#IAF: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందున్న సవాళ్ళేమిటి... :అభిప్రాయం

- రచయిత, హరూన్ రషీద్
- హోదా, బీబీసీ కోసం
సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన భారత్ బహుశా పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో చూసింది. మొదట్లో ఆ దాడి చిన్న స్థాయిలో ఉండటంతో 'అలాంటిదేం లేదు' అనే మాట పాక్‌కు ప్రయోజనకరంగా అనిపించింది. కానీ, భారత యుద్ధ విమానాలు ఈసారి వివాదాస్పద కశ్మీర్‌ను మాత్రమే కాదు పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాం(కేపీకే) రాష్ట్రంలోని బాలాకోట్ వరకూ వెళ్లాయి. తీవ్రవాదుల శిబిరాలు ధ్వంసం అయ్యాయా, లేదా అనేది మరో విషయం. శత్రు విమానాలు దేశ గగనతలంలోకి ప్రవేశించడం అనేది ఇక్కడ పాకిస్తాన్‌కు ఎక్కువ కలత కలిగించే విషయం.
ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఇది ఎంత పెద్ద సవాలుగా మారబోతోంది? దీనిని పాకిస్తాన్ ఎలా ఎదుర్కుంటుంది? వారి ముందున్న మార్గాలేమిటి?
పాకిస్తాన్ గగనతలంలోకి విదేశీ విమానాలు చొచ్చుకెళ్లడం అనేది గత పదేళ్లలో కొత్తేం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ బెదిరింపుల సరిహద్దును దాటడం అంటే రెడ్ లైన్ క్రాస్ చేయడంగానే భావిస్తారు.
అమెరికా సైన్యం రెండు సార్లు దీన్ని అస్సలు పట్టించుకోలేదు.
దేశ పశ్చిమ సరిహద్దుల్లో పురాతన గిరిజన ప్రాంతమైన మహమ్మద్ ఏజెన్సీలో ఒక పాకిస్తాన్ పోస్టుపై దాడి చేసిన అమెరికా హెలికాప్టర్లు 11 మంది పాకిస్తాన్ జవాన్లను చంపాయి.
రెండోసారి అమెరికా అబోటాబాద్ లాంటి పెద్ద నగరంపై దాడి చేసి ఒసామా బిన్ లాడెన్‌ను చంపడంలో విజయవంతం అయ్యింది.
దీన్ని కూడా వ్యతిరేకించడం తప్ప పాకిస్తాన్ పెద్దగా ఏం చేయలేకపోయింది.
కానీ భారత్ పరిస్థితి కాస్త భిన్నం. పాకిస్తాన్ సైన్యం ఇప్పటికీ భారత్‌ను తమ నంబర్ వన్ శత్రువుగా భావిస్తుంది.
మామూలుగా చెప్పాలంటే ఇంత పెద్ద దాడిని అస్సలు ఉపేక్షించలేం. పశ్చిమం తర్వాత తూర్పు నుంచి కూడా సరిహద్దును ఉల్లంఘించడం అనేది తేలిగ్గా జీర్ణించుకునే విషయం కాదు.
ఇమ్రాన్ ఖాన్‌కు తాము కూడా ఒక దేశమని, తమకూ పరువు-ప్రతిష్టలు ఉన్నాయని ప్రపంచానికి ఏదైనా చేసి చూపించడానికి బహుశా ఇదొక సందర్భం కావచ్చు.
దేశం కంటే ఎక్కువగా ఇది పాకిస్తాన్ ఆర్మీ పరువుకు సంబంధించిన విషయం.
అదే విశ్వాసంతో పాకిస్తాన్ "బదులివ్వడం మా హక్కు, మేం తగిన సమయంలో, సరైన చోట సమాధానం ఇస్తాం" అని ప్రకటించడం చాలా చింతించాల్సిన విషయం.

ఫొటో సోర్స్, Twitter/OfficialDGISPR
పాకిస్తాన్ సైన్యం నుంచి ఒక సమాధానం కచ్చితంగా ఉంటుంది అని నిపుణులు భావిస్తున్నారు. అది కశ్మీర్లోనా, వేరే ఎక్కడైనా అనేది అప్పుడే ఏదీ చెప్పలేం. కచ్చితంగా దానికి ఏర్పాట్లు ప్రారంభించే ఉండచ్చు.
దేశానికి అణ్వాయుధాల ఏర్పాట్లను చూసుకుంటున్న నేషనల్ కమాండ్ అథారిటీకి పిలుపునివ్వడం అనేది చాలా ప్రమాదకరమైన అడుగు.
ఇమ్రాన్ ఖాన్ ఏ అంశంపై యూటర్న్ తీసుకున్నా తీసుకోకపోయినా యుద్ధం గురించి యూటర్న్ తీసుకోవాలని యుద్ధ వ్యతిరేకులు కోరుకుంటున్నారు. ఇది అలా వెళ్లిరావడానికి పిక్నిక్ కాదని వారు భావిస్తున్నారు.
భారత్ వారిని చుట్టుముట్టిందనేది మరో విషయం. అందుకే ఇప్పుడు 'ప్లే టు ది గ్యాలరీ' ఉండాలా, లేక పరిపక్వ విధానాన్ని అవలంబించాలా అనే నిర్ణయం ఇప్పుడు ఇమ్రాన్ ఖానే తీసుకోవాలి.
పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ "కచ్చితంగా సమాధానం ఇస్తాం, ఇది భిన్నంగా ఉంటుంది" అన్నారు.
యుద్ధ వ్యూహాలే కాకుండా దౌత్యపరంగా కూడా ప్రయత్నాలు వేగవంతం చేస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత్ బాధ్యతారహిత విధానం గురించి ప్రపంచ నేతలను హెచ్చరించాలని కూడా నిర్ణయించారు.
మెరుగైన వ్యూహం అదే కావచ్చు. అయితే, భారత్ వైపు బాలాకోట్ దాడులకు ముందు ఎంతమంది ప్రపంచ నేతల హామీని పొందిందో వివరాలు తెలీలేదు.
వాటిలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమ్మతి ఉండనే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, పాకిస్తాన్ దగ్గర కేవలం చైనా మాత్రమే మిగిలింది. దాన్నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది అనే ఆశ లేదు.
అయితే, సైనిక దాడిని సంప్రదాయం ప్రకారం అందరూ ఖండిస్తూ ప్రకటన చేస్తారనే భావిస్తారు. భారత్ ఎప్పటి నుంచో పాకిస్తాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.
ఇమ్రాన్ ఖాన్‌ను మించి చాలా మందికి ఇప్పుడు బాజ్వా సిద్ధాంతం ఏమవుతుందోననే ప్రశ్న వస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా ప్రతిపాదించిన అంశాలే బాజ్వా సిద్ధాంతంగా చెబుతున్నారు. ఇది ప్రాంతీయ శాంతిని కోరుకుంటోంది.
ఈ పాలసీ ప్రకారం భారత్‌తో సమస్యలను ఒక పక్కన పెట్టి మంచి సంబంధాల కోసం ప్రయత్నించాలి. ఇపుడు బాజ్వా సిద్ధాంతానికి కాలం చెల్లిపోతుందా?
యుద్ధం, దౌత్యం ఏదైనా ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు, దేశ ప్రజలకు దేశంలో ఘోరంగా ఉన్న ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళన కలిగిస్తోంది.
ఈ యుద్ధకాంక్షతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఇమ్రాన్ ఖాన్ దగ్గర ఏ ఆప్షన్ ఉంటుంది?
ఆ దేశం యుద్ధం భారాన్ని తట్టుకోగలదా?
ఇప్పుడు పాక్ పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని చెప్పాయి.
కానీ, ఈ రెండు ప్రకటనలతో పరిస్థితి మెరుగుపడుతుందని అనిపించడం లేదు. ప్రపంచ దేశాల మౌనం కూడా అర్థం కాకుండా ఉంది.
ఇవి కూడా చదవండి:
- భారత్ దాడులకు బదులిచ్చే హక్కు మాకు ఉంది: పాకిస్తాన్
- ‘యుద్ధం వస్తుందన్న అనుమానంతో సరుకులు నిల్వ చేసుకుంటున్నారు’
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా?
- భారత్-రష్యా: ఆయుధాలు, మసాలాలు కాకుండా ఇంకేం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి?
- డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








