బాపట్ల: ‘అబ్బాయి శరీరమంతా కాలిపోయింది, కాపాడన్నా కాపాడన్నా అంటూ వచ్చాడు’

బాపట్ల: ‘అబ్బాయి శరీరమంతా కాలిపోయింది, కాపాడన్నా కాపాడన్నా అంటూ వచ్చాడు’

రాజవోలు హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్న ఉప్పాల అమర్నాథ్ హత్యకు గురయిన తీరు కలకలం రేపింది.

ఉదయాన్నే ఐదు గంటల సమయంలో దారి కాచి, దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం స్థానికులను కూడా ఆగ్రహానికి గురి చేసింది.

తండ్రి చనిపోవడంతో అమ్మా, అక్క తో కలిసి తాతయ్య ఇంట్లో ఉంటున్నాడు అమర్నాథ్. ఉప్పాలా వారి పాలెం నుంచి సమీపంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజవోలు హైస్కూల్ కి, అక్కడే ట్యూషన్ కి రోజూ వెళ్లి వచ్చేవాడు.

అమర్నాథ్ ప్రయాణించే మార్గం, సమయం అతని ప్రాణాల మీదకు తెచ్చిందని బంధువులు చెబుతున్నారు.

అమర్నాథ్

ఫొటో సోర్స్, UGC

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)