హరియాణా ఘర్షణలు: మేవాత్‌లో ఒక ఇమామ్, ఇద్దరు హోంగార్డులు సహా అయిదుగురు మృతి

హరియాణా

ఫొటో సోర్స్, MusthafaKhan

ఫొటో క్యాప్షన్, హరియాణాలోని మేవాత్ ప్రాంతంలో మతపరమైన ఘర్షణలు జరిగాయి.

హరియాణాలోని మేవాత్‌లో జరిగిన మతపరమైన ఘర్షణల్లో అయిదుగురు మరణించారని మంగళవారంనాడు ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. మృతుల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక ఇమామ్ కూడా ఉన్నారు.

ఈ హింసాకాండలో పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. 50కి పైగా వాహనాలు తగలబడ్డాయి. ఇందులో ఎక్కువభాగం పోలీసులవే.

అయితే, ఇది అకస్మాత్తుగా జరిగిన హింస కాదని, ఎవరో పథకం ప్రకారం హింసకు దిగారని, హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ అన్నారు.

సోమవారంనాడు మేవాత్‌ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ర్యాలీ తర్వాత హింస చెలరేగింది.

గతంలో జరిగిన జునైద్, నసీర్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మోను మనేసర్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఆయన ఈ ర్యాలీలో ఉన్నకారణంగానే హింసాకాండ మొదలైందని రిపోర్టులు వచ్చాయి.

అయితే తాను ఈ ర్యాలీలో పాల్గొనలేదని మోను మనేసర్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

‘‘విశ్వహిందూ పరిషత్ సలహా మేరకు నేను యాత్రలో పాల్గొనలేదు. నేను ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయని వీహెచ్‌పీ భావించింది’’ అని మనేసర్ పీటీఐతో అన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో, హరియాణాలోని భివానీలో ఓ బొలెరో వాహనం దహనం కేసులో మోను పేరు ప్రముఖంగా వినిపించింది. ఆవులను తరలిస్తున్నారన్న ఆరోపణలతో బొలెరో వాహనాన్ని తగలబెట్టినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ దహనంలో జునైద్, నాసిర్‌లనే ఇద్దరు యువకులు మరణించారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి మోను మనేసర్ పరారీలో ఉన్నారు. అతనిపై రాజస్థాన్‌లోని భరత్ పూర్‌లో కేసు నమోదైంది.

మోను మనేసర్ ఈ యాత్రలో పాల్గొన్నాడన్న వార్తలు రావడంతో భరత్‌పూర్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు ఒక బృందాన్ని నుహ్ జిల్లాలోని మేవాత్ ప్రాంతానికి పంపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

హరియాణా

ఫొటో సోర్స్, ASLAMKHAN

ఫొటో క్యాప్షన్, గురుగ్రామ్‌లో మసీదుకు నిప్పు

గురుగ్రామ్‌లో మసీదుకు నిప్పు, ఇమామ్ మృతి

మేవాత్‌లో మతపరమైన హింస తర్వాత, గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లో ఉన్న మసీదుకు నిప్పు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. మసీదు నిర్వహణ కమిటీ ఛైర్మన్ బీబీసీతో మాట్లాడుతూ "ఈ ఘటనలో మసీదు ఇమామ్ మౌలానా సాద్ మరణించారు మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు." అని చెప్పారు.

ఈ వార్తను ధృవీకరించడానికి గురుగ్రామ్ పోలీసులను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, వారు స్పందించలేదు.

‘‘నాకు మా అన్నయ్య ముఖం మాత్రమే కనబడింది. ప్రస్తుతం మార్చురీలో ఉంచారు. మేం ఈ విషయంలో కేసు పెడతాం. ఏడు నెలలుగా మా అన్నయ్య మసీదులో ఇమామ్‌గా పని చేస్తున్నాడు’’ అని ఇమామ్ మౌలానా సాద్ సోదరుడు షాదాబ్ అన్వర్ బీబీసీతో అన్నారు. సాద్ వయసు 22 ఏళ్లు.

ఈ విషయంపై హరియాణా అంజుమన్ ట్రస్ట్ చైర్మన్ మహ్మద్ అస్లాం ఖాన్ బీబీసీతో మాట్లాడారు. "మేవాత్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత, సోమవారం సాయంత్రం పోలీసు బృందం మా దగ్గరికి వచ్చి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది" అని అన్నారు.

“మేము ప్రార్థనలు చేసి మసీదు నుండి తిరిగి వచ్చాము. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత 12 గంటల నుంచి 12.30 గంటల మధ్య హఠాత్తుగా మసీదుపై దాడి జరిగింది. ముందుగా మసీదు కెమెరాలను పగలగొట్టి, ఆపై నిప్పంటించారు’’ అని అస్లాం వెల్లడించారు.

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సోమవారం మేవాత్‌లో శోభా యాత్రను నిర్వహించాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

హరియాణా

ఫొటో సోర్స్, ANI

తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

మేవాత్‌ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ వార్తా సంస్థ షేర్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోలో కొన్నిచోట్ల వాహనాలు దహనమవుతున్నట్లు కూడా కనిపించింది.

నుహ్ జిల్లాకు చెందిన స్థానిక జర్నలిస్టు చెప్పినదాని ప్రకారం అక్కడ పరిస్థితులు అత్యంత గందరగోళంగా ఉన్నాయి. చాలా దుకాణాలకు నిప్పుపెట్టారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ ) ఈ హింసను ఖండించింది. దీనికి కారణమంటూ ముస్లిం వర్గాలు, పోలీసులపై ఆరోపణలు చేసింది.

‘‘మేవాత్‌లోని నల్హన్ మహదేవ్ నుంచి బ్రిజ్ మండల్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఇది ఇవాళ కొత్తగా మొదలు పెట్టింది కాదు. ప్రతి సంవత్సరం జరుగుతోంది. ఇందులో 20 వేలమంది పాల్గొంటారు. కానీ, దీనికి పోలీసులు సిద్ధం కాలేదు. మరోవైపు ముస్లింలు రాళ్లు సేకరించి దాడికి ప్రణాళికలు రచించారు.’’ అని వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

“మార్చ్ ఒక కిలోమీటర్ దూరం మాత్రమే సాగింది. ఇంతలోనే రాళ్ల దాడి జరిగింది. వెంటబడి చంపేందుకు ప్రయత్నించారు. కొందరు రాళ్లతో దాడి చేశారు, మరికొందరు కాల్పులు జరిపారు. ఇది మతపరంగా సున్నితమైన ప్రాంతమని తెలిసి కూడా పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేదు’’ అని అలోక్ కుమార్ విమర్శించారు.

ఇప్పటికీ అనేకమంది దేవాలయాల్లో దాక్కోవాల్సి వస్తోందని, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

“కేవలం ప్రభుత్వాన్ని ఆశ్రయించడమే కాదు, మాకు ఆత్మరక్షణ హక్కు ఉందని కూడా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు హిందువులు తమ ఆత్మరక్షణ హక్కును పూర్తిగా వినియోగించుకుంటారు. తర్వాత జరిగే పరిణామాలకు మేం బాధ్యులం కాదు’’ అని ఆయన హెచ్చరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

కఠిన చర్యలు తప్పవు: ప్రభుత్వం

ఈ హింసాకాండపై కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రజల మధ్య సోదరభావం చెడిపోవద్దని, అందరూ సంయమనంతో వ్యవహరించాలని హుడా అన్నారు. ఈ పరిస్థితికి కారణమెవరో త్వరలోనే తెలుస్తుందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. అదనపు బలగాలను పంపాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ తెలిపారు.

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

“ఈ ఘటనలు దురదృష్టకరం. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టలేదు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఖట్టర్ అన్నారు.

పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఫ్లాగ్‌మార్చ్‌ చేపట్టారు. దీంతోపాటు బుధవారం అర్ధరాత్రి వరకు జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్‌ సేవలను అధికారులు నిలిపివేశారు.

వీడియో క్యాప్షన్, హరియాణాలోని మేవాత్‌లో అసలు అల్లర్లు ఎలా రాజుకున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)