ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలు ఎక్కడి నుంచి అందుతున్నాయి?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్

ఫొటో సోర్స్, STR/AFP/ GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అణు పరీక్షల పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్

నిత్యం అణు పరీక్షలు, క్షిపణుల ప్రయోగాలతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఉత్తర కొరియాపై పలు దేశాలు ఎన్నో రకాల నిషేధాలు విధించాయి. మరి ఆ దేశానికి ఇంటర్నెట్ సేవలు ఎవరు అందిస్తున్నారన్న విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు. తాజాగా ఆ విషయం బయటపడింది.

ఉత్తరకొరియాలో అంతర్గత ఇంటర్నెట్ వ్యవస్థ(ఇంట్రానెట్) ఉంది. దానికి అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానం ఉండదు.

పైగా ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్లు ఆ దేశంలో నిషేధం.

మరి ఉత్తరకొరియా ప్రపంచంతో ఎలా అనుసంధానమవుతోంది? ఎవరు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు?

తాజాగా వచ్చిన వార్తల ప్రకారం రష్యా నుంచి ఉత్తర కొరియా ఇంటర్నెట్‌తో అనుసంధానం అవుతోందని తెలుస్తోంది.

ఈ విషయాన్ని అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను పరిశీలించే సంస్థ డైన్ రీసెర్చ్ వెల్లడించింది.

రష్యా టెలికం సంస్థ ట్రాన్స్‌టెలికం ఈ సేవలను గత ఆదివారం ప్రారంభించినట్లు తెలిపింది.

కంప్యూటర్‌లో ఇంటర్నెట్ వినియోగిస్తున్న ఉత్తర కొరియా వాసి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇకపై ఉత్తర కొరియా లో ఏం జరుగుతుందో రష్యాకు తెలిసే అవకాశం ఉంది.

ఇంతకు ముందు చైనా యునైటెడ్ నెట్‌వర్క్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ద్వారా ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలు అందేవి. ఇప్పుడు ఆ బాధ్యతలు రష్యా సంస్థ తీసుకుందట.

రష్యా నుంచి ఇంటర్నెట్ అనుసంధానం కావడంతో ఉత్తర కొరియా సాంకేతికంగా మరింత బలపడినట్లైంది.

అయితే దీని ద్వారా ఇంటర్నెట్‌ను ఉత్తర కొరియా ఏవిధంగా వినియోగిస్తుందన్న విషయాలపై రష్యా ఓ కంట కనిపిట్టే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)