
- పార్టీలు పెట్టారు.. కాపాడుకోలేకపోయారు
- BBC Reality Check: విమానాశ్రయాల నిర్మాణాలపై బీజేపీ లెక్కల్లో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








