అమెరికా లాడెన్‌ని చంపినట్లు మసూద్ అజర్‌ను ఇంట్లోకి వెళ్లి చంపగలం: అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

ఫొటో సోర్స్, Reuters

భారత సైనిక సామర్థ్యంపై భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఒక ప్రకటన చేశారు.

ఇప్పుడు భారత్‌లో ఏదైనా సాధ్యమేనన్నారు.

అమెరికా ఒసామా బిన్ లాడెన్‌ను చంపినట్లు ఇప్పుడు కూడా ఏదైనా జరగవచ్చు అని అరుణ్ జైట్లీ అన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇప్పుడు భారత్ ఎలాంటి పెద్ద చర్యకైనా దిగగలదని అరుణ్ జైట్లీ అన్నారు.

లాడెన్‌ను అమెరికా చంపినట్లే భారత్ మసూద్ అజర్‌ను ఇంట్లోకి చొచ్చుకెళ్లి అంతం చేయగలదని చెప్పారు.

మోదీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. భారత్ అంతటా అలర్ట్ చేశారు. వైమానిక దళాన్ని అలర్ట్ చేశారు. ఏ సమయంలోనైనా టేకాఫ్ కావాల్సుంటుందని హెచ్చరించారు.