భారత్-చైనా సరిహద్దు వివాదం: లద్దాఖ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సైనికులతో భేటీ.. ఉద్రిక్తతల మధ్య హఠాత్ పర్యటన

శుక్రవారం తెల్లవారుజామున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా లద్దాఖ్‌లోని లేహ్ వెళ్లారు.
జూన్ 15న భారత్-చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల అనంతర పరిస్థితిని ప్రధాని సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మృతిచెందారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
“మోదీ ప్రస్తుతం నిములో ఉన్నారు. ఆయన ఈరోజు ఉదయమే అక్కడికి చేరుకున్నారు. ఆర్మీ జవాన్లతో, వైమానికదళం, ఐటీబీపీతో ప్రధాని మాట్లాడుతారు” అని భారత ప్రభుత్వ వార్తా సంస్థ ప్రసార భారతి ట్వీట్ చేసింది.
ట్వీట్‌తోపాటు ప్రసార భారతి కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది.


ఈ ఫొటోల్లో ఒక ఆర్మీ పోస్టులో జాకెట్ వేసుకుని ఉన్న ప్రధాని అధికారులతో కలిసి కూర్చుని ఉన్నారు. అధికారులు ఆయనకు బ్రీఫ్ చేస్తున్నారు. కోవిడ్ వల్ల ఇక్కడ అధికారులు సామాజిక దూరం పాటిస్తున్నట్లు ఈ ఫొటోల్లో తెలుస్తోంది.
ప్రసార భారతి వివరాల ప్రకారం ప్రధాని ప్రస్తుతం ఉన్న ప్రాంతం 11 వేల అడుగుల ఎత్తులో జంస్కర్ రేంజ్‌లో ఉంది. ప్రధానమంత్రికి అధికారులు అక్కడి పరిస్థితి గురించి పూర్తి సమాచారం అందించారు.
వార్తా సంస్థ ఏఎన్ఐ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
“ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తెల్లవారుజామున లద్దాఖ్‌లోని నిమూలో ఒక ఫార్వార్డ్ లొకేషన్‌కు దగ్గరికి చేరుకున్నారు. ఆయన ఇండియన్ ఆర్మీ, వైమానిక దళం, ఐటీబీపీ సైనికులను కలుస్తారు” అని తెలిపింది.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలతో కలిసి ప్రధాని లద్దాఖ్ చేరుకున్నారని హిందుస్థాన్ టైమ్స్ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








