కూలిన యుద్ధ విమానం ఫొటోలు అసలైనవేనా: Fact Check

ఫొటో సోర్స్, SM VIRAL POSTS
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
తమ భూభాగంపై వైమానిక దాడులకు దిగిన మరుసటి రోజే భారత యుద్ధ విమానాలు రెండింటిని బుధవారం కూల్చివేశామని పాకిస్తాన్ ప్రకటించింది. వీటిలో ఓ విమానం పాక్ భూభాగంలో పడిందని, అందులోని పైలట్‌ను అరెస్టు చేశామని పాక్ సైనిక ప్రతినిధి వెల్లడించారు. అయితే దీన్ని భారత్ ధ్రువీకరించలేదు. తాము కూడా పాకిస్తాన్‌కు చెందిన ఓ విమానాన్ని కూల్చివేసినట్లు భారత్ చెబుతోంది.
ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో మిలిటెంట్ దాడిలో 40కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
తాము కూడా వైమానిక దాడిని చేశామని పాకిస్తాన్ సైన్యం ధ్రువీకరించగానే #Pakistaniarmyzindabad, #Pakistanairforceourpride, #Pakistanstrikesback వంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఈ దాడులపై పాకిస్తాన్ మీడియా నిరంతర వార్తలను, ప్రసారాలను అందించింది.
కానీ, కూల్చేసిన భారత యుద్ధ విమానం అంటూ షేర్ అవుతున్న ఫొటోల్లో చాలావరకూ ఫేక్ ఫొటోలే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
గాయపడిన భారత పైలట్ అని చూపుతున్న వీడియో
"నేలపై పడిన భారత పైలట్, ముఖంపై తీవ్రంగా గాయాలైనప్పటికీ బతికే ఉన్నాడు" అని చూపుతూ పాకిస్తాన్‌కు చెందిన కొందరు ట్విటర్ యూజర్లు ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోనే ఆధారంగా చూపుతూ పాకిస్తాన్ ఓ భారత పైలట్‌ను అరెస్టు చేసిందని చెబుతున్నారు.
ఆ పైలట్ భారతీయుడు కావడం నిజమే, కానీ ఆయన పాకిస్తాన్ భూభూగంలో లేరు. వీడియోలో చూపిస్తున్న వ్యక్తి వింగ్ కమాండర్ విజయ్ షెల్కె. బెంగళూరులో ఫిబ్రవరి 19న సూర్య కిరణ్ విమానం కూలిన ఘటనలో ఆయన గాయపడ్డారు.
స్థానిక యువకుడొకరు ఆయన చేతులు పట్టుకుని, కంగారు పడకండి అని చెప్పారు. ఎవరికి సమాచారం అందించాలి అని అడిగారు. దానికి స్పందించిన ఆ పైలట్.. తన శరీరంపై ఇంకా ఎక్కడైనా గాయాలయ్యాయేమో చూడమని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కూలిన యుద్ధవిమానం చిత్రం అసలైనదేనా?
కూలిన భారత యుద్ధవిమానం అని భావిస్తున్న ఓ ఫొటోను పాకిస్తాన్ సోషల్ మీడియా యూజర్లు వందలసార్లు షేర్ చేశారు.
ఆ విమానం ముందుభాగం ధ్వంసమైంది కానీ వెనక భాగానికి ఏమీ కాలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్ of X ముగిసింది, 4
భారత్‌పై పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుందనడానికి రుజువు ఇది అంటూ ఈ పోస్టులన్నింట్లో వ్యాఖ్యానించారు.
ఆ ఫొటో భారత విమానానిదే. కానీ ఇది కూలడానికి, పాకిస్తాన్‌కూ ఎలాంటి సంబంధం లేదు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా కుదురసాహి సమీపంలోని వరిపొలాల్లో కూలిన ఓ శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్ ఫొటో అది. ఈ ఘటన జూన్ 3, 2015న జరిగింది.
ఇది గెట్టీ న్యూస్ సర్వీస్ వెబ్సైట్లో కూడా ఉంది.
ది హిందూ కూడా దీనిపై కథనాన్ని ప్రచురించింది.
ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి.
- కశ్మీర్లో కూలిన భారత యుద్ధవిమానం: రెండు భారత విమానాలను కూల్చేశామన్న పాక్
- కార్గిల్‌కు ముందు... ఆ తరువాత కశ్మీర్లో భారత్-పాక్‌ల దాడుల చరిత్ర
- అమెరికా లాడెన్‌ని చంపినట్లు మసూద్ అజర్‌ను ఇంట్లోకి వెళ్లి చంపగలం: అరుణ్ జైట్లీ
- బాలాకోట్‌లో వైమానిక దాడులతో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చాం- భారత్; బదులిచ్చే హక్కు మాకుంది- పాకిస్తాన్
- భారత్ మిరాజ్ యుద్ధ విమానాలనే ఎందుకు ఉపయోగించింది... బాలాకోట్ ఎక్కడుంది...
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)