ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ కరెన్సీ ‘దొంగతనం’

ఫొటో సోర్స్, EPA
దాదాపు రూ.34 వేల కోట్ల విలువ కలిగిన (534 మిలియన్ డాలర్ల) వర్చువల్ నగదు దొంగతనం జరిగిందని జపాన్‌లోని అతిపెద్ద డిజిటల్ కరెన్సీ ఎక్స్ఛేంజి చెప్పింది.
హ్యాకర్లు తమ నెట్‌వర్క్‌పై దాడి చేసి, ఈ దొంగతనానికి పాల్పడ్డారని ‘కాయిన్ చెక్’ డిజిటల్ కరెన్సీ ఎక్స్ఛేంజి తెలిపింది.
ఎన్ఈఎం కాయిన్ల రూపంలోని తమ క్రిప్టో కరెన్సీని దోచుకున్నారని తెలుసుకున్న తర్వాత బిట్ కాయిన్లు మినహా మరే ఇతర లావాదేవీలను అనుమతించట్లేదని కాయిన్ చెక్ ప్రకటించింది.

- క్రిప్టో కరెన్సీ అంటే.. డిజిటల్ ఆస్తి రూపంలో లావాదేవీలకు వాడుకునే.. సంకేత రూపంలో భద్రపరిచిన నగదు.
- ఎన్ఈఎం కాయిన్లను 2015లో ప్రవేశపెట్టారు. అయితే, ఇవి పెద్దగా ప్రాచుర్యం పొందలేదు.

ఒకవేళ ఈ దొంగతనం కనుక రుజువైతే డిజిటల్ కరెన్సీ రూపంలో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద దొంగతనం ఇదే అవుతుంది.
2014లో టోక్యోకే చెందిన మరొక ఎక్స్ఛేంజి మెట్‌గాక్స్ కూడా ఇదే తరహాలో దోపిడీకి గురైంది. అప్పట్లో రూ.25 వేల కోట్ల విలువైన (400 మిలియన్ డాలర్ల) వర్చువల్ కరెన్సీని ఆ సంస్థ నెట్‌వర్క్ నుంచి దొంగిలించారు.
కాగా, ప్రస్తుతం కాయిన్ చెక్ నుంచి దోపిడీకి గురైన నగదును ‘హాట్ వాలెట్’లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ హాట్ వాలెట్ కూడా ఎక్స్ఛేంజిలో ఒక భాగం. ఇది ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉంటుంది. ఎక్స్ఛేంజిలోనే కోల్డ్ వాలెట్ అని కూడా మరొకటి ఉంటుంది. ఇంటర్నెట్‌తో సంబంధం లేని ఆఫ్‌లైన్‌లో నిధులు భద్రంగా ఉండే ఏర్పాటు కలిగిన వ్యవస్థ కోల్డ్ వాలెట్.
నగదు ఎక్కడికి వెళ్లిందనేది తమకు డిజిటల్ అడ్రస్ ద్వారా తెలుస్తుందని కాయిన్ చెక్ తెలిపింది. పెట్టుబడిదారులకు పరిహారం చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించింది.
ఎప్పుడు జరిగింది?
కాయిన్ చెక్ కంపెనీ ప్రకటన ప్రకారం.. జపాన్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 2.57 గంటలకు హ్యాకర్లు ఈ దోపిడీకి పాల్పడ్డారు. అయితే, దాదాపు ఎనిమిదిన్నర గంటల వరకూ కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించలేదు.
కాయిన్ చెక్ ఎన్ఈఎం అడ్రస్ నుంచి మొత్తం 523 మిలియన్ ఎన్ఈఎంలు బదిలీ అయ్యాయని కంపెనీ సీఈఓ యుసుకే ఒట్సుక తెలిపారు.
ఈ దోపిడీపై పోలీసులకు, జపాన్ ఆర్థిక సేవల ఏజెన్సీకి ఫిర్యాదు చేసినట్లు కాయిన్ చెక్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- బిట్కాయిన్లతో బిలియనీర్లయిపోగలమా?
- చదివింపులుగా బిట్కాయిన్లు
- ఢమాల్: ఒక్క రోజులో మూడోవంతు కోల్పోయిన బిట్ కాయిన్
- సెక్యూరిటీ గురు, యాంటీ వైరస్ సంస్థ మేకఫీ వ్యవస్థాపకుడి ఖాతా హ్యాక్!
- మీ కంప్యూటర్ను ఎలా హ్యాక్ చేస్తారో తెలుసా?
- 'యాహూ యూజర్ల ఖాతాలన్నీ లీకయ్యాయ్'
- శీతాకాల ఒలింపిక్స్‌కు హ్యాకర్ల ముప్పు?
- ఇంటెల్, ఏఎమ్‌డీ, ఏఆర్ఎమ్ చిప్స్‌లో తీవ్రమైన లోపాలు
- ‘వన్నాక్రై సైబర్ దాడి చేసింది ఉత్తర కొరియానే’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








