2023లో ఎక్కువ మంది సర్చ్ చేసిన వంటకం ఏది? గూగుల్ చరిత్రలో అత్యధికులు వెతికిన క్రికెటర్ ఎవరు?

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

2023 త్వరలో ముగియబోతోంది. ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది వేటి గురించి సర్చ్ చేశారో తెలుసా? ఏ వంటకం గురించి వెతికారో ఊహించగలరా? గూగుల్ సర్చ్ ఇంజిన్‌ 25 ఏళ్ల చరిత్రలో అత్యధికులు వెతికిన క్రికెటర్ ఎవరో చెప్పగలరా?

ఇన్నేళ్ల కాలంలో ఎక్కువ మంది ఏ సినిమా జోనర్ గురించి వెతికారు? ఏ క్రీడ గురించి శోధించారో తెలుపుతూ గూగుల్ మంగళవారం ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.

అందులో విరాట్ కోహ్లీ అత్యధిక మంది వెతికిన క్రికెటర్‌గా నిలిచాడు.

గూగుల్ సర్చ్ ఇంజిన్‌కు ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో తమ సర్చ్ ఇంజిన్‌లో అత్యధికంగా వెదికిన అంశాలతో గూగుల్ ఆ వీడియోను రూపొందించింది.

క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, అథ్లెట్లలో ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో, అత్యధిక మంది వెతికిన మొదటి అడుగుగా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు మోపడం, మోస్ట్ సర్చ్‌డ్ యానిమేషన్ సిరీస్ పోకిమాన్, భారతీయ సినిమాలో బాలీవుడ్, ఐస్ బకెట్ చాలెంజ్, ఎల్జీబీటీక్యూ వివాహాలు, కోవిడ్ మరణాలు తదితర అంశాలు ఈ వీడియోలో చోటు దక్కించుకున్నాయి.

‘’25 ఏళ్ల క్రితం ఈ ప్రపంచం వెతకడం మొదలుపెట్టింది. ఇక మిగిలినదంతా చరిత్రే’’ అంటూ వీడియో ప్రారంభం అవుతుంది.

వీడియో క్యాప్షన్, విరాట్ కోహ్లీ: గూగుల్ 25 ఏళ్ల చరిత్రలో అత్యధికులు వెతికిన క్రికెటర్

2023లో అత్యధికులు వెతికిన రెసపీ ఇదే

గడిచిన 25 ఏళ్లలో ఎక్కువగా వెతికిన అంశాలతో పాటు 2023 ఏడాదిలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన అంశాల జాబితాను కూడా గూగుల్ విడుదల చేసింది.

ఈ ఏడాది ఎక్కువ మంది వెతికిన వంటకం తయారీ విధానం (రెసపీ) ఏంటో చెప్పగలరా? ఈ జాబితాలో మామిడికాయ పచ్చడి తయారీ అగ్రస్థానాన నిలిచింది.

2023లో భారతీయులు ఆసక్తిగా వెతికిన అంశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయిన విషయాల జాబితాను ‘‘ఇయర్ ఇన్ సర్చ్ -2023’’ పేరిట పబ్లిష్ చేసింది.

వార్తలు, వినోదం, మీమ్స్, పర్యటకం, వంటలతో పాటు పలు కేటగిరీల్లో అత్యధికంగా వెతికిన అంశాలను ‘‘ఇయర్ ఇన్ సర్చ్ -2023’’ జాబితాలో గూగుల్ వెల్లడించింది.

భారత్‌లో చంద్రయాన్-3, కర్ణాటక ఎన్నికల ఫలితాలతోపాటు జీ20, యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) వంటి అంశాలపై ప్రజలు ఎక్కువ దృష్టి సారించినట్లు ఈ డేటా ప్రకారం తెలుస్తోంది.

‘సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్’ అంటూ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న మీమ్ కూడా టాప్-5 మీమ్స్‌లో చోటు దక్కించుకుంది.

సినిమాల్లో ఆదిపురుష్, వెబ్ సిరీస్‌లలో రానా నాయుడు కూడా బాగా వెతికినవాటి జాబితాలో నిలిచాయి. కేటగిరీల వారీగా ఇక్కడ చూద్దాం.

చంద్రయాన్

ఫొటో సోర్స్, ANI

భారత్‌లో అత్యధికంగా వెతికిన ఈవెంట్లు

  • చంద్రయాన్ 3
  • కర్ణాటక ఎన్నికల ఫలితాల
  • ఇజ్రాయెల్ న్యూస్
  • సతీశ్ కౌశిక్
  • బడ్జెట్ 2023
  • తుర్కియే భూకంపం
  • అతీక్ అహ్మద్
  • మ్యాథ్యూ పెర్రీ
  • మణిపుర్
  • ఒడిశా రైలు ప్రమాదం

జనరల్ నాలెడ్జికి సంబంధించి అడిగిన ప్రశ్నలు

  • జీ20 అంటే ఏంటి?
  • యూసీసీ అంటే ఏంటి?
  • చాట్ జీపీటీ అంటే ఏంటి?
  • హమాస్ ఎవరు?
  • 2023 సెప్టెంబర్ 28 ప్రత్యేకత ఏంటి?
  • చంద్రయాన్ 3 అంటే ఏంటి?
  • ఇన్‌స్ట్రాగ్రామ్‌లో థ్రెడ్స్ అంటే ఏంటి?
  • క్రికెట్‌లో టైమ్డ్ అవుట్ అంటే ఏంటి?
  • ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఏంటి?
  • సెనెగల్ అంటే ఏంటి?

వ్యక్తిగత ఆసక్తులు

  • జుట్టుకు, శరీరానికి ఎండవల్ల కలిగే నష్టాలను ఇంటి చిట్కాలతో ఎలా నివారించాలి?
  • యూట్యూబ్‌లో 5 వేల మంది సబ్‌స్క్రైబర్లను ఎలా సంపాదించాలి?
  • కబడ్డీలో ఎలా మెరుగవ్వాలి?
  • కార్ మైలేజీని ఎలా పెంచాలి?
  • చెస్ గ్రాండ్ మాస్టర్ ఎలా కావాలి?
  • రాఖీ పండగ రోజు సోదరిని ఎలా సర్‌ప్రైజ్ చేయాలి?
  • అసలైన కాంజీవరం సిల్క్ చీరను ఎలా గుర్తించాలి?
  • ఆధార్‌తో పాన్ లింక్ అయిందో లేదో ఎలా చూడాలి?
  • వాట్సాప్ చానల్ ఎలా రూపొందించాలి?
  • ఇన్‌స్ట్రాగ్రామ్‌లో బ్లూటిక్ ఎలా సంపాదించాలి?
రజినీకాంత్

ఫొటో సోర్స్, SUN PICTURES

మాకు దగ్గరలో ఏం ఉన్నాయి?

  • ఇంట్లోనే ఉండి చుట్టు పక్కల తమకు కావాల్సిన దుకాణాలు, విద్యాసంస్థలు, వినోద ప్రదేశాల గురించి కూడా వెదికారు.
  • దగ్గర్లో ఉన్న కోడింగ్ క్లాస్‌లు ఏవి?
  • దగ్గర్లో సంభవించిన భూకంపం
  • సమీపంలోని జూడియో షాపింగ్ మాల్
  • సమీపంలోని ఓనమ్ సాధ్య
  • మాకు సమీపంలో జైలర్ సినిమా నడిచే థియేటర్
  • సమీపంలోని బ్యూటీపార్లర్
  • సమీపంలోని జిమ్
  • సమీపంలోని రావణ్ దహన్ కార్యక్రమం
  • సమీపంలోని డెర్మటాలజిస్ట్
  • సమీపంలోని టిఫిన్ సర్వీస్ సెంటర్లు

స్పోర్ట్స్ ఈవెంట్లు

  • ఐపీఎల్
  • క్రికెట్ వరల్డ్ కప్
  • ఆసియా కప్
  • మహిళల ప్రీమియర్ లీగ్
  • ఆసియా క్రీడలు
  • ఐఎస్‌ఎల్
  • పాకిస్తాన్ సూపర్ లీగ్
  • యాషెస్ సిరీస్
  • మహిళల క్రికెట్ వరల్డ్ కప్
  • ఎస్‌ఏ20

ప్రజాదరణ పొందిన క్రికెట్ మ్యాచ్‌లు

  • భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
  • భారత్ వర్సెస్ న్యూజీలాండ్
  • భారత్ వర్సెస్ శ్రీలంక
  • భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • భారత్ వర్సెస్ ఐర్లాండ్
  • ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా
  • ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్
  • భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
  • గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
  • పాకిస్తాన్ వర్సెస్ న్యూజీలాండ్
జవాన్

ఫొటో సోర్స్, @VIJAYSETHUOFFL

ఎక్కువ మంది వెతికిన సినిమాల్లో ఆదిపురుష్, ద కేరళ స్టోరీ

సినిమాలు

  • జవాన్
  • గదర్ 2
  • ఓపెన్ హైమర్
  • ఆదిపురుష్
  • పఠాన్
  • ద కేరళ స్టోరీ
  • జైలర్
  • లియో
  • టైగర్ 3
  • వారిసు

వ్యక్తులు

  • కియారా అడ్వాణీ
  • శుభ్‌మన్ గిల్
  • రచిన్ రవీంద్ర
  • మొహమ్మద్ షమీ
  • ఎల్విష్ యాదవ్
  • సిద్ధార్థ్ మల్హోత్రా
  • గ్లెన్ మ్యాక్స్‌వెల్
  • డేవిడ్ బెక్‌హమ్
  • సూర్యకుమార్ యాదవ్
  • ట్రావిస్ హెడ్

వెబ్ సిరీస్‌లు

  • ఫర్జీ
  • వెడ్నస్‌డే
  • అసుర్
  • రానా నాయుడు
  • ద లాస్ట్ ఆఫ్ అజ్
  • స్కామ్ 2003
  • బిగ్‌బాస్ 17
  • గన్స్ అండ్ గులాబ్స్
  • సెక్స్/లైఫ్
  • తాజా ఖబర్
పర్యాటకం

ఫొటో సోర్స్, Getty Images

అత్యధికులు వెతికిన పర్యటక ప్రాంతాల్లో అండమాన్

మీమ్స్

  • భూపేంద్ర జోగి మీమ్
  • సో బ్యూటీఫుల్ సో ఎలిగెంట్ మీమ్
  • మోయో మోయో మీమ్
  • బైగన్ మీమ్
  • ఔకాత్ దికా దీ మీమ్
  • ఓహియో
  • ది బాయ్స్
  • ఎల్విష్ భాయ్ మీమ్
  • వఫల్ హౌజ్ న్యూ హోస్ట్ మీమ్
  • స్మర్ఫ్ క్యాట్ మీమ్

పర్యటక ప్రదేశాలు

  • వియత్నాం
  • గోవా
  • బాలీ
  • శ్రీలంక
  • థాయ్‌లాండ్
  • కశ్మీర్
  • కూర్గ్
  • అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్
  • ఇటలీ
  • స్విట్జర్లాండ్

గ్లోబల్ స్థాయిలో ఇజ్రాయెల్- గాజా యుద్ధం, మ్యాథ్యూ పెర్రీ, బార్బీ సినిమా, షకీరా, గూగుల్ టూల్స్‌లో ట్రాన్స్‌లేట్‌ను ఎక్కువగా ప్రజలు వెతికినట్లు గూగుల్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)