ఇరాన్ దాడులు: దుబయ్‌లో చిక్కుకుపోయిన నటుడు మంచు విష్ణు, 'ఏ బిడ్డా ఇలాంటి శబ్ధాలలో పెరగకూడదు'.. అంటూ ట్వీట్

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు

ఫొటో సోర్స్, Facebook/Vishnumanchu

ఫొటో క్యాప్షన్, టాలీవుడ్ నటుడు మంచు విష్ణు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 3 నిమిషాలు

తెలుగు సినీనటుడు మంచు విష్ణు, ఆయన కుటుంబం దుబయ్‌లో చిక్కుకుపోయారు. అక్కడి అనుభవాలను ఆయన ఎక్స్ ‌ఖాాతాలో పోస్టు చేశారు.

"మార్చి 1 విష్ణు, అరోనికాల పెళ్లి రోజు. పిల్లల చదువుల కోసం ఫ్యామిలీ దుబయ్‌లోని పామ్‌ జుమేరాలో ఉంటోంది. ఇక్కడే సొంతిల్లు కూడా ఉంది. ఫ్యామిలీని చూసేందుకు విష్ణు తరుచూ ఇక్కడికి వస్తుంటారు. ఆ క్రమంలో మార్చి 1న పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడానికి ఫిబ్రవరి 27న శుక్రవారం ఇక్కడికి వచ్చారు.’’ ఆయన కుటుంబసభ్యులు బీబీసీకి చెప్పారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. పొరుగు దేశాలపై ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది.

ఇజ్రాయెల్‌కి మద్దతిస్తూ అమెరికా చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ సమీప దేశాల్లోని యూఎస్‌ సైనిక స్థావరాలపై దాడి చేస్తోంది. దీంతో దుబాయ్, దోహా, కువైట్, బహ్రెయిన్ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

అక్కడి పౌరులతో పాటు ఆయా దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో దుబయ్‌లో ఉన్న టాలీవుడ్ నటుడు మంచు విష్ణు అక్కడి తన అనుభవాన్ని శనివారం రాత్రి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

"దుబయ్‌లో కుటుంబసభ్యులను కలిసేందుకు వచ్చాను. ఆకాశంలో మిస్సైల్స్‌ కనిపిస్తున్నాయి. క్షిపణి దాడుల దెబ్బకు ఇల్లు కంపించిపోయింది. మా చిన్నపాప భయపడిపోయింది'' అని ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

"శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దాలు వింటూ పెరగకూడదు. ఇక్కడి పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యూఏఈ రక్షణ దళాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు నిజంగా జీవితం ఎంత దుర్బలమైనదో గుర్తుచేస్తాయి'' అంటూ మంచు విష్ణు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

పెళ్లి రోజు వేడుకల కోసం వెళ్తే..

ఆకాశంలో దూసుకోస్తున్న మిస్సైల్స్‌ వీడియోను శనివారం రాత్రి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు మంచు విష్ణు. అక్కడి పరిస్థితిపై విష్ణు కుటుంబసభ్యులు బీబీసీతో మాట్లాడారు.

"మార్చి 1 విష్ణు, అరోనికాల పెళ్లిరోజు. పిల్లల చదువుల కోసం ఫ్యామిలీ దుబయ్‌లోని పామ్‌ జుమేరాలో ఉంటోంది. ఇక్కడే సొంతిల్లు కూడా ఉంది. ఫ్యామిలీని చూసేందుకు విష్ణు తరుచూ ఇక్కడికి వస్తుంటారు. ఆ క్రమంలో మార్చి 1న పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడానికి ఫిబ్రవరి 27న శుక్రవారం ఇక్కడికి వచ్చారు. కానీ, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. దీంతో తిరిగి ఇండియాకి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. విమాన సర్వీసులన్నీ రద్దు కావడంతో అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి.. విమాన సర్వీసులు మొదలవ్వగానే ఫ్యామిలీతో సహా విష్ణు హైదరాబాద్‌కి వచ్చేస్తారు'' అని తెలిపారు.

మంచు విష్ణు

ఫొటో సోర్స్, Vishnu Manchu/X Screengrab

ఫొటో క్యాప్షన్, ఆకాశంలో మిస్సైల్ కనిపించిందంటూ మంచు విష్ణు ఎక్స్‌లో పోస్టు చేశారు

ఇప్పటికైతే సురక్షితం

"శనివారం రాత్రంతా వినిపించిన క్రూజ్‌ మిస్సైల్స్‌ దాడుల శబ్దాలు ఆదివారం ఉదయానికి తగ్గాయి. కానీ, 10 గంటల తర్వాత మళ్లీ మొదలయ్యాయి. రాత్రి సమయంలో తాము ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఉన్న ఫేర్‌ మౌంట్‌పాం అనే హోటల్‌పై డ్రోన్‌ పడింది. స్థానికులకు ఏమీ కాలేదు. ఇక్కడ ఎక్కువగా క్రూజ్‌ మిస్సైల్స్‌ దాడులు జరుగుతున్నాయి. అవి అంత ప్రమాదకరం కాదంటున్నారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితే. ఇప్పటికైతే దుబయ్‌లో పరిస్థితి కాస్త సేఫ్‌గానే ఉందని చెప్పాలి'' అని విష్ణు కుటుంబ సభ్యులు బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)