లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది

ఫొటో సోర్స్, Getty Images
అమెరికన్ డాలర్‌తో పోల్చితే భారత కరెన్సీ రూపాయి విలువ చరిత్రలో అత్యంత తక్కువ స్థాయికి చేరింది. ఇప్పుడు డాలర్ విలువ రూ.70కి అటు ఇటుగా ఉంది.
టర్కీ కరెన్సీ లిరా సంక్షోభం రూపాయి పతనానికీ ఓ కారణమైందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
టర్కీలో పలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో లిరా అత్యంత కనిష్ఠ స్థాయికి చేరింది. కంపెనీలు బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడం.. అమెరికాతో సంబంధాలు క్షీణిస్తుండటం, టర్కీ ఉక్కు, అల్యూమినియంపై అమెరికా ధరలు పెంచడం వంటి కారణాలు లిరా పతనానికి దారి తీశాయి.
లిరా పతనం ప్రభావంతో పెట్టుబడిదారులు రూపాయికన్నా డాలర్ వంటి సురక్షితమైన కరెన్సీవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ వంటి దేశాల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతున్నాయి.
''ఇదే పరిస్థితి కొనసాగుతుందని అనుకోవడం లేదు. ఒకవేళ కొనసాగితే నియంత్రించడానికి ఆర్బీఐకి తగిన సాధనాలు ఉన్నాయి. తగిన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది'' అని ఆర్థిక నిపుణుడు వివేక్ కుమార్ అన్నారు.
ఇప్పుడు లిరా సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో భారత కరెన్సీ కూడా కొన్నాళ్లు బలహీనంగానే ఉండొచ్చు.
ఇవికూడా చదవండి:
- అంతరిక్షంలోకి కొత్త జంటల ప్రేమ సందేశాలు
- వీగర్ ముస్లింలను చైనా వేధిస్తోందా? జిన్జియాంగ్లో అసలేం జరుగుతోంది?
- అమ్మాయిలకు మీసాలు, గడ్డం ఎందుకు వస్తాయి?
- బీబీసీ స్పెషల్: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ఎడారీకరణ ముప్పు
- ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కరెన్సీ దొంగతనం: 34 వేల కోట్లు.. కొల్లగొట్టారు
- టెలిగ్రామ్‌పై ఆంక్షలు: కరెన్సీ నోట్లతో ఇరానియన్ల వినూత్న ఉద్యమం
- మరో 10వారాల్లో పాకిస్తాన్ ఖజానా ఖాళీ!
- కప్పు కాఫీ తాగాలంటే నాలుగు కట్టల డబ్బు కావాలి!
- బిట్కాయిన్లతో బిలియనీర్లయిపోగలమా?
- రూపాయి నోటుకు వందేళ్లు
- యాపిల్ కంపెనీ విలువ రూ.68,61,000,00,00,000
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





