ముంబయి నుంచి అమెరికా వరకు.. ‘2023’ కీలక పరిణామాలు 15 ఫోటోల్లో!

ముంబయి నుంచి అమెరికా వరకు, గాజా నుంచి యుక్రెయిన్ వరకు, బ్రిటన్ నుంచి అఫ్గానిస్తాన్ వరకు 2023లో ప్రపంచంలో జరిగిన వివిధ కీలక పరిణామాలను ఈ ఫోటోల్లో చూడండి.

2023 చిత్రాలు

ఫొటో సోర్స్, CLAUDIA MORALES/REUTERS

ఫొటో క్యాప్షన్, దక్షిణ అమెరికాలోని బొలీవియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పాఠ్యప్రణాళికను నిరసిస్తూ బొలీవియాలోని లాపాజ్‌లో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగినప్పుడు పోలీసులు రెడ్ పెయింట్ వేసిన షీల్డ్‌లను అడ్డుపెట్టుకుని కాపలా కాస్తున్న దృశ్యమిది.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, MOHAMMED SALEM/REUTERS

ఫొటో క్యాప్షన్, గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తన ఐదేళ్ళ మేనకోడలు శాలీ మృతదేహాన్ని పట్టుకుని రోదిస్తున్న పాలస్తీనా మహిళ.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, DIVYAKANT SOLANKI/EPA

ఫొటో క్యాప్షన్, 2023 మార్చిలో ముంబయిలోని అప్పాపడ మురికివాడలో మంటలు చెలరేగి వెయ్యికిపైగా ఇళ్ళు తగలబడ్డాయి.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, YOAN VALAT/EPA

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లో ఉద్యోగ విరమణ వయసును 62 నుంచి 64 ఏళ్ళకు పెంచడాన్ని నిరసిస్తూ పది లక్షలమందికిపైగా ప్రజలు నిరసనకు దిగారు. 80 వేల మంది ఆందోళనకారులతో పారిస్ వీధులు నిండిపోయాయి. దాదాపు 200కు పైగా ఫ్రెంచ్ నగరాల్లో ఆందోళనలు సాగాయి. ఆందోళనల వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతాదళాలు బయల్దేరినప్పటి ఫోటో ఇది. 2023 జనవరిలో ఈ ఆందోళనలు జరిగాయి.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, VIOLETA SANTOS MOURA/REUTERS

ఫొటో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో సొంత ఇంటిని ఖాళీ చేసి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడటం లేదో 71 ఏళ్ళ లియుబోవ్ వాసిలివ్నా అనే బామ్మ చెబుతున్నారు. ఈమె యుక్రెయిన్‌లోని తూర్పు డోనెట్స్క్ ప్రాంతంలోని అవ్దివ్కా సమీపంలోని సెమెనివ్కా గ్రామానికి చెందినవారు. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి జెనీవా ఒప్పంద ఉల్లంఘన జరుగుతోందంటూ రష్యా, యుక్రెయిన్ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, AMANDA PEROBELLI/REUTERS

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్‌లోని సౌపౌలో తీర ప్రాంతంలో భారీ వర్షపాతం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 40 మందికి పైగా మరణించారు.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, JEFF KRAVITZ/FILMMAGIC/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మిచెల్ యోహ్, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలో నటనకు గాను ఆస్కార్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న మొదటి ఆసియా మహిళ. 2023 ఆస్కార్ అవార్డుల్లో ఏడు అవార్డులను ఈ సినిమా గెలుచుకుంది.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, CHRIS MCGRATH/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఆగ్నేయ తుర్కియాలో సిరియా సరిహద్దు వద్ద సంభవించిన పెను భూకంపానికి ఆకాశహర్మ్యాలన్నీ నేలకూలాయి. వేల మంది ప్రజలు చనిపోయారు. కుప్పకూలిన భవనాల శిథిలాల మధ్య ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళ.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, CHANDAN KHANNA/AFP

ఫొటో క్యాప్షన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో తన మర్-ఎ లాగో ఎస్టేట్‌లో మీడియా సమావేశం అయిపోయాక తిరిగి వెళ్తున్న దృశ్యమిది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌‌తో గతంలో తనకున్న సంబంధం గురించి 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో నోరు విప్పకుండా ఉండేందుకు ఆమెకు ట్రంప్ చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కోర్టుకు హాజరైన తరువాత ట్రంప్ మీడియాతో మాట్లాడి తిరిగి వెళుతున్నప్పటి ఫోటో ఇది.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, P VAN KATWIJK/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది మేలో కింగ్ చార్లెస్ తన పట్టాభిషేకం వేళ రాణి కామెలాతో కలిసి లండన్‌లోని బకింగ్‌హామ్ పాలెస్‌ బాల్కనీలో ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, SHANNON STAPLETON/REUTERS

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ నగరం క్వీన్స్‌లోని దృశ్యమిది. కెనడాలోని కార్చిచ్చు మన్‌హట్టన్ గగనతలాన్ని కప్పివేసినప్పుడు, నదిపై రూజ్‌వెల్ట్ ట్రామ్ అలా సాగిపోతుండగా.. ప్రజలు మాస్క్‌లు ధరించి కనిపిస్తున్నప్పటి చిత్రమిది.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, CARLOS OSORIO/REUTERS

ఫొటో క్యాప్షన్, ఎల్‌జిబీటీక్యూ హక్కులపై కెనడాలోని టొరంటో, అంటారియోలో జరిగిన ప్రదర్శనకు మద్దతు తెలుపుతున్న ప్రజలు
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, JAFAR MOSAVI/AFP

ఫొటో క్యాప్షన్, అఫ్గనిస్తాన్‌లో పెను భూకంపం విలయానికి నిలువెత్తు సాక్ష్యమిది. రెండు రోజుల వ్యవధిలో పశ్చిమ అఫ్గాన్ ప్రాంతాన్ని కుదిపేసిన భూకంపా్ని విధ్వంసాల్లోకెల్లా విధ్వంసంగా ఐక్యరాజ్యసమితి వర్ణించింది.
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, AMIR COHEN/REUTERS

ఫొటో క్యాప్షన్, గాజా స్ట్రిప్ నుంచి వచ్చిపడుతున్న రాకెట్లను అడ్డుకుంటున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్
2023 చిత్రాలు

ఫొటో సోర్స్, BORJA SUAREZ/REUTERS

ఫొటో క్యాప్షన్, స్పెయిన్‌లోని దక్షిణ గ్రాన్ కెనారియాలోని ఓ పర్వతంపైన గుర్రం మీద కూర్చుని బ్లూమూన్‌గా చెప్పే సూపర్‌మూన్ ను తిలకిస్తున్న జోనే రావెలో. ఆగస్టు 31న ఈ సూపర్ మూన్ సంభవించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)