నేను ‘బైసెక్సువల్’ అని నాకన్నా ముందే నెట్‌ఫ్లిక్స్‌కు ఎలా తెలిసింది?

- రచయిత, ఎల్లీ హౌస్
- హోదా, బీబీసీ లాంగ్ ఫామ్ ఆడియో
బీబీసీ రిపోర్టర్ ఎల్లీ హౌస్ తాను ‘గే’ అని తెలుసుకోవడానికంటే ముందే నెట్‌ఫ్లిక్స్‌కు ఆ విషయం తెలిసిందని గ్రహించారు. ఇదెలా సాధ్యమని ఆమె ఆశ్చర్యపోయారు.
అసలేం జరిగిందో ఎల్లీ హౌస్ మాటల్లోనే తెలుసుకుందాం...
యూనివర్సిటీలో రెండో ఏడాది చదువుతున్నప్పుడు నేను బైసెక్సువల్ అని నాకు అర్థమైంది.
కానీ, ఒక పెద్ద టెక్నాలజీ సంస్థ ఈ సంగతిని నేను తెలుసుకోవడానికి కొన్ని నెలల ముందే తెలుసుకుందని నాకనిపిస్తోంది.
అంతకుముందు నాకొక బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. నేను ఎప్పుడూ నాకు నేను ‘స్ట్రెయిట్’గా పరిగణించేదాన్ని.
నిజాయితీగా చెప్పాలంటే, డేటింగ్ అనేది నా ఎజెండాలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో లేదు.
ఆ సమయంలో నేను ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ చూసేదాన్ని. లెస్బియన్ స్టోరీలైన్స్ లేదా బై సెక్సువల్ క్యారెక్టర్స్‌తో రూపొందిన సిరీస్‌లు నాకు ఎక్కువగా రికమండేషన్స్‌గా చూపించేది నెట్‌ఫ్లిక్స్.
నా వయసున్న, నావంటి నేపథ్యమున్న, అలాగే నాలాగే స్ట్రీమింగ్ హిస్టరీలున్న స్నేహితులెవరికీ కూడా ఈ టీవీ సిరీస్‌ల రికమండేషన్లు రాలేదు.
వారికి వచ్చినట్లు నేనెప్పుడూ వినలేదు.
‘యూ మీ హర్’ అనే పేరుతో రూపొందిన ఒక షో దగ్గర నేను ఆగిపోయాను. ఈ షో ఒక చిన్న పట్టణంలోని వివాహమైన జంట తమ రిలేషన్‌షిప్‌లోకి మూడో వ్యక్తిని ఆహ్వానిస్తారు.
దీనిలో పూర్తిగా క్వీర్ కథాంశాలు(ఒకటి కంటే ఎక్కువ జెండర్స్‌కి ఆకర్షితులయ్యేవారు), బై క్యారెక్టర్స్ ఉన్నాయి. దీన్ని టీవీల ‘తొలి పాలీరొమాంటిక్ కామెడీ’గా వర్ణిస్తారు.
కేవలం నెట్‌ఫ్లిక్స్‌పైనే కాదు. పలు ప్లాట్‌ఫామ్‌లపై ఇలాంటి రికమండేషన్లను నేను చూశాను.
‘సాఫిక్’ అనే ప్లేలిస్ట్‌ను స్పాటిఫై నాకు రికమండ్ చేసింది. ఎవరైతే మహిళలు, మహిళలను ఇష్టపడతారో వారికి సాఫిక్ అనే పదాన్ని వాడతారు.
కొన్ని నెలల తర్వాత టిక్‌టాక్‌పై బైసెక్సువల్ క్రియేటర్లకు చెందిన వీడియోలు నా ఫీడ్‌లో కనిపించడం ప్రారంభమైంది.
ఆ తర్వాత కొన్ని నెలలకి, నేను బైసెక్సువల్‌గా నాకు తెలిసింది.
నాకు నేను గుర్తించని ఈ విషయాన్ని టెక్ ప్లాట్‌ఫామ్‌లు ఎలా గుర్తించాయి? అవి ఏ సంకేతాల ద్వారా నేను బైసెక్సువల్ అని తెలుసుకున్నాయి?

ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కి 22.2 కోట్ల మంది యూజర్లున్నారు.
వేలాది సినిమాలు, సిరీస్‌లు ఈ యూజర్లు చూసేందుకు అందుబాటులో ఉన్నాయి.
కానీ, ఒక వ్యక్తి నెలలో సగటున ఆరు రకాల కథాంశాలను మాత్రమే చూస్తున్నారు.
ప్రజల చూడాలనుకుంటోన్న కంటెంట్‌ను చూపించేందుకు, నెట్‌ఫ్లిక్స్‌కు అత్యంత శక్తిమంతమైన రికమండేషన్ సిస్టమ్ ఉంది.
ఈ నెట్‌వర్క్ ఆల్గారిథంలు ఏ వీడియోలు, ఇమేజీలు, ట్రైలర్స్ యూజర్ల హోమ్ పేజీపై కనిపించాలో నిర్ణయిస్తుంది.
ఉదాహరణకు, ‘యూ మీ హర్’ అనేది '100010' కోడ్‌తో లేదా ‘ఎల్‌జీబీటీక్యూ ప్లస్ స్టోరీల’ ట్యాగ్‌తో నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు కనిపిస్తూ ఉంటోంది.
ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడే యూజర్లను తమ కంటెంట్‌తో కట్టిపడేసేలా ఈ రికమండర్ సిస్టమ్ పనిచేస్తోంది.
ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ రెండు వైపుల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. దానికి సంబంధించిన అంశాలను గుర్తిస్తోంది.
ఎలాంటి పాటలు, ఎలాంటి సినిమాలు చూస్తున్నారు, ఆ టీవీ షోలలో నటించే నటించే వారెవరు? వంటి అంశాల ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ ఆల్గారిథం అంచనావేస్తోంది.
‘‘బిగ్ డేటా అనేది దీని అతిపెద్ద వనరు’’ అని ఫ్యూచర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వెబ్‌సైట్‌కి పంపిన వీడియోలో నెట్‌ఫ్లిక్స్ మాజీ ఎగ్జిక్యూటివ్ టోడ్ యెల్లిన్ అన్నారు.
మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్‌తో, ముఖ్యమైన ట్యాగ్‌లు ఏమిటి అనే అంశాలను గుర్తించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
యూజర్ల గురించి ఈ ప్లాట్‌ఫామ్‌లకు ఏం తెలుసు?
బ్రిటన్ డేటా గోప్యత చట్టాల కింద, సంస్థ వద్దకు యూజర్లకు చెందిన ఏ డేటా ఉండాలనే విషయంపై యూజర్లకు పూర్తి హక్కులున్నాయి.
యూజర్లకు చెందిన ఈ సమాచారాన్ని పొందేందుకు చాలా సోషల్ మీడియా కంపెనీలు, స్ట్రీమింగ్ కంపెనీలు ఆటోమేటెడ్ సిస్టమ్‌ను క్రియేట్ చేశాయి.
ఎనిమిది అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌ల నుంచి నేను నా సమాచారాన్ని డౌన్‌లోడ్ చేశాను.
లాంగ్వేజ్ లెర్నింగ్ టూల్, హోటళ్లు వంటి నేను చూసే ఇతర వెబ్‌సైట్‌లకి చెందిన డేటాను ఫేస్‌బుక్ ట్రాక్ చేస్తోంది.
‘లొకేషన్’ పేరుతో ఉండే ఫోల్డర్‌లో నా ఇంటి అడ్రస్‌తో ఇది కోఆర్డినేట్ అవుతోంది.
నాకు ఆసక్తి ఉన్నట్లు భావించిన 300 రకాల అంశాలను ఇన్‌స్టాగ్రామ్ లిస్ట్ చేసింది.
ఈ డేటాను ఇన్‌స్టాగ్రామ్ పర్సనలైజ్డ్ వ్యాపార ప్రకటనల కోసం ఉపయోగిస్తోంది.
నేను ఎప్పుడు, ఏ డివైజ్ నుంచి ఏ ప్రొగ్రామ్, ట్రైలర్ చూశానో, దాని ప్రతి వివరాలను కూడా నెట్‌ఫ్లిక్స్ నాకు స్ప్రెడ్ షీటు రూపంలో పంపింది.
దీనిలో నేను ఆటో ప్లే చేసినవి లేదా ఎంపిక చేసుకుని చూసినవన్నీ ఉన్నాయి.
ఈ ప్లాట్‌ఫామ్‌లలో ఏదీ కూడా నా లైంగికతను ట్యాగ్ చేసిన ఆధారాలు దొరకలేదు.
‘‘యూజర్ల ఎలాంటి డేటాను స్పాటిఫై సేకరించాలనే విషయాన్ని మా ప్రైవసీ పాలసీ నిర్ణయిస్తుంది. దీనిలో లైంగికత గురించి లేదు. యూజర్లు వినే ఆధారంగా మా ఆల్గారిథంలు వారి లైంగికత గురించి ఎలాంటి అంచనావేయవు’’ అని బీబీసీకి పంపిప ప్రకటనలో స్పాటిఫై తెలిపింది.
ఇతర ప్లాట్‌ఫామ్‌లకు కూడా ఇదే మాదిరి విధానాలున్నాయి.
వయసు లేదా జెండర్ కాకుండా యూజర్లు యాప్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, దేన్నీ ఎక్కువగా చూస్తున్నారు అనే అంశాల ఆధారంగా యూజర్ అభిరుచులను తెలుపుతున్నాయని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.

ఏం చూస్తారు, ఏం చూడాలనుకోవడం లేదు
‘‘ఎవరూ కూడా కావాలని నెట్‌ఫ్లిక్స్‌కి మేం గే అని చెప్పుకోరు’’ అని కంప్యూటేషనల్ సోషల్ సైకాలజీలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్పెషలైజేషన్ చేస్తోన్న పీహెచ్‌డీ విద్యార్థి గ్రెజ్ సెరాపియో-గ్రేసియా అన్నారు.
కానీ, ఈ ప్లాట్‌ఫామ్ ‘‘క్వీర్ కంటెంట్’ను ఇష్టపడే యూజర్లను చూస్తుందన్నారు.
అంతకుముందు యూజర్లు LGBT+ ట్యాగ్ చేసిన కంటెంట్‌ను చూడకపోయినా ఈ రికమండేషన్లను పొందుతున్నారు.
నెట్‌ఫ్లిక్స్ రికమండెర్ సిస్టమ్ దీని కంటే లోతుగా వెళ్లి యూజర్లను విశ్లేషిస్తుంది.
ప్రత్యేకంగా LGBTQ+ ట్యాగ్ చేయకపోయినా మీరు చూసే కానీ కొన్ని నిర్దిష్టమైన టీవీ షోలు, సినిమాల ద్వారా.. మీరు క్వీర్ కంటెంట్‌ను ఇష్టపడుతున్నారని తెలుసుకునేందుకు ఆల్గారిథానికి అవకాశం ఉంటుందని గ్రెజ్ అన్నారు.
ఇతర వివరాలు కూడా యూజర్‌ను అంచనావేసేందుకు వాడుతుండొచ్చు.
ఉదాహరణకు, యూజర్లు నిరంతరం నెట్‌ఫ్లిక్స్‌పై ఎంత సమయం వెచ్చిస్తున్నారో కూడా చూస్తుంది.
నెట్‌ఫ్లిక్స్ ఆల్గారిథం నేను ముందు చూసిన సినిమాలు, స్టోరీల ఆధారంగా LGBT+ కథాంశాలపై నాకున్న ఆసక్తిని అంచనా వేయడమే కాదు, ఎప్పుడు నేను దీనిపై క్లిక్ చేశాను, ఏ డివైజ్‌పై ఎప్పుడు, ఎలా చూశాను అనే అంశాలను కూడా గ్రహించింది.
ఇది ఉత్సుకత కలిగించే అంశమే. కానీ, హోమోసెక్సువాలిటీపై నిషేధం, చట్టవిరుద్ధమైన దేశాల్లో ప్రజలను ప్రమాదంలో పడేసే అవకాశముందని గ్రెజ్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా LGBT+ కమ్యూనిటీకి చెందిన ప్రజల నుంచి నేను బాధాకరమైన మెసేజ్‌లను విన్నాను. ఇదే సమయంలో, స్ట్రీమింగ్ సైట్లు రికమెండ్ చేస్తోన్న వాటిని వారు ప్రేమిస్తున్నట్లు కూడా కొందరు చెప్పారు.
కానీ, మరోవైపు వారు ఆందోళన కూడా చెందుతున్నారు.
‘‘నా గోప్యతకు ఇది భంగపాటు అని నేను భావిస్తున్నాను’’ అని ఒక గే వ్యక్తి నాకు చెప్పారు. తన భద్రత కారణంగా ఆయనెవరన్నది చెప్పడం లేదు.
‘‘ఇది మీ జీవితం ఏమిటనే దానిపై మరింత నాలెడ్జ్‌ను అందిస్తుంది. అలా తెలుసుకోవడం బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ, ఇంకో విధంగా చూస్తే ఆల్గారిథంలు నిజంగా నన్ను భయపెడుతున్నాయి’’ అని ఆ వ్యక్తి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- డాక్టర్‌కే మా బంధం అర్ధం కాలేదు, సామాన్యులకు ఎలా తెలుస్తుంది?: కేరళ యువతుల ఆవేదన
- లెస్బియన్ జంట: ఒక హిందూ అమ్మాయి, ఒక ముస్లిం అమ్మాయి... వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది?
- లింగమార్పిడి: ఆడవాళ్ళను, మగవాళ్ళుగా... మగవాళ్ళను ఆడవాళ్ళుగా ఎలా మార్చేస్తారు?
- లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్...ఈ పదాల మధ్య తేడా ఏంటి?
- కిటో: స్వలింగ సంపర్కులను ఆకర్షించి బ్లాక్మెయిల్ చేస్తున్న నైజీరియా మాఫియా గ్యాంగ్‌లు














