సెక్స్ టేప్: ఇరాన్ అధికారి స్వలింగ సంపర్కం వీడియో వైరల్... దోషిగా తేలితే ఏ శిక్ష పడుతుంది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సెబాస్టియన్ ఉషర్, అలిస్ డేవీస్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఒక సెక్స్ టేప్ ఇరాన్‌లో ఇస్లామిక్ విలువలను ప్రోత్సహించే బాధ్యతల్లో ఉన్న అధికారి సస్పెన్షన్‌కు దారితీసింది.
గిలాన్ ప్రావిన్స్‌లో కల్చర్ అండ్ ఇస్లామిక్ గైడెన్స్ హెడ్‌గా ఉన్న రెజా త్సగాటి, మరో వ్యక్తితో సెక్స్‌లో పాల్గొన్నట్లుగా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
అయితే, ఆ వీడియో నిజమైనదేనా, అందులో ఎవరెవరు ఉన్నారనే విషయాలను ఇంకా నిర్ధరించలేదు.
అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న త్సగాటిని బాధ్యతల నుంచి తప్పించారు.
ఇరాన్‌లో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం. అక్కడ ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు వేధింపులకు, హింసకు గురయ్యే అవకాశం ఉంది. ఎల్జీబీటీ కమ్యూనిటీ రోజూ వివక్షను ఎదుర్కొంటోంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
త్సగాటి, హిజాబ్ ధారణ, ప్రార్థనలకు సంబంధించిన సాంస్కృతిక కేంద్రం వ్యవస్థాపకుడు కూడా.
ఆయనపై ఇప్పుడు వచ్చిన ఆరోపణల గురించి తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో త్సగాటిపై ఎలాంటి ఫిర్యాదులు లేవని ఇరాన్ సాంస్కృతిక మంత్రి మొహమ్మద్ మెహ్దీ ఇస్మాయిల్ శనివారం అన్నారు.
ఎల్టీబీటీ వ్యక్తులు లేదా ఇస్లామిక్ నియమాలను పాటించని మహిళలపై నేరారోపణలు వచ్చినప్పుడు ఇరాన్ అధికారులు ఎలా స్పందిస్తారో, అధికారులపై నేరారోపణలు వస్తే ఏం చేస్తారో తేడా స్పష్టంగా తెలుస్తోందని మరికొందరు అంటున్నారు.
త్సగాటిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
షరియాను అనుసరించే ఇరాన్ చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం నేరం. అందుకు మరణ శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. అయితే, ఇలాంటి శిక్షలు చాలా అరుదు.

ఫొటో సోర్స్, EPA
హిజాబ్ ధరించనందుకు మహిళలను కూడా కఠినంగా శిక్షించారు. 2022 సెప్టెంబర్‌లో 22 ఏళ్ల మహసా అమీనీ మరణం తర్వాత హిజాబ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి.
హిజాబ్ సరిగ్గా ధరించలేదని, నిబంధనలు ఉల్లంఘించారని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అరెస్టు చేసిన మూడు రోజుల తర్వాత అమీనీ చనిపోయారు.
అయితే, త్సగాటి విషయంలో సెక్స్ టేప్ బయటకు వచ్చిన కొద్దిరోజుల వరకూ ఇరాన్ అధికారులు స్పందించలేదు.
చివరికి జులై 22న గిలాన్ ఇస్లామిక్ గైడెన్స్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. గిలాన్ ఇస్లామిక్ గైడెన్స్ డైరెక్టర్ తప్పు చేసినట్లు అనుమానిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఆ తర్వాత ఈ కేసును పరిశీలించాలని న్యాయ శాఖ అధికారులకు పంపించారు. ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న ఆ వీడియో వ్యాప్తిపై హెచ్చరికలు చేశారు.
తొలుత ఈ వీడియోను రేడియో గిలాన్ టెలిగ్రామ్ చానల్ అప్‌లోడ్ చేసింది.
''అధికారుల అవినీతి బాగోతాలను చానల్ బయటపెడుతూనే ఉంటుంది'' అని చీఫ్ ఎడిటర్ పెయ్‌మన్ బెహ్‌బౌది అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్: హిజాబ్ ధరించని మహిళలను పట్టుకునేందుకు 'స్మార్ట్' ప్రోగ్రామ్
- ‘మీరు నా కంట్లోనే కాల్చారు, నా గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది..’
- మనుషులకు దూరంగా అడవిలో బతకాలనుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు.. కుళ్లిపోయిన స్థితిలో అక్కాచెల్లెళ్లు, అబ్బాయి శవాలు
- మర్డర్ మిస్టరీ: ఆ 11 మంది నన్‌లు ఎలా చనిపోయారు?
- టెక్ ఇండస్ట్రీలో పనిచేయాలంటే డిగ్రీ తప్పనిసరిగా ఉండాలా?














