చంద్రయాన్ 2: మరో ముఖ్య ఘట్టం విజయవంతం.. ఆర్బిటర్ నుంచి వేరు పడిన 'విక్రమ్ ల్యాండర్'

ఇస్రో చంద్రయాన్ ఆర్బిటర్

ఫొటో సోర్స్, twitter/isro

ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్ 2 ప్రయోగంలో మరో ముఖ్యమైన అంకం పూర్తయింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా వేరు పడింది.

భారత కాలమానం ప్రకారం సెప్టెంబరు 2 సోమవారం మధ్యాహ్నం 1:15 గంటలకు ల్యాండర్ విడిపోయినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తెలిపింది. ల్యాండర్ ప్రస్తుతం 119 కిలోమీటర్లు X 127 కిలోమీటర్ల కక్ష్యలో ఉన్నట్లు చెప్పింది.

చంద్రయాన్ 2 ఆర్బిటర్ తన ప్రస్తుత కక్ష్యలోనే చంద్రుడి చుట్టూ తిరుగుతోందని ఇస్రో చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దించే క్రమంలో తదుపరి కార్యక్రమాన్ని ఇస్రో రేపు అంటే సెప్టెంబరు 3 మంగళవారం చేపట్టనుంది.

ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య ల్యాండర్ కక్ష్యను తగ్గించనుంది. దీంతో ల్యాండర్ 109 కి.మీ. X 120 కి.మీ. కక్ష్యలోకి చేరనుంది.

బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ల్యాండర్ కక్ష్యను ఇస్రో మరోసారి తగ్గిస్తుంది.

అప్పుడు ల్యాండర్ 36 కి.మీ. X 110 కి.మీ. కక్ష్యలోకి చేరుకుంటుంది.

చంద్రయాన్ 2 ఆర్బిటర్ పైభాగంలో అమర్చిన విక్రమ్ ల్యాండర్

ఫొటో సోర్స్, www.isro.gov.in

ఫొటో క్యాప్షన్, చంద్రయాన్ 2 ఆర్బిటర్ పైభాగంలో అమర్చిన విక్రమ్ ల్యాండర్

సెప్టెంబరు 7న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది.

ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ల్యాండర్‌కు ఇస్రో 'విక్రమ్' అని పేరు పెట్టింది.

ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత 'రోవర్' అనే పరికరాన్ని బయటకు పంపుతుంది. రోవర్‌ పేరు 'ప్రజ్ఞాన్'.

ప్రజ్ఞాన్ రోవర్

ఫొటో సోర్స్, www.isro.gov.in

ఫొటో క్యాప్షన్, ప్రజ్ఞాన్ రోవర్ (చక్రాలున్న పరికరం)

చంద్రయాన్ 2 ఆర్బిటర్, ల్యాండర్‌లోని అన్ని వ్యవస్థలు బాగున్నాయని ఇస్రో తెలిపింది.

ఆర్బిటర్, ల్యాండర్‌ ఎలా ఉన్నాయేది బెంగళూరులోని 'ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌(ఐఎస్‌టీఆర్‌ఏసీ)'లో ఉండే మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్(ఎంవోఎక్స్) నుంచి పరిశీలిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరు సమీపాన బైలాలులో ఉండే 'ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్(ఐడీఎస్‌ఎన్)' యాంటెనాల సాయంతో ఈ పని చేస్తున్నట్లు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)