మగవాళ్లు నగ్నంగా పడుకుంటే ఫోటోలు తీస్తున్న మహిళ.. ఇదేం ఫోటో షూట్?

- రచయిత, అన్నా బ్రెస్సానిన్, ఎలినోర్ వాయిసార్డ్
- హోదా, బీబీసీ రీల్స్
ఒక చిన్న గదిలో ఆరుగురు మగవాళ్లు నగ్నంగా పడుకున్నారు. వారిపై ఒకరు గులాబీ రేకులను చల్లుతున్నారు. ఒక మహిళ కెమెరాలో ఆ పురుషులను చూస్తూ వారి 'భంగిమలలో' కొన్ని మార్పులు సూచిస్తున్నారు.
'శృంగార' ఫోటో షూట్ అది.
కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది.
పురుషులు నగ్నంగా ఉన్నారు. డ్రెస్ వేసుకొని ఉన్న స్త్రీ వారిని ఫోటో తీస్తున్నారు.
ఆ ఫోటోగ్రాఫర్ పేరు యుషి లీ. ఆమె చైనాలో పుట్టారు. ఇప్పుడు లండన్‌లో నివసిస్తున్నారు.
ఫొటోగ్రఫీ కళలోనూ, లైంగిక ఆకర్షణ కళలోనూ మార్పు తీసుకురావాలని తాను భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.

లైంగిక ఆకర్షణే ప్రధానం
తన ఫోటో షూట్ లింగం, సెక్సువల్ ఎట్రాక్షన్, లైంగిక కోరికల చుట్టూ తిరుగుతుందని యుషి లీ చెప్పారు.
తన ఛాయాచిత్రాలు పురుషుల శరీరాన్ని 'లైంగిక ఆకర్షణ'కు కేంద్రంగా ఉపయోగిస్తాయని లీ తెలిపారు.
''మహిళలు అందంగా ఉండాలని సమాజం చాలా కాలంగా చెబుతోంది. కాబట్టి ఇప్పటికీ స్త్రీల శరీరాలు అందంగా ఉంటాయని భావిస్తున్నాం. అందుకే మనం మగవారి శరీరం కంటే స్త్రీ శరీరాన్ని ఎక్కువగా ఆరాధిస్తాం" అని లీ చెప్పారు.
“కానీ జంతువులను చూస్తే, మగవి చాలా అందంగా ఉంటాయి. ఉదాహరణకు సింహాలు, నెమళ్లవంటివి” అని అన్నారామె.


మగవారికి అలాంటి పోజు ఎలా ఇవ్వాలో తెలియదు
మగ పెయింటర్లు, ఫోటోగ్రాఫర్లు శతాబ్దాలుగా మహిళలను నగ్నంగా చిత్రీకరిస్తున్నారని, ఫోటోలు తీశారని, అయితే ఆ ధోరణిని మార్చాలనుకుంటున్నట్లు యుషి లీ చెప్పారు.
''ఇపుడు ఆ బ్రష్ నేను పట్టుకున్నా, నేను కోరుకున్న దాన్ని రూపొందిస్తా'' అని లీ తెలిపారు.
కొంత మంది పురుషులు టిండర్ వంటి డేటింగ్ యాప్‌లలో సెమీ న్యూడ్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తారు. కానీ, అవి అంత ఆకర్షణీయంగా కనిపించవని లీ అన్నారు.
''పురుషులు ఆకర్షణీయంగా, సెక్సీగా ఎలా ఉండాలనే దాని గురించి పెద్దగా ఆలోచించరు'' అని అంటున్నారు యుషి లీ. ఇప్పుడు కూడా తన దగ్గరికి వచ్చిన పురుష మోడల్‌లకు సెక్సువల్‌గా ఆకర్షణీయంగా కనిపించేలా ఎలా పోజులివ్వాలో తెలియదని ఆమె చెప్పారు.
“పురుషులు తమ గురించి ఎక్కువగా పట్టించుకోరు. తమను తాము ఆకర్షణీయంగా ఎలా ఉంచుకోవాలో ఆలోచించరు” అని లీ అన్నారు.
తన ఫోటోలలో పురుషులను సహజంగా, సాఫ్ట్‌గా చూపించడం తనకు ఇష్టమని లీ చెప్పారు.
"నేను కోరుకున్నదానికి నా ఛాయాచిత్రం దృశ్య రూపం ఇస్తుంది" అని ఆమె తెలిపారు.
అయితే ఇది కేవలం లైంగిక వాంఛ మాత్రమే కాదని, సాధికారత కోసం పడే తపన అని ఆమె అంటున్నారు. తన ఫాంటసీలను తన ఫోటోలు చూపిస్తాయని లీ చెబుతున్నారు.
మోడల్స్ కనెక్ట్ అవ్వడానికి వారితో కొన్ని ఫోటోలలో ఉన్నానని తెలిపారు లీ.
“నేను చైనా నుంచి వచ్చాను. సాధారణంగా పాశ్చాత్య దేశాలలో ఆసియా స్త్రీలు చిన్నగా కనిపిస్తారు, కానీ, ఆకర్షణీయంగా ఉంటారు" అని ఆమె తన నేపథ్యం గురించి స్పందిస్తూ చెప్పారు.

మగ న్యూడ్ మోడల్స్ ఏం చెబుతున్నారు?
ఆడవాళ్లు తమను ఫోటోలు పంపాలని అడిగితే ఎలాంటివి పంపాలో తమకు తెలియదని పురుష న్యూడ్ మోడల్ అలెస్టర్ గ్రాహం చెబుతున్నారు.
''మహిళలు ఎప్పుడైనా సెక్సీ ఫోటోలు అడిగితే, పురుషులు వెంటనే పురుషాంగం ఫోటో పంపుతారు. వాళ్లప్పుడు అది కాదు అంటే.. మరేది? నేనేం చెయ్యాలి? నా చేతులు, కాళ్ల ఫోటోలు పంపాలా?'' అని ఆయన సందేహం వ్యక్తంచేశారు.
''నేనెలా కనిపిస్తాననేదాన్ని బట్టి నేను నా అందాన్ని గుర్తించను. నేనింకా ఆలోచించే స్టేజిలోనే ఉన్నా'' అని మరో న్యూడ్ మోడల్ ఎమ్మాన్యుయేల్ అడెనీ అన్నారు.
''కనిపించే తీరు కన్నా నా పనితీరు ఎలా ఉంటుందనేది ముఖ్యమని నేను నమ్ముతా. నేను కారు రూపంలా కాకుండా దాని ఇంజిన్ మాదిరి ఉండాలనుకుంటా. పురుషుల శరీరాన్ని ఆనందానికి కాకుండా ప్రయోజన సాధనంగా చూస్తా” అని ఆయన చెప్పారు.
అబ్బాయిలను అమ్మాయిలు చాలా నిశితంగా చూస్తారని గ్రాహం తెలిపారు.
అయితే మహిళలు పురుషులను ఎప్పుడూ శృంగార వస్తువులుగానే చూడకపోవడం తమకు ధైర్యాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.
''మీకు మీ శరీరం గురించి తెలిస్తే, దాన్ని ప్రేమిస్తే, మీరు అందంగా ఉన్నారని భావిస్తే, ప్రపంచానికి చూపిస్తారు. అప్పుడే మీరు తెలివిగల వ్యక్తి'' అని గ్రాహం చెప్పారు.
"పురుషులకు కూడా అటెన్షన్ అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఇపుడు తాను ఆకర్షణీయంగా ఎలా కనిపించాలో ఆలోచిస్తానన్నారు అడెనీ.

మనుషులను వస్తువులుగా చిత్రీకరిస్తున్నారా?
మగ న్యూడ్ మోడల్‌ల ర్యాప్ మ్యూజిక్ వీడియోలకు యుషి లీ తీస్తున్న ఫోటోలు పూర్తిగా భిన్నమైనవి.
ర్యాప్ మ్యూజిక్ వీడియోల్లో సగం నగ్నంగా ఉన్న మహిళలు, పురుష సింగర్ చుట్టూ నృత్యం చేస్తారు.
అయితే, "ఇక్కడ మేం మరోవైపు ఉండటం కూడా బాగుంది" అని అడెనీ అన్నారు.
కొందరు ఈ ఫోటోలు చూస్తే సెక్సీగా ఉన్నాయనుకుంటారు, మరికొందరు బాగాలేవనుకుంటారని అడెనీ చెప్పారు.
‘‘నేనేమీ ఫన్నీ ఫోటోలు తీయడం లేదు. అయితే, అవి కొంచెం విచిత్రంగా కనిపించవచ్చు’’ అని లీ అంటున్నారు.
యుషి లీ చిత్రాలు మనుషులను వస్తువులుగా చిత్రీకరిస్తాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీనికి ఆమె స్పందిస్తూ- ''పురుష మోడల్స్ అంగీకారంతోనే ఇది జరుగుతోంది'' అంటున్నారు.
ఇవి కూడా చదవండి
- 46 వేల ఏళ్ల నాటి సూక్ష్మజీవులను నిద్ర లేపిన పరిశోధకులు
- హరియాణా ఘర్షణలు: మేవాత్‌లో ఒక ఇమామ్, ఇద్దరు హోంగార్డులు సహా అయిదుగురు మృతి
- మాట్లాడటం మానేసిందని యువతిపై వేట కొడవలితో దాడి
- కిడ్నీ కాజేయాలనుకున్న కోటీశ్వరుడిని జైల్లో వేయించిన 'వీధి వ్యాపారి'
- బాపట్ల: ‘అబ్బాయి శరీరమంతా కాలిపోయింది, కాపాడన్నా కాపాడన్నా అంటూ వచ్చాడు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














