మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది

ఫొటో సోర్స్, Getty Images
మెదళ్లను తినే అరుదైన అమీబాను ఫ్లోరిడాలో గుర్తించినట్లు అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. హిల్స్‌బర్గ్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తి నెగ్లేరియా ఫాలెరీ అనే అమీబా బారిన పడినట్లు ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ (డీఓహెచ్) వెల్లడించింది.
ఏకకణ జీవి అయిన ఈ అమీబా ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుందని, చివరకు అది బాధితుడి మరణానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఈ అమీబా, మంచినీటిలో ఎక్కువగా ఉంటుందని తేలింది.
ఈ ఇన్‌ఫెక్షన్ ఎక్కడ నుంచి ఆ వ్యక్తికి సోకింది, ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి అన్నది మాత్రం ఫ్లోరిడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించలేదు. అయితే ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి పాకే వైరస్ రకం కాదని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఇలాంటి ఇన్‌ఫెక్షన్లు దక్షిణ అమెరికా రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్లోరిడా రాష్ట్రంలో మాత్రం కనిపించడం అరుదు. 1962 నుంచి ఇప్పటి వరకు కేవలం 37 కేసులు మాత్రమే బైటపడ్డాయి.
ఈ ఇన్‌ఫెక్షన్ కారణంగా ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉండటంతో, ఫ్లోరిడా వైద్య ఆరోగ్యశాఖ హిల్స్‌బర్గ్ కౌంటి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
ట్యాపులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే నీరు ముక్కు ద్వారా లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని అధికారులు స్థానికులకు సూచించారు.
జులై, ఆగస్టు నెలల్లో ఉష్ణోగ్రతల కారణంగా చెరువులు, కాలువల్లో ఈ వైరస్ పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రదేశాలలో స్నానం చేయకుండా ఉండటం మంచిదని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నెగ్లేరియా ఫాలెరీ అని పిలిచే ఈ ఇన్‌ఫెక్షన్ వచ్చిన వారిలో జ్వరం, వికారం, వాంతులు, మెడ పట్టేయడం, తలనొప్పిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది వారం రోజుల్లో మరణిస్తారు. ఈ వ్యాధి లక్షణాలు ఏ ఒక్కటి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా ఫ్లోరిడా వైద్యశాఖ అధికారులు ప్రజలకు సూచించారు. "ఇది అరుదైన వ్యాధి. ఈ సీజన్‌లో సత్వరం నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది'' అని డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అధికారి ఒకరు తెలిపారు.
యు.ఎస్. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రలో అండ్ ప్రివెన్షన్( సీడీసీ) ప్రకారం నెగ్లేరియా ఫాలెరీ అనే వ్యాధి అమెరికాలో చాలా అరుదుగా వస్తుంది. 2009-2018 మధ్య కాలంలోఅమెరికా వ్యాప్తంగా 34కేసులు నమోదయ్యాయి. వీరిలో 30మందికి పార్కులు, రిసార్టుల్లోని నీటిలో ఈతకొట్టడం వల్లే ఈ వ్యాధి సోకినట్లు తేలింది. ముగ్గురిలో ట్యాప్ ద్వారా వచ్చే నీటి నుంచి ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిందని, మరొకరికి కలుషితమైన నీటి ద్వారా వచ్చిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 'ఆత్మనిర్భర్ భారత్' కింద కేంద్రం నుంచి వచ్చింది ఎంత? వలస కార్మికులకు ఇచ్చింది ఎంత?
- ప్రాణాలు పోతున్నాయని చెప్పినా 18 ఆస్పత్రులు చేర్చుకోలేదు...
- లద్దాఖ్‌లో ప్రధాని మోదీ.. భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య హఠాత్ పర్యటన
- భారత్-చైనా 5జీ స్పెక్ట్రమ్‌పై కన్నేసిన చైనా కంపెనీలను అడ్డుకోవడం ఎలా? జాతీయ భద్రతా సలహా సంఘం ఛైర్మన్ ఏమంటున్నారు?
- పాకిస్తాన్లో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి అడ్డంకులు... ఫత్వా జారీ చేసిన మదర్సా
- ‘ఆగస్టు 15 నాటికి కరోనావైరస్ వ్యాక్సిన్’.. హైదరాబాద్ నుంచే టీకా ఉత్పత్తి
- ఫేస్‌బుక్ కథ ముగిసినట్లేనా
- మన భవిష్యత్ ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయి
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








