RFID Tag: యుద్ధ కాలంలో అమెరికా మాటల్ని రహస్యంగా విన్న రష్యా.. ఏడేళ్లపాటు ఏం జరిగిందో తెలుసుకోలేకపోయిన అగ్రరాజ్యం

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, టిమ్ హర్‌ఫోర్డ్
- హోదా, ప్రజెంజర్, 50 థింగ్స్ దట్ మేడ్ ది మోడ్రన్ ఎకానమీ
మాస్కో, 1945 ఆగస్టు 4. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరింది. అమెరికా, సోవియట్ యూనియన్‌లు భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సంబంధాల గురించి ఆలోచిస్తున్నాయి.
ఆ సమయంలో రష్యాలోని అమెరికన్ దౌత్య కార్యాలయంలో ఒక యువ సోవియట్ యూనియన్ బృందం అమెరికా-రష్యా మైత్రిపై ఉపన్యాసం ఇచ్చింది.
తర్వాత అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధి హర్రీమన్‌కు ఆ బృందం చేతితో తయారు చేసి యూఎస్ రాజముద్ర జ్ఞాపికను అందజేసింది.
తర్వాత అమెరికా దౌత్య కార్యాలయం ఆ జ్ఞాపికను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. చెక్కతో చేసిన దానిలో అమెరికా సిబ్బందికి ఎలాంటి ఎలక్ట్రిక్ బగ్స్, అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు.
దీంతో హర్రీమన్ దానిని గర్వంగా తన స్టడీ రూంలో గోడకు తగిలించారు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ వస్తువు హర్రీమన్ ప్రైవేటు సంభాషణలను రష్యాకు తెలియజేసింది.

ఫొటో సోర్స్, Getty Images
లియోన్ థెరెమిన్ సృష్టి
లియోన్ థెరెమిన్ ఒక విప్లవాత్మక పేరులేని ఎలక్ట్రికల్ సంగీత వాయిద్యాని వాయించడంలో ప్రసిద్ది చెందారు. ఈ సంగీత పరికరం తాకకుండానే సంగీతం వినిపిస్తుంది.
అతను 1938లో సోవియట్ యూనియన్‌కు రాకముందు భార్య లావినియా విలియమ్స్‌తో కలసి అమెరికాలో ఉన్నారు.
సోవియట్ యూనియన్‌కు వచ్చాక ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసిందని తర్వాత కాలంలో ఆయన భార్య తెలిపింది. జైల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం ఆయనతో అనేక పరికరాలను రూపొందింపజేసింది. రష్యా యువకులు అమెరికా దౌత్య కార్యాలయానికి ఇచ్చిన జ్ఞాపిక అందులో ఒకటి.
కొన్నాళ్లకు అమెరికా రాయబారి సంభాషణలు రెడియోలో ప్రసారం కావడంతో అమెరికన్ రేడియో ఆపరేటర్లు కంగారు పడ్డారు. ఈ ప్రసారాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోడానికి రష్యాలోని రాయబార కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కానీ, వారు ఆ రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు.
గూఢచర్య పరికరం జ్ఞాపిక లోపల ఉంది. బ్యాటరీ, ఇతర ఎలాంటి శక్తివనరులు లేకుండా వెండి డయాఫ్రేమ్, మైక్రోఫోన్‌తో ఆ పరికరం రూపొందించారు.
రేడియో తరంగాలతో పనిచేయడం దీని ప్రత్యేకత. రేడియో తరంగాలను ప్రసారం చేసినప్పుడు ఇది క్రీయాశీలం అవుతుంది. సమాచారాన్ని పంపుతుంది. తరంగాలను ఆపేస్తే పనిచేయడం ఆగిపోతుంది. దీంతో దీన్ని చాలా కాలం ఎవరూ కనిపెట్టలేకపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్
థెరిమిన్ రూపొందించిన ఈ సాంకేతికతను ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్ అంటారు. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(రేడియో పౌనఃపున్య గుర్తింపు)కు సంక్షిప్త రూపం.
ప్రస్తుతం ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. పాస్‌పోర్ట్, క్రెడిట్ కార్డ్‌ల వివరాలు తెలుసుకునేందుకు దీన్ని వాడుతున్నారు.
లైబ్రరీలోని పుస్తకాల గుర్తింపునకు, ఎయిర్‌పోర్టులలో లగేజీ గుర్తింపునకు కూడా ఇదే సాంకేతికత వాడుతున్నారు.
చాలా సాంకేతిక పరికరాలు పనిచేయాలంటే బ్యాటరీ(శక్తి) అవసరం. కానీ, థెరెమెన్ పరికరానికి తరంగాలు చాలు. అందుకే ఇది చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. ధర తక్కువ ఉంటే దాని అమ్మకాలు భారీగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బార్‌కోడ్‌ల మాదిరిగానే ఒక వస్తువును త్వరగా గుర్తించడానికి ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు ఉపయోగపడుతాయి. కానీ, బార్‌కోడ్‌ల మాదిరిగా కాకుండా వీటిని స్వయంచాలకంగా స్కాన్ చేయవచ్చు. కొన్ని ట్యాగ్‌లను చాలా అడుగుల దూరం నుంచి చదవవచ్చు.
అంతేకాదు బార్‌కోడ్ కంటే ఇవి ఎక్కువ డేటాను నిల్వ చేస్తాయి. 1970లలో రైల్వే క్యారేజ్‌లు, పాడి పశువుల గుర్తింపునకు ఈ ట్యాగ్‌లు ఉపయోగించారు.
2000 నాటికి బడా వ్యాపార సంస్థలు టెస్కో, వాల్‌మార్ట్‌తో సహా అమెరికా రక్షణ శాఖ ఈ ట్యాగ్‌లను వినియోగించుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
కొంతమంది ఔత్సాహికులు తమ శరీర భాగంలోకి ఈ ట్యాగ్‌లను అమర్చుకొని ఆటోమెటిక్‌గా తలుపులు తెరవడానికి, ఇతర పనులు చేయడానికి ప్రయత్నించారు.
2007లో వచ్చిన స్మార్ట్ ఫోన్‌లు, వాచ్‌లు, థర్మోస్టాట్లు, స్పీకర్లు, కార్లు దీని ప్రాభవాన్ని తగ్గించాయి. అయితే, ఈ స్మార్ట్ పరికరాలన్నీ అధునాతనమైనవి, ప్రాసెసింగ్ పవర్ ఉన్నవి. విద్యుత్ అవసరం కూడా ఉన్నవి. ఖరీదు కూడా చాలా ఎక్కువ.
స్మార్ట్ యుగం నడుస్తున్న ప్రస్తుతం కాలంలోనే ఆర్‌ఎఫ్‌ఐడీలు నిశ్శబ్దంగా తమ పని తాము చేస్తున్నాయి.
తలుపులను తెరవడం, వస్తువులను ట్రాక్ చేయడం, ఔషధాల గుర్తింపు, బిల్లుల చెల్లింపులలోనూ ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతికత ఉపయోగపడుతుంది.
ఆర్‌ఎఫ్‌ఐడీకి స్మార్ట్ వాచ్, సెల్ఫ్ డ్రైవింగ్ కారుకు ఉన్నంత శక్తి, అనుకూలత ఉండకపోవచ్చు. కానీ, ఇది వాటికంటే చాలా చవకైనది, సూక్ష్మమైంది. కోట్లాది వస్తువులను ట్యాగ్ చేయడానికి ఉపయోగించేందుకు అనువైనది. అంతేకాదు ఎలాంటి బ్యాటరీ అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
- బాడీహ్యాకర్లు: సాహసోపేతం, స్ఫూర్తిదాయకం.. భీతావహం
- ఏ సెల్‌ఫోన్‌తో ఎంత ప్రమాదం?
- విరేచనాలు ఎందుకు వస్తాయి? అరికట్టడం ఎలా...
- బేర్ గ్రిల్స్ నా హిందీని ఎలా అర్థం చేసుకున్నారంటే... ‘రహస్యాన్ని’ వెల్లడించిన మోదీ
- అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు.. కనీస వివాహ వయసులో ఈ తేడా ఎందుకు?
- వృద్ధాప్యాన్ని దాచుకునే ప్రయత్నం ఎందుకు చేస్తాం?
- జేమ్స్ బాండ్ చెడ్డవాడా? ఇప్పుడు మంచివాడిగా మారుతున్నాడా...
- నాజీల కాలం నాటి మానవ శరీర నిర్మాణ శాస్త్ర గ్రంథం వెనుక ఉన్న రక్తసిక్త చరిత్ర ఏంటి...
- అంతరిక్షం నుంచి తొలి నేరం... భూమ్మీద బ్యాంకు ఖాతాను హ్యాక్ చేశారని ఆరోపణలు
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- భారత 'రూపాయి' విలువ బంగ్లాదేశ్ 'టకా' కంటే తగ్గిందా? - Fact Check
- బంగ్లాదేశ్ వివాహ పత్రాల్లో 'కన్య' అనే మాటను తొలగించిన కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








