భారత 'రూపాయి' విలువ బంగ్లాదేశ్ 'టకా' కంటే తగ్గిందా? - Fact Check

ఫొటో సోర్స్, Google
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
భారత రూపాయి విలువపై సోషల్ మీడియాలో కలకలం రేగుతోంది. బంగ్లాదేశ్ కరెన్సీ 'టకా'తో పోలిస్తే భారత 'రూపాయి' బలహీనపడిందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు.
ఫేస్‌బుక్, ట్విటర్‌లో చాలా మంది అలాంటి పోస్టులు చేశారు. వాటిలో 72 ఏళ్లలో మొదటిసారి భారత రూపాయి విలువ బంగ్లాదేశ్ 'టకా' కంటే వెనకబడిందని రాశారు.
ఇలాంటి పోస్టులు చేసినవారిలో ఎక్కువ మంది భారత కరెన్సీ ఈ స్థితికి చేరడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వమే కారణం అన్నారు.
కరెన్సీ రేట్, రూపాయి-టకాను పోలుస్తూ చాలా మంది కొన్ని గ్రాఫ్స్ కూడా పోస్ట్ చేశారు.
కానీ మా పరిశీధనలో మేం ఈ వాదన తప్పని గుర్తించాం. కరెన్సీ రేట్ ఉన్న గ్రాఫ్ ఈ విలువను పూర్తిగా వ్యతిరేకంగా చూపిస్తోంది.

ఫొటో సోర్స్, Twitter
భారత రూపాయి- బంగ్లాదేశ్ టకా
బంగ్లాదేశ్, భారత్ స్టాక్ ఎక్ఛేంజిల నుంచి లభించిన వివరాల ప్రకారం, టకా-రూపాయి కన్వర్షన్ రేట్ చూపిస్తున్న కొన్ని వెబ్‌సైట్స్ చెబుతున్న దాని ప్రకారం మంగళవారం, ఒక భారత రూపాయితో పోలిస్తే బంగ్లాదేశ్ టకా విలువ 1.18 టకా ఉంది.
అంటే ఒక భారత రూపాయికి 1.18 బంగ్లాదేశ్ టకాలు వస్తాయి. పది రూపాయల విలువ 11.80 బంగ్లాదేశీ టకాలు.
దీనినే తిరగేసి చూస్తే బుధవారం రేటు ప్రకారం ఒక బంగ్లాదేశీ టకాకు 85 పైసలు(రూపాయిలో) మాత్రమే వస్తాయి. అంటే పది బంగ్లాదేశ్ టకాల విలువ 8.50 రూపాయలు.
మరింత స్పష్టంగా చెప్పాలంటే.. ఒక బంగ్లాదేశీ టకా కొనాలంటే 85 పైసలు చెల్లిస్తే చాలు.
సోషల్ మీడియాలో జనం రివర్స్ కన్వర్షన్ రేట్ ఉన్న ఈ గ్రాఫ్‌నే పోస్ట్ చేస్తున్నారు. ఒక బంగ్లాదేశ్ టకాకు 0.85 భారత రూపాయి ఉండడంతో విదేశీ కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి బలహీనపడిందని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Twitter
డాలర్‌తో రూపాయి విలువ
బంగ్లాదేశ్‌లోని ఢాకా స్టాక్ ఎక్ఛేంజ్, చిట్టగాంగ్ స్టాక్ ఎక్ఛేంజ్ వివరాల ప్రకారం మంగళవారం ఒక అమెరికా డాలర్ విలువ 86.60 బంగ్లాదేశ్ టకాకు సమానంగా ఉంది.
ఇటు భారత నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ ప్రకారం ఒక అమెరికా డాలర్ విలువ 71.70 రూపాయలకు సమానం.
అంటే డాలరుకు బంగ్లాదేశ్ టకాతో పోలిస్తే రూపాయే మెరుగ్గా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
గత 90 రోజుల్లో ఒక అమెరికా డాలర్‌కు బదులు భారత రూపాయి గరిష్ట విలువ 72.08 రూపాయలకు చేరింది. అటు బంగ్లాదేశ్ టకా విలువ గరిష్టంగా 84.77 వరకూ చేరింది.
దీనినే గత పదేళ్లలో చూస్తే ఒక అమెరికా డాలర్‌కు భారత రూపాయి కనిష్ట విలువ 73.92 ఉంది, అటు బంగ్లాదేశ్ టకా ధర 68.24 ఉంది.
అంటే, గత పదేళ్లలో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ కంటే బంగ్లాదేశ్ కరెన్సీ స్థితి కాస్త మెరుగుపడింది.
బంగ్లాదేశ్ వార్షిక జీడీపీ వృద్ధి రేటు పాకిస్తాన్ కంటే రెండున్నర శాతం ముందుకు వెళ్లిపోయింది. అందుకే ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బాసు "బంగ్లాదేశ్ అభివృద్ధి రేటు విషయంలో భారత్‌ను కూడా దాటిపోవచ్చని" చెప్పారు.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి)
ఇవి కూడా చదవండి:
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- మోదీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్ల నిధులు ఎందుకు తీసుకుంది?
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- దళితుడి శవాన్ని వంతెన మీంచి కిందకు తాళ్ళు కట్టి ఎందుకు దింపారు...
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








