కాన్పు నొప్పులను తట్టుకొనేందుకు వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్

ప్రసవ వేదనను తట్టుకోవడంలో గర్భిణులకు సాయపడేందుకు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఒక ఆస్పత్రి వినూత్న ప్రయత్నం చేస్తోంది. వారికి వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్లు ఇచ్చి, కాన్పు నొప్పులను తట్టుకోవడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందా అన్నది పరీక్షిస్తోంది.
కార్డిఫ్ నగరంలోని 'యూనివర్శిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్' ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తోంది. ఈ విధానం ఇక్కడ విజయవంతమైతే వేల్స్ వ్యాప్తంగా విస్తరించే అవకాశముంది.
పురుటి నొప్పిని తట్టుకొనేలా చేయడంలో ఈ టెక్నాలజీ ఒక ప్రత్యామ్నాయంగా ఉందని మంత్రసాని (మిడ్‌వైఫ్) సుజానే హార్డాక్రే తెలిపారు.
ఈ టెక్నాలజీ ఒక 'సిమ్యులేటర్'లా ఉందని దీనిని వాడిన మహిళల్లో ఒకరైన హన్నా లెలీ చెప్పారు. ఈ నెల్లోనే తల్లి అయిన హన్నా.. ప్రసవానికి ముందు వీఆర్ కిట్‌ను వాడారు.
కిట్‌ను ఆన్ చేస్తే 360 కోణాల్లో తన చుట్టూ ఉన్న పరిసరాలు కనిపించాయని హన్నా చెప్పారు. రిలాక్సేషన్‌కు ఇది ఉపయోగపడిందన్నారు.

ముఖ్యంగా కాన్పు నొప్పుల తొలి దశలో వీఆర్ కిట్లు వినియోగించవచ్చని సుజానే తెలిపారు. శ్వాస తీసుకోవడం, రిలాక్సేషన్ విషయంలో గర్భిణులకు ఇవి ఉపయోగపడొచ్చన్నారు.
ఈ టెక్నాలజీ గర్భిణులందరికీ, కాన్పు నొప్పులు వస్తున్నంత సమయం మొత్తానికీ ఉపయోగపడకపోవచ్చని, కానీ నొప్పులు మొదలైన సమయంలో వాటిని తట్టుకొనేందుకు ఒక ప్రత్యామ్నాయం కాగలదని సుజానే వివరించారు.
ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థ 'రీస్కేప్' ఏడాదికి వీఆర్ హెడ్‌సెట్‌కు దాదాపు నాలుగు వేల పౌండ్లు (సుమారు రూ.3.5 లక్షలు) వసూలు చేస్తోంది.
గతంలో కాన్పు సమయంలో తీవ్రమైన మనోవేదనను ఎదుర్కొన్న మహిళలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడొచ్చని సుజానే చెప్పారు.
కాన్పు నొప్పుల తొలి దశలో ఈ టెక్నాలజీ ఎక్కువ ఉపయోగపడుతుందని, ఎందుకంటే ఆ సమయంలో గర్భిణులు ఎక్కువ నియంత్రణ శక్తిని కలిగి ఉంటారని ఆమె వివరించారు.
ప్రస్తుతం కాన్పు నొప్పులు మొదలైనప్పుడు గర్భిణులకు నీళ్లు ఇవ్వడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేకుండా చూడడం, ఒత్తిడి లేకుండా రిలాక్స్ అయ్యేలా చూడటం చేస్తున్నామని సుజానే తెలిపారు. వీఆర్ టెక్నాలజీ వీటికి అదనంగా ఉంటుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
- పోర్న్ స్టార్ మియా ఖలీఫాను వెంటాడుతున్న గతం
- 'అమెజాన్ చాయిస్' లేబుల్ ఎలా ఇస్తారు?'
- పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తకు తగిన గుర్తింపు దక్కలేదా
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- శుభ్రత అంటే ఏమిటి? పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం అంటే ఏమిటి...
- 'మీరిలా చేస్తే గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చు'
- పని చేయాలంటే విసుగొస్తోందా? పరిష్కారాలేమిటి?
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- శుభ్రత అంటే ఏమిటి? పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం అంటే ఏమిటి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








