'సైకిల్‌పై వెళ్లి చంద్రుడిపై దిగాం'.. చంద్రయాన్-3 విజయంపై నెటిజన్ల హర్షాతిరేకాలు

చంద్రయాన్ 3 పై కామెంట్స్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, భారత అంతరిక్ష కార్యక్రమం తొలినాళ్లలో సైకిల్‌పై రాకెట్ భాగాలను తరలించిన రోజులను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యూజర్లు గుర్తు చేసుకున్నారు.

చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్-3ని దించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువంలో విజయవంతంగా అడుగిడిన తొలి దేశంగా భారత్‌కు కీర్తిని తెచ్చి పెట్టింది.

చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో, ఇక దానిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ బయటకు రానుంది. అనంతరం సమాచారాన్ని సేకరించడానికి చంద్రుని ఉపరితలంపై తిరుగుతుంది ఈ రోవర్.

చంద్రుడిపై విక్రమ్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. అనంతరం ఇస్రో, చంద్రయాన్-3 మిషన్‌ బృందానికి అభినందనలు తెలిపారు.

చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్రమోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెబుతూ, అభినందించారు.

చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ 3 సురక్షితంగా ల్యాండ్ అవ్వడం చరిత్రాత్మక విజయమని భారత్‌లో రష్యా రాయబారి ట్విటర్‌లో అభినందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ల్యాండర్ చంద్రుడిపై దిగుతున్న దృశ్యాలను కోట్ల మంది భారతీయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

భారత అంతరిక్ష కార్యక్రమం తొలినాళ్లలో సైకిల్‌పై రాకెట్ భాగాలను తరలించిన రోజులను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యూజర్లు గుర్తు చేసుకున్నారు.

సోషల్ మీడియాలో చిత్రం

ఫొటో సోర్స్, twitter

'సైకిల్ సే చాంద్ తక్ సఫర్'

ఓ నెటిజన్ చంద్రయాన్-3 విజయంపై ట్విటర్‌లో తన సంతోషాన్ని పంచుకుంటూ 'సైకిల్ సే చాంద్ తక్ సఫర్' అని తెలిపారు.

మరికొంత మంది నెటిజన్లు చంద్రయాన్-2 ప్రయోగాన్ని స్మరించుకున్నారు. ఓటమి గెలుపుకు పునాది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

మరొక యూజర్ 'అంతరిక్ష యాత్ర చరిత్రలో గొప్ప పునరాగమనం' అని రాశారు. ఈ సందర్భంగా చాలా మంది అప్పటి ఇస్రో చైర్మన్ కె. శివన్‌ను గుర్తుచేసుకున్నారు.

ఇస్రోపై కామెంట్స్

ఫొటో సోర్స్, twitter

చంద్రయాన్ 3

ఫొటో సోర్స్, TWitter

ఎలా ఎదగాలో నేర్పినందుకు ధన్యవాదాలు: ఆనంద్ మహీంద్రా

వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చంద్రయాన్-3 విజయంపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తంచేశారు.

''ఇస్రోకు ధన్యవాదాలు. నక్షత్రాలను ఎలా లక్ష్యంగా చేసుకోవాలో మాకు నేర్పుతున్నందుకు, మా సామర్థ్యాలపై మాకు నమ్మకం కలిగించినందుకు, వైఫల్యాన్ని ఎలా ఎదుర్కోవాలి, మళ్లీ ఎదగడానికి దాన్ని వేదికగా ఎలా ఉపయోగించాలో మాకు చేసి చూపినందుకు ఇస్రోకు ధన్యవాదాలు. అన్నింటికంటే భారతీయులమైనందుకు మాకు ఇది గర్వకారణం'' అని ఆయన ట్విటర్‌లో తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఇస్రోకు నాసా అభినందనలు

చంద్రయాన్-3 విజయంపై నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సైతం ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపాయి.

''చంద్రుడి దక్షిణ ధ్రువంలో చంద్రయాన్-3ని దింపినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు. అలాగే చంద్రుడిపై అంతరిక్ష నౌకను సురక్షితంగా దింపిన నాలుగో దేశంగా నిలిచినందుకు భారత్‌కు కూడా శుభాకాంక్షలు. మేం ఈ ప్రయోగంలో భాగమైనందుకు సంతోషిస్తున్నాం'' అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెస్లన్ తెలిపారు.

"అద్భుతం. ఇస్రో, యావత్ భారతదేశానికి అభినందనలు. కొత్త సాంకేతికతను ఉపయోగించి చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ చేయడం ఎంతో గొప్పది. ఇది నన్ను చాలా ఆకట్టుకుంది." అని ఈఎస్ఏ డైరెక్టర్ జనరల్ జోసెఫ్ ఎస్చ్‌బాచెర్ తెలిపారు.

ఈ ప్రక్రియలో సాయం చేసినందుకు ఈఎస్ఏ ఆపరేషన్స్‌ను ఆయన అభినందించారు. తాము కూడా గొప్ప పాఠాలు నేర్చుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

రాజకీయ పార్టీల శుభాకాంక్షలు

చంద్రయాన్ 3 విజయం పట్ల పలు రాజకీయ పార్టీలు ఇస్రోకు అభినందనలు తెలిపాయి. భారత్ గర్వంగా చంద్రుడిపై నిలిచిందంటూ ఇస్రోకు బీజేపీ శుభాకాంక్షలు తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

నెహ్రూ పునాది: కాంగ్రెస్

చంద్రయాన్ -3 విజయంపై కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలిపింది.

''చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ఇస్రోతో సహా దేశప్రజలందరికీ అభినందనలు.

భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలు అవసరమని భావించి పండిట్ నెహ్రూ ఇస్రోకు పునాది వేశారు.

ఆయన దూరదృష్టి ఫలితమే నేడు భారతదేశం మొత్తం ప్రపంచంలోనే అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది'' అని ట్విటర్‌లో తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.

''చంద్రయాన్-3కి శుభాకాంక్షలు! దాని అద్భుతమైన విజయానికి అభినందనలు!! దేశం శాస్త్ర సాంకేతిక పురోగతిని మన శాస్త్రవేత్తలు నిరూపించారు. సాహసయాత్రలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ క్షణాన్ని జరుపుకుందాం, విజ్ఞానంలో భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థిద్దాం'' అని ఆమె ట్విటర్‌లో తెలిపారు.

సినీ ప్రముఖులు కూడా ఇస్రోకు అభినందనలు తెలిపారు. షారుక్ ఖాన్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్‌లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

కేసీఆర్, జగన్ ప్రశంసలు

చంద్రయాన్ విజయం సాధించడంతో శాస్త్రవేత్తలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ప్రశంసించారు.

'సేఫ్ లాండింగ్' అనే చివరి ఘట్టాన్ని కూడా పూర్తిచేసి చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలకు, సిబ్బందికి, ఈ ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన వారికి కేసీఆర్ అభినందనలు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 7

విజయవంతమైన ఈ చంద్రయాన్-3 ప్రయోగం ఆంధ్రప్రదేశ్ నుంచే జరగడం ప్రత్యేకమైనదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

''భారత్‌కు అపురూపమైన విజయం! చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు, నేను, భారతదేశంలోని ప్రతి పౌరుడు గర్వంతో ఉన్నాం. అందరికీ నా శుభాకాంక్షలు, ఇస్రోకు అభినందనలు. ఈ ఘనత మన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి సాధ్యమైంది. ఇది మరింత ప్రత్యేకమైనది!'' అని ట్విటర్‌లో తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 8

చంద్రుడికి భూమి రాఖీ కడుతున్న ఫోటోను నటి కాజల్ అగర్వాల్ షేర్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 9

చరిత్ర సృష్టించాం: బీసీసీఐ

భారత క్రికెట్ జట్టు సభ్యులు విక్రమ్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్న ఫోటోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. ''చరిత్ర సృష్టించాం, మిషన్ విజయవంతమైంది. శుభాకాంక్షలు'' అని తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 10

చంద్రయాన్-3 విజయంపై పాకిస్తాన్‌లోనూ హర్షం

చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్‌లోనూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రయాన్ 1, చంద్రయాన్2, మూడోసారి చంద్రయాన్3 ఇలా పట్టువదలకుండా ట్రై చేస్తూనే ఉన్నారని, భారతీయులు దాన్ని వదిలెయ్యలేదని పాకిస్తాన్ మహిళ ఒకరు అన్నారు.

''ఏదైనా పాజిటివ్‌గా జరిగితే దాన్ని పాజిటివ్‌గానే తీస్కోవాలి. నేను ద్వేషించినంత మాత్రాన అది అక్కడితో ఆగిపోదు, మారిపోదు. నేను దీన్ని పాజిటివ్‌గా తీసుకుంటున్నాను. వాళ్లు దాన్ని సాధించడం మంచి విషయం'' అని మరో మహిళ తెలిపారు.

వీడియో క్యాప్షన్, చంద్రయాన్-3 విజయంపై భారత్‌కు ప్రపంచదేశాల అభినందనలు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)