భారత్-పాకిస్తాన్: కశ్మీర్‌లో కూలిన ఇండియా యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్లు మృతి; రెండు భారత విమానాలను కూల్చేశామన్న పాక్.. రెండు దేశాల్లో పలు విమానాశ్రయాల మూసివేత

కశ్మీర్ మధ్య ప్రాంతంలోని బడ్గాం జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధవిమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని పైలట్, కో-పైలట్ అక్కడికక్కడే చనిపోయారని పోలీసు వర్గాలు బీబీసీకి తెలిపాయి. ఇద్దరు పైలట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నట్లు వివరించాయి. కార్గిల్ ప్రాంతంలో మరో విమానం కూలిపోయినట్లు కార్గిల్ నుంచి సమాచారం వస్తోంది. కానీ అది అధికారికంగా ఇంకా నిర్ధరణ కాలేదు.
మరోవైపు తాము రెండు భారత యుద్ధవిమానాలను కూల్చేశామని పాకిస్తాన్ సైన్యం చెప్పింది.
బడ్గాం పట్టణానికి ఇంచుమించు ఏడు కిలోమీటర్ల దూరంలోని గారాండ్ కలాన్ ప్రాంతంలో బుధవారం ఉదయం దాదాపు 10:40 గంటలకు భారత యుద్ధవిమానం కూలిపోయిందని ఒక పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలన జరుపుతున్నారని పేర్కొన్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఇద్దరు భారత పైలట్లను పట్టుకున్నామన్న పాకిస్తాన్
పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్) బుధవారం ఉదయం పాక్ గగనతలం నుంచి నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి దాడులు జరిపిందని, వీటిపై భారత వైమానికదళం స్పందిస్తూ ఎల్‌వోసీని దాటి తమ గగనతలంలోకి వచ్చిందని పాక్ సైనిక బలగాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చెప్పారు.
''పాకిస్తాన్ గగనతలంలోకి వచ్చిన రెండు భారత విమానాలను పీఏఎఫ్ కూల్చివేసింది. వీటిలో ఒకటి ఆజాద్, జమ్మూకశ్మీర్(ఏజేఅండ్‌కే) లోపల పడింది. మరొకటి భారత ఆక్రమిత కశ్మీర్(ఐవోకే)లో పడిపోయింది. పైలట్లు ఇద్దరినీ మా సైన్యం అరెస్ట్ చేసింది. వారితో ఒక దేశం ఎలా వ్యవహరిస్తుందో అలాగే మేం వ్యవహరించాం. తీవ్రంగా గాయపడ్డ ఒక పైలట్‌ను ఆస్పత్రిలో చేర్పించాం. ఇంకొకరు మా అదుపులో ఉన్నారు'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Twitter
భారత్, పాకిస్తాన్‌లలో పలు విమానాశ్రయాల మూసివేత
తాజా పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌లలో పలు విమానాశ్రయాలను మూసివేశారు.
బడ్గాం జిల్లాలో భారత యుద్ధవిమానం కూలిపోయిన తర్వాత జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ, లేహ్ విమానాశ్రయాలను పౌర విమానాల రాకపోకలకు వీలు లేకుండా అధికారులు మూసివేశారని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తాము విమానాశ్రయాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నామని భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ(ఏఏఐ) అధికారి ఒకరు చెప్పారని వివరించింది. ఈ మూడు విమానాశ్రయాల్లో దిగడానికి వస్తున్న విమానాల్లో కొన్నింటిని అవి ఎక్కడి నుంచి వస్తుంటే అక్కడికే పంపించేశామని అధికారులు చెప్పారు.
పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయాన్ని, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ విమానాశ్రయాన్ని మూసివేసినట్లు ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరోవైపు పాకిస్తాన్‌లో రాజధాని ఇస్లామాబాద్‌తోపాటు లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియాల్‌కోట్ విమానాశ్రయాలను మూసివేశారు.
భారత్, పాక్ సంయమనం పాటించాలి: అమెరికా, చైనా
భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా, చైనా స్పందిస్తూ- రెండు దేశాలూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చాయి.
గమనిక: ఈ వార్త అప్డేట్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
- భారత్ మిరాజ్ యుద్ధ విమానాలనే ఎందుకు ఉపయోగించింది... బాలాకోట్ ఎక్కడుంది...
- సరిహద్దు దాటి వచ్చిన భారత యుద్ధ విమానాలను పాక్ ఎందుకు అడ్డుకోలేకపోయింది
- డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?
- ‘పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేతిలో మరణించిన మిలిటెంట్ల ఫొటో నిజమేనా’
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








