కరోనావైరస్: 'మతం భవిష్యత్తు' ఎలా ఉంటుంది? ఆచారాలు, పద్ధతులు ఎలా మారతాయి?
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాపించినప్పుడు, ఆలయాలు, ప్రార్థనాలయాలు మూతబడితే, మరోవైపు రామాయణం సీరియల్ టీవీలో అత్యధికులు చూసే కార్యక్రమంగా మారింది.
అంటే, వారంతా తాము ఆరాధించేవారి పట్ల నిరాశతో ఉన్నారా, లేక మరింతగా భక్తివిశ్వాసాలవైపు మళ్లారా?
కరోనా తర్వాత ప్రపంచంలో ఆధ్యాత్మికత మరింత బలమైన శక్తిగా మారుతుందని రామాయణం టీవీ సీరియల్లో సీత పాత్ర పోషించిన నటి దీపికా చికలియా టోపీవాలా భావిస్తున్నారు.
మహమ్మారి ఫలితంగా భారత జనాభాలో ఎక్కువ శాతం మంది బహుశా ప్రకృతి, ఆధ్యాత్మికత వైపు మళ్లవచ్చని ఆమె నమ్ముతున్నారు.
“పార్కుల్లో ధ్యానం చేసేవారిని మనం మరింత మందిని చూస్తామని నాకు అనిపిస్తోంది” అని ఆమె చెప్పారు.
అజ్మీరులోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గా నిర్వాహకుడు సయ్యద్ గౌహర్ కరోనావైరస్‌ను ‘అల్లా ఆగ్రహం’గా వర్ణించారు. “మసీదుల్లోకి కరోనా ప్రవేశించకుండా దేవదూతలు కాపలా కాస్తుంటారని తమ సమాజంలోని మతపెద్దలు, ప్రజలు భావిస్తారని” చెప్పారు.
కొంతమంది ఆవు మూత్రంతో కరోనాను తరిమికొట్టచ్చని చెప్పారు. కరోనా శాపం నుంచి బయటపడ్డానికి మతపరమైన చిహ్నాలు, ఆచారాలు ఉపయోగించడానికి అధికారిక అనుమతి ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.
“ఆధునిక మతాలకు సైన్సుతో శత్రుత్వం లేదు. బదులుగా అవి దాన్ని వాడుకుంటున్నాయి. ఏవైనా అనూహ్యమైనవాటిని ఎదుర్కున్నప్పుడు వారు తమ ‘మతంలో అది ఎప్పుడూ ఉందని’ చెబుతారు” అని దిల్లీ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్‌కు చెందిన డాక్టర్ హిలాల్ అహ్మద్ అన్నారు.

మతాలకు అసాధరణ స్థితి
అనిశ్చితి వేదనను మిగులుస్తోంది. కానీ, టీకా తయారు చేసి, దానిని చివరకు ప్రతి ఒక్కరికీ ఇచ్చేవరకూ జనం ఒక అసాధరణ స్థితిలో జీవించాల్సి ఉంటుంది. దానికి నెలలు, ఏళ్లు కూడా పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అప్పుటికి, భారతీయ సమాజం మరింత మతపరంగా మారుతుందా లేక మరింత శాస్త్రీయ స్వభావాన్ని అలవరుచుకుంటుందా అనేది ఊహించడం కష్టమే. ఈ గందరగోళం నుంచి ఆవిర్భవించే కొన్ని పోకడలను మనం చూడచ్చు.
దిల్లీలోని సామాజిక కార్యకర్త గీతా శర్మ స్వావలంబన సాధించినవారు. ఆమె లాక్‌డౌన్ గురించి పెద్దగా ఫిర్యాదులేవీ లేకుండానే ప్రశాంత జీవితం గడుపుతున్నారు.
గీత ఇప్పుడు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. “నేను ప్రస్తుత స్థితి గురించి మాట్లాడాల్సి వస్తే, దేవుడు ఆధ్యాత్మికత వైపు మళ్లడానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడనే అంటాను” అన్నారు.
జర్నలిజం కెరీర్ కూడా ఉన్న గీత విపత్తులు వచ్చిన సమయాల్లో తనకుతానుగా ఉండడానికి ఇష్టపడతారు. కోవిడ్-19 గురించి ఆమె వైరాగ్యంతో “కరోనా అనేది ఒక పాఠం, అది శాపం కాదు, దానికి ధ్యానమే సమాధానం” అన్నారు.
బెంగళూరులో విశాలమైన ఆశ్రమం నిర్వహించే యోగా గురు శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది శిష్యులు ఉన్నారు. ఆయన కరోనా మహమ్మారి కష్టాలను ఎదుర్కోడానికి ధ్యానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
సయ్యద్ గౌహర్ కూడా “ప్రజలు మరింత ఆధ్యాత్మికంగా మారుతారని, భగవంతుడికి మరింత దగ్గరవుతారని నేను భావిస్తున్నాను” అంటున్నారు.

ఆన్‌లైన్లో మరిన్ని ప్రార్థనలు
లాక్‌డౌన్ సమయంలో దాదాపు రెండు నెలలపాటు దేశంలోని అన్ని మసీదులు, ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలు మూసేశారు. చాలా ప్రాంతాల్లో జూన్ 8న వాటిని మళ్లీ తెరిచారు. కానీ భక్తులకు ఎన్నో ఆంక్షలు, మార్గదర్శకాలు విధించారు.
ఒక పెద్ద కలిసిమెలిసి జీవించే సమాజం ఉంటుందని అందరూ భావించే చోట, మతపరమైన ప్రాంతాల్లో కూడా సామాజిక దూరం అనేది ఒక నియమంగా మారుతుందని భావిస్తున్నారు.
మహారాష్ట్రలో ప్రార్థనా స్థలాలు, ఆలయాలను ఇంకా ప్రజలకోసం తెరవలేదు. కానీ జనం వాటిని చూడ్డానికి వెళ్లకుండా అది ఆపలేదు.
రాజస్థాన్ కోటాలో ఖుర్షీద్ ఆలం ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గాకు వెళ్తుంటారు. అక్కడకు ఏటా లక్షలమంది వస్తుంటారు. “నేను దర్గాకు వెళ్లలేను. అందుకే నేను అప్పుడప్పుడూ వీడియో కాల్ చేసి ఆయన దీవెనలు తీసుకుంటాను” అని ఆలం చెప్పారు.
వీడియో సేవల ద్వారా తమ ఆధ్మాత్మిక అవసరాలు నెరవేర్చుకుంటున్న ఖుర్షీద్ ఆలం లాంటి వారు ఎంతోమంది ఉన్నారు.
లాక్‌డౌన్‌తో మూసేయడంతో ఈ దర్గా వారు ఆన్‌లైన్ నజ్రానా(సమర్పణలు) కోసం చూసింది. ఈ ట్రెండ్ పెరగవచ్చని సయ్యద్ గౌహర్ భావిస్తున్నారు. “మాకు ఇప్పటికే ఆన్ లైన్ సేవలు ఉన్నాయి. కానీ కరోనా తర్వాత ప్రపంచంలో ఈ సేవలు వారాలు, నెలల్లోనే మరింత పెరగడం మనం చూస్తాం” అన్నారు.

సిక్కు భక్తులు మళ్లీ స్వర్ణ మందిరం దర్శనానికి రావాలని ఎదురుచూస్తున్నారని ఎస్జీపీసీ చీఫ్ సెక్రటరీ రూప్‌సింగ్ చెప్పారు. “దానిని మళ్లీ తెరవగానే శ్రీ హర్మిందర్ సాహెబ్ భక్తుల్లో చాలా ఆతృత ఉందని నేను అర్థం చేసుకోగలను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ఇక్కడకు వస్తారు సందేహమే లేదు. కానీ, అప్పుడు కూడా కొన్ని లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని నాకు అనిపిస్తోంది” అన్నారు.
వాటికన్ నుంచి ప్రతి వారం పోప్ ఫ్రాన్సిస్ సభలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అమెరికాలోని చర్చిలు, ఇజ్రాయెల్‌లో సైనగాగ్స్(యూదుల ఆరాధన స్థలాలు) కూడా మతపరమైన సేవల లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాయి. ఇస్లాం పవిత్ర ప్రదేశమైన మక్కాలోని మసీదు మూసేశారు. రోజుకు ఐదు సార్లు చేసే ‘అజాన్’ను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.
మతం-ఆర్థిక పరిస్థితి
మతపరమైన ప్రాంతాలు, సంస్థలను హఠాత్తుగా మూసివేయడంతో, మతపరమైన చాలా ప్రాంతాల్లో భక్తుల నుంచి అందే విరాళాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి.
“ఇంతకు ముందు ప్రతిరోజూ వేలమంది గురుద్వారాలకు వచ్చేవారు. హుండీలో కొంత డబ్బు వేసేవారు. ఇప్పుడు డబ్బులు రావడం పూర్తిగా ఆగిపోయింది” అని దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా చెప్పారు.
బహుశా ఇది కమిటీకి అత్యంత కఠిన సమయం అని, ప్రతిరోజూ ఆన్‌లైన్, టీవీల ద్వారా విరాళాలు అందించాలని కోరుతున్నామని చెప్పారు.

లాక్‌డౌన్ ముందు దిల్లీలోని అతిపెద్ద గురుద్వారా బంగ్లాసాహిబ్ సిబ్బంది, వాలంటీర్లు అక్కడి వంటగదిలో ప్రతిరోజూ 25 వేల భోజనాలు సిద్ధం చేసేవారు. అది వారాంతాల్లో దాదాపు లక్ష వరకూ చేరుకునేది.
కానీ, ఇప్పుడు దేశంలో లాక్‌డౌన్ వల్ల నగరంలో ఉన్న పేదలకు ఉపాధి లేకుండా పోయింది. అంటే వారంతా బతుకుపోరాటం చేయాలి. దాంతో, గురుద్వారా సిబ్బంది రోజుకు 2 లక్షలకుపైగా భోజనాలు సిద్ధం చేస్తున్నారు.
“లాక్‌డౌన్ ఎత్తేయగానే ఈ సంఖ్య రెండు మూడు రెట్లు పెరుగుతుందని మాకు అనిపిస్తోంది” అని సిర్సా చెప్పారు.
మతపరమైన ప్రాంతాలను తెరిచినా, కోవిడ్ అనంతర ప్రపంచంలో వాటికి కొంతమంది మాత్రమే వస్తారనే విషయం తనకు తెలుసని సిర్సా అంటున్నారు. అంటే కరోనా రాకముందు వచ్చినట్లు నిధులు సేకరించాలంటే ఈ గురుద్వారాకు కొన్ని ఏళ్లు పట్టవచ్చు.

గురుద్వారాకు ఇంతకు ముందు అందుతున్న మొత్తం తగ్గినా, వారు తమ పనిని కొనసాగించేలా సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని మతాలవారి నుంచి ఆన్‌లైన్ విరాళాలు వస్తున్నాయి.
“మేం వాటిని రోజుకు ఒకేసారి తీస్తాం. మతపరమైన సంస్థలను మూసివేసినా. ఇలా సాయం అందడం చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. మానవతా సేవ పట్ల ప్రజల తపన ఆగిపోలేదు” అంటారు సిర్సా.
స్టోరీ- జుబైర్ అహ్మద్
ఇలస్ట్రేషన్స్- పునీత్ కుమార్

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈఎస్ఐ కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయన్న విజిలెన్స్.. అచ్చెన్నాయుడు పాత్ర ఎంత?
- పీజీలూ, పీహెచ్‌డీలూ, టీచర్లూ, లెక్చరర్లనూ ఉపాధి హామీ కూలీలుగా మార్చేసిన కరోనా మహమ్మారి
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- కరోనా లాక్‌డౌన్: కష్టకాలంలో డిజిటల్ వైపు మళ్లి, లాభాలు పొందిన రైతులు, మత్స్యకారులు
- ఆరు వసంతాల తెలంగాణ: ఉద్యమం నాటి ఆశలు, ఆకాంక్షలు ఎంతవరకూ నెరవేరాయి?
- కరోనావైరస్ లాక్‌డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- లాక్ డౌన్‌తో దేశంలో ఆకలి చావులు పెరుగుతాయి: 'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి
- కరోనావైరస్-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









