రివైండ్ 2023: మీరు సోషల్ మీడియా ఫాలో అయ్యారా? 'నాటు.. నాటు' నుంచి 'జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్' వరకు గుర్తుందా?

ఫొటో సోర్స్, Getty Images&_Acha mass/Instagram
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్, కోచి
2023 సంవత్సరం పూర్తికావొస్తోంది. ఏ ఏడాదిలో భారత్ చరిత్రలో నిలిచిపోయే విజయాలను సాధించింది.
భారతీయులు విజయాలను ఏ విధంగా ఆస్వాదించారో, కొన్ని వివాదాలపైనే అదే రీతిలో సోషల్ మీడియాలో స్పందించారు.
అలా 2023లో సోషల్ మీడియాలో ఎక్కువ మంది చర్చించుకున్న పలు భిన్నమైన అంశాలు, సందర్భాల్లో కొన్ని..
భారతదేశపు వినోద పరిశ్రమ ప్రపంచ వేదికపై వెలిగిన అరుదైన క్షణాలకు 2023 వేదికైంది.
సోషల్ మీడియా అంతా అస్కార్ అవార్డుల గురించి చర్చించుకుంటే, వాటిలో ఎక్కువగా వినిపించిన పేరు ఆర్ఆర్ఆర్.

ఫొటో సోర్స్, RRR/REUTERS
ఆస్కార్ వేదికపై 'నాటు.. నాటు'
రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కథానాయకులుగా మొదలైన రూపుదిద్దుకున్న ఈ సినిమా విషయంలో, మొదటి నుంచి ప్రపంచవేదికపై విడుదల వరకు సర్వత్రా అంచనాలను పెంచింది ఆర్ఆర్ఆర్ చిత్రం.
2022లో చిత్రం విడుదలైయ్యాక అంతకు మించిన ప్రజాదరణ పొందింది. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాట చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు సాధించిన తొలి భారతీయ పాటగా చరిత్రలో నిలిచింది.
ఈ క్యాటగిరీల్లో లేడీ గాగా, రిహన్నా వంటి గ్లోబల్ స్టార్‌లను కూడా వెనక్కు నెట్టి, అవార్డు గెలుచుకుంది.
పురస్కారాల ప్రధానోత్సవం రోజున చేసిన నృత్యప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
డాక్యుమెంటరీ లఘు చిత్రం ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ను ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపిక చేశారు. ఈ డాక్యుమెంటరీకి కార్తీకి గొంజాల్వెజ్ దర్శకురాలు. గునీత్ మోంగా నిర్మాతగా వ్యవహరించారు.
ముదుమలై శాంక్చురీలో ఏనుగుల సంరక్షకులుగా పనిచేసే బొమ్మన్, బెల్లీ జంట అనాథ ఏనుగుల సంరక్షణ బాధ్యతలను చూస్తుంటారు. ఈ డాక్యుమెంటరీలో ఏనుగులతో వారికి ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని ఆవిష్కరించారు

ఫొటో సోర్స్, Getty Images
చరిత్ర లిఖించిన భారత్
ఆగస్టు నెలలో చంద్రయాన్-3 ప్రయోగ విజయంతో కోట్లమంది భారతీయుల్లో సంతోషం నెలకొంది.
చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సాధించింది.
అంతేకాకుండా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత సాధించిన నాలుగో దేశంగానూ నిలిచింది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, సోవియట్, చైనాలు ఉన్నాయి.
చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది ఇస్రో.
ఆ ల్యాండింగ్ వీడియో లైవ్ టెలికాస్ట్‌ను యూట్యూబ్‌లో 79 మిలియన్ల వీక్షణలు వచ్చాయి.
ఆ విజయంతో సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ మొదలైంది. ఇస్రో శాస్త్రవేత్తలను యూజర్లు ప్రశంసించారు.
చంద్రయాన్3 కి సంబంధించిన ప్రతి అప్డేట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఇస్రో.

ఫొటో సోర్స్, _acha_mass/Instagram
ఈ అవ్వాతాతలు సోషల్ ఫేమస్..
కేరళకు చెందిన రెట్నమ్మ, తులసీధరణ్ దంపతులు చేసిన ఒక్క వీడియో ఎంత వైరల్ అయిందంటే, సోషల్ మీడియా మొత్తం ఆ వీడియోతో ట్రెండ్ క్రియేట్ చేసేంతలాగా మారింది.
2016లో విడుదలైన జూటోపియా ఏనిమేషన్ చిత్రంలోని ఒక సీన్‌ను తులసీధరణ్ దంపతులు రీక్రియేట్ చేశారు.
ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు తొలివారంలోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
అచ్చమాస్ పేరిట ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో తర్వాత ఈ వృద్ధదంపతుల గురించి అంతా మాట్లాడుకున్నారు.
ఇప్పుడు ఈ అకౌంట్‌కు 5.76 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తమ మనవళ్ల సాయంతో ఆ వీడియో చేసినట్లు రెట్నమ్మ దంపతులు తెలిపారు.
మలయాళ మనోరమ అన్న పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెట్నమ్మ మాట్లాడుతూ, "దంపతుల వీడియో ఇన్‌స్టాలో అన్ని మిలియన్లు సొంతం చూసుకోవడం అదే మొదటిసారి" అని చెప్పారు.

ఫొటో సోర్స్, designmachinesuitslive/Insta
‘జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్!’
‘జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్!’ ఈ లైన్ 2023లోనే సోషల్ మీడియా యూజర్లను బాగా ఆకర్షించిందని చెప్పొచ్చు.
ఈ వీడియో చేసిన జస్మీన్ కౌర్ దిల్లీలో 20 ఏళ్లుగా వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారు. కానీ, అక్టోబర్ నెలలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో కౌర్ తన దుకాణంలో ఉన్న డిజైన్లను వివరిస్తున్న ఆమె తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.
‘సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ అంటూ ఆ డిజైన్లకు ఆమె ఇచ్చిన కితాబే ఆమెను సెలబ్రిటీని చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ స్టార్లు దీపికా పదుకొణె వంటి నటీమణులతోపాటు రాజకీయ నాయకులు, ఇన్‌ఫ్ల్యుయెన్సర్లు అంతా జస్మీన్ కౌర్ వాయిస్‌కు లిప్ సింక్ చేసి, రీల్స్ చేశారు. అాలా 2 మిలియన్లకు పైగా రీల్స్ క్రియేట్ అయ్యాయి.
తనకు లభించిన ఆదరణ పట్ల జస్మీన్ సంతోషం వ్యక్తం చేశారు.
ది హిందుస్తాన్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, "గత మూడేళ్లుగా నేను ఇన్‌స్టా వీడియోలు చేస్తున్నాను. కానీ, ఆ వీడియో మాత్రం వైరల్ అయింది. ప్రియాంక చోప్రా భర్త (నిక్ జోనాస్) కూడా రీల్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితం మారిపోయింది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సుధామూర్తి వ్యాఖ్యలు..
ప్రముఖ రచయిత్రి సుధామూర్తి చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా అంతటా చర్చ నడిచింది. తాను పూర్తి శాకహారినని, విదేశీ ప్రయాణంలో పొరపాటున కూడా మాంసాహారాన్ని ముట్టుకుకోండా ఉండేందుకు, తానే స్పూన్‌ను తీసుకుని వెళ్తానని ఆమె చెప్పిన మాటలు వివాదానికీ, చర్చకూ దారితీశాయి. సోషల్ మీడియాలో కొంతమంది దీనిపై సరదాగా వ్యాఖ్యలు కూడా చేశారు.
సుధామూర్తి తనను తాను పూర్తి శాకాహారిగా చెప్పారు. ఆమె మాట్లాడుతూ, "వంటకాల్లో మాంసాహారానికి వాడిన స్పూన్లు, మళ్లీ శాకాహార వంటల్లోనూ వాడతారేమోనని నాకు భయం" అని చెప్పారు.
కొంతమంది ఈ వ్యాఖ్యలను విమర్శిస్తే, కొంతమంది సమర్థించారు, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. అయితే, విమర్శకులు మాత్రం, ఆమె చేసిన వ్యాఖ్యలు అగ్రకుల-బ్రాహ్మణ ఆలోచనలను సూచిస్తున్నాయని అన్నారు.
మరికొందరైతే, ఆమె అల్లుడు బ్రిటన్ ప్రధాని రిషిసునక్ మాంసాహార వంటకాలున్న ప్లేట్‌ను తీసుకువెళ్తున్న ఫొటోలను షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వారానికి ఎంతసేపు పనిచేయాలి?
సుధామూర్తి వ్యాఖ్యలు చేసిన కొద్దినెలలకే భారత సాఫ్ట్‌వేర్ బిలీయనర్లలో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి పనివిధానంపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు సుదీర్ఘమైన చర్చ నడిచింది.
ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నారాయణమూర్తి భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించారు. "మన పని ఉత్పాదకతను మెరుగుపర్చుకోకపోతే, అద్భుతమైన ప్రగతిసాధించిన దేశాలతో మనం పోటీపడలేం" అన్నారు.
ఈ వ్యాఖ్యల పట్ల ఆయనకు పలువురు వ్యాపారవేత్తల నుంచి మద్దతు లభించింది. కానీ, సోషల్ మీడియాలో చాలామంది ఈ వ్యాఖ్యలను విమర్శించారు.
ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా టాక్సిక్ వర్క్ కల్చర్‌ను ప్రోత్సహించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఓరి కోసం తెగ వెతికేశారు..
ఎవరతను? ప్రముఖ సెలబ్రిటీల ఫొటోల్లో కనిపిస్తున్నాడు? ఓరినా? ఎవరీ ఓరీ? అంటూ సోషల్ మీడియాలో ఓరీ గురించి తెగవెతికేశారు.
ఓరీ దీపికా పదుకొణె, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ నటీమణులతో మొదలుకుని నీతూ అంబానీతో ఫొటోల్లో కనిపించారు. ఆ తరువాత సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇంటివద్ద నిర్వహించిన పార్టీలో కూడా కనిపించారు. దీంతో అసలు ఎవరాయన? అన్న చర్చ మొదలైంది. కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్‌లు ఆ ప్రశ్నలకు సమాధానలు వెతికే పనిలో పడ్డాయి. కొన్నింటికి సమాధానాలు వెతికాయి కూడా.
ఓరీ అసలు పేరు ఓర్హాన్ అవత్రమణి. ఆయన వ్యాపారవేత్త సూరజ్ అవత్రమణి, షానాజ్ అవత్రమణి కొడుకు.
న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఓరీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఓరీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కుమారులు, కుమార్తెలు, బాలీవుడ్ స్టార్ కిడ్స్‌తో కలిసి చదువుకున్నారు.
లింక్డిన్ ప్రొఫైల్‌లో తనకు తాను సామాజిక కార్యకర్తగా చెప్పుకున్నారు. అంతేకాక, పాటల రచయిత, గాయకుడు, క్రియేటివ్ డైరెక్టర్, ఫ్యాషన్ స్టయిలిస్ట్‌గా కూడా అభివర్ణించుకున్నారు.
కాస్మోపాలిటన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానేం చేస్తారని అడిగిన ప్రశ్నకు, ఓరి సమాధానమిస్తూ, "నేను పనిచేస్తున్నాను. కానీ నాకోసం పనిచేస్తున్నాను అని చెప్పిన మాటలు వైరల్" అయ్యాయి.
మరో ఇంటర్వ్యూలో "నేను జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
- వ్యూహం: 'నన్ను చంపడానికి పబ్లిగ్గా కాంటాక్ట్ ఇచ్చిన కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి' -డీజీపీకి రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు
- అరపైమా గిగాస్, పైచ్: ఈ చేపకు ఆకలి ఎక్కువ.. పీక్కు తినే పిరానా చేపను కూడా ఇది మింగేస్తుంది
- ‘డెవిల్’ రివ్యూ: నేతాజీతో మర్డర్ మిస్టరీని ముడిపెట్టిన ఈ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది?
- కొత్త మహా సముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














