పోకెమాన్ గో రూపకర్తల నుంచి హ్యారీ పోటర్ గేమ్

ఫొటో సోర్స్, Warner Bros Interactive
గతేడాది స్మార్ట్‌ఫోన్ గేమ్ 'పోకెమాన్ గో'తో సంచలనం సృష్టించిన సంస్థ తదుపరి గేమ్‌ను హ్యారీ పోటర్ థీమ్‌తో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆకట్టుకునే అగ్‌మెంటెడ్ రియాలిటీ ఫీచర్‌తో తీసుకొస్తున్నట్లు దాన్ని రూపొందిస్తున్న నియాంటిక్ ల్యాబ్స్ తెలిపింది.
'పోకెమాన్ గో'లో అక్కడక్కడా కనిపించే పోకెమాన్లను వెతికిపట్టాల్సి ఉంటుంది. 'హ్యారీపోటర్ విజార్డ్స్ యునైట్' అని పేరుతో రానున్న కొత్త గేమ్‌లో భారీ మృగాలతో పోరాడొచ్చని రూపకర్తలు వెల్లడించారు.
గతేడాది జూన్‌లో విడుదలైన పోకెమాన్ గో గేమ్‌ను అప్పట్లో దాదాపు 75 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. రోజువారీ వినియోగదారుల సంఖ్య 4.5 కోట్ల దాకా ఉండేది.
దాంతో 7.2 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందని వార్తలొచ్చాయి. అగ్‌మెంటెడ్ రియాలిటీ ఫీచర్లతో వచ్చిన తొలి పాపులర్ గేమ్ అదే.
'హ్యారీపోటర్ విజార్డ్స్ యునైట్' సైతం పోకెమాన్ గో రికార్డులు సాధించే అవకాశం ఉందని ఓ ప్రముఖ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Niantic
హ్యారీ పోటర్ సిరీస్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది ఈ గేమ్‌కు బాగా ఉపయోగపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
హ్యారీ పోటర్ వీడియో గేమ్ హక్కులను వార్నర్ బ్రోస్ ఇంటరాక్టివ్ సంస్థ కొనుగోలు చేసింది. నియాంటికిక్ రూపొందిస్తున్న 'హ్యారీపోటర్ విజార్డ్స్ యునైట్' తోపాటు మరికొన్ని గేమ్స్‌ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని వార్నర్ బ్రోస్ తెలిపింది.
అయితే ఈ గేమ్‌ను ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయాన్ని మాత్రం రూపకర్తలు వెల్లడించలేదు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








