‘భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పాక్ విమానాలను తిప్పికొట్టిన వాయుసేన’

విమానం

ఫొటో సోర్స్, Getty Images

జమ్ముకశ్మీర్‌లోని నౌషారా సెక్టార్‌లో భారత గగనతలంలోకి పాక్ విమానాలు ప్రవేశించినట్లు పీటీఐ, రాయిటర్స్ వార్తా సంస్థలు వెల్లడించాయి.

అయితే, భారత వాయుసేన పహారా విమానాలు వెంటనే ప్రతిస్పందించడంతో పాక్ విమానాలు వెనక్కు మళ్లాయని అధికారులు వెల్లడించారు.

కాగా తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీనగర్ విమానాశ్రయాన్ని మూడు గంటల పాటు మూసివేశారు.

నియంత్రణ రేఖ వెంబడి దాడులు చేశాం: పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి

పాకిస్తాన్ వైమానిక దళం నియంత్రణ రేఖ వెంబడి పాక్ గగనతలం నుంచే దాడులు నిర్వహించినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ ప్రకటించారు.

భారత్ దుందుడుకు చర్యలకు ఇది ప్రతిచర్య కాదని ఆయన అన్నారు. మానవ నష్టం లేకుండా పాకిస్తాన్ సైనికేతర లక్ష్యాలపై మాత్రమే దాడులు చేసిందని ప్రకటించారు.

ఆత్మరక్షణ హక్కు, సామర్థ్యం తమకున్నాయని చాటడానికే ఈ దాడి చేశామని ఆయన చెప్పారు.

ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం తమకు ఏమాత్రం లేవని.. అయితే, ప్రతిచర్యకు ప్రేరేపిస్తే అందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

‘‘అందుకే పట్టపగలు ఈ చర్యలను చేపట్టాం. ఉగ్రస్థావరాలపై దాడుల పేరుతో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా దాడులకు దిగితే పాకిస్తాన్‌లో భారత్ అండతో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నవారిపై మేమూ దాడులు చేస్తాం. కానీ మేం ఆ మార్గంలో వెళ్లాలనుకోవడం లేదు. భారతదేశం పరిపక్వ ప్రజాస్వామ్య దేశంగా శాంతియుతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం’’ అన్నా రుమొహమ్మద్ ఫైజల్.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

కూలిన భార యుద్ధ విమానాలు

మరోవైపు కశ్మీర్‌ మధ్య ప్రాంతంలోని బడ్గాం జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధవిమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని పైలట్, కో-పైలట్ అక్కడికక్కడే చనిపోయారని పోలీసు వర్గాలు బీబీసీకి తెలిపాయి. ఇద్దరు పైలట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నట్లు వివరించాయి. కార్గిల్ ప్రాంతంలో మరో విమానం కూలిపోయినట్లు కార్గిల్ నుంచి సమాచారం వస్తోంది. కానీ ఇది అధికారికంగా ఇంకా నిర్ధరణ కాలేదు.

మరోవైపు తాము రెండు భారత యుద్ధవిమానాలను కూల్చేశామని పాకిస్తాన్ సైన్యం ట్విటర్‌లో చెప్పింది.

కూలిన విమానం

బడ్గాం పట్టణానికి ఇంచుమించు ఏడు కిలోమీటర్ల దూరంలోని గారాండ్ కలాన్ ప్రాంతంలో బుధవారం ఉదయం దాదాపు 10:40 గంటలకు భారత యుద్ధవిమానం కూలిపోయిందని ఒక పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలన జరుపుతున్నారని పేర్కొన్నారు.

కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో దిగాల్సిన విమానాలను అధికారులు పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు మళ్లించారు. శ్రీనగర్ విమానాశ్రయంలో కార్యకలాపాలను దాదాపు మూడు గంటలుగా నిలిపివేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో కొనసాగుతున్న వైమానిక దళ కార్యకలాపాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నామంటూ ఒక ప్రకటన వెలువడింది.

ఒక పైలట్‌ను అరెస్టు చేశామన్న పాకిస్తాన్

పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్) బుధవారం ఉదయం దాడులు చేపట్టిందని, వీటిపై భారత వైమానికదళం స్పందిస్తూ నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)ని దాటి పాకిస్తాన్ గగనతలంలోకి వచ్చిందని పాక్ సైనిక బలగాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విటర్‌లో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''పాకిస్తాన్ గగనతలంలోకి వచ్చిన రెండు భారత విమానాలను పీఏఎఫ్ కూల్చివేసింది. వీటిలో ఒకటి ఆజాద్, జమ్మూ కశ్మీర్(ఏజేఅండ్‌కే) లోపల పడింది. మరొకటి భారత ఆక్రమిత కశ్మీర్(ఐవోకే)లో పడిపోయింది. ఒక భారత పైలట్‌ను మేం అరెస్టు చేశాం'' అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)