కరోనా వైరస్: మాస్క్‌లు వైరస్‌ల వ్యాప్తిని అడ్డుకోగలవా? వీటి ప్రభావం ఎంత?

మాస్క్‌ ధారణ

ఫొటో సోర్స్, Getty Images

వైరస్ వ్యాప్తి చెందే చోట ప్రజలు సర్జికల్ మాస్కులు ధరించడం మనం తరచూ చూస్తుంటాం. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వీటిని పెట్టుకొంటుంటారు.

కరోనా వైరస్‌లో కొత్త రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న చైనాలో ప్రస్తుతం ఈ దృశ్యం కనిపిస్తోంది. చైనాలో తీవ్రస్థాయి వాయుకాలుష్యం నుంచి రక్షణ కోసం కూడా మాస్కులు ధరిస్తారు.

గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్‌ల నుంచి రక్షణ కల్పించడంలో ఈ మాస్కుల ప్రభావంపై వైరాలజిస్టుల్లోనూ సందేహాలున్నాయి. చేతుల నుంచి నోటిలోకి సూక్ష్మజీవులు చేరడాన్ని, వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో ఇవి తోడ్పడతాయనే దాఖలాలైతే ఉన్నాయి.

Presentational grey line
News image
Presentational grey line

సర్జికల్ మాస్క్‌లను తొలిసారిగా ఆస్పత్రుల్లో 18వ శతాబ్దం చివర్లో ప్రవేశపెట్టారు. వాటిని సాధారణ ప్రజలు వాడటం వెంటనే మొదలు కాలేదు. 1919లో స్పానిష్ ఫ్లూ విజృంభణ తర్వాతే వీటిని ప్రజలు ధరించడం మొదలైంది. నాటి ఫ్లూ ఐదు కోట్ల మందికి పైగా ప్రజలను బలి తీసుకుంది.

వైరస్‌లలో అత్యధికం గాలి ద్వారానే వ్యాపిస్తాయని లండన్ విశ్వవిద్యాలయంలోని 'సెయింట్ జార్జ్స్' వైద్యశాలకు చెందిన డాక్టర్ డేవిడ్ క్యారింగ్‌టన్ బీబీసీతో చెప్పారు.

గాల్లో ఉండే వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి సాధారణ సర్జికల్ మాస్కులు ప్రజలకు అంత రక్షణ కల్పించలేవని, ఎందుకంటే ఇవి చాలా వదులుగా ఉంటాయని, గాలి ఫిల్టర్ ఉండదని, కళ్లను కవర్ చేయవని ఆయన వివరించారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

సూక్ష్మజీవుల వ్యాప్తి

ఫొటో సోర్స్, PA Media

వైరస్ బాధిత వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు గాల్లోకి వెలువడే తుంపర వల్ల వైరస్ బారిన పడే ముప్పును ఈ మాస్కులు తగ్గించగలవు. సూక్ష్మజీవులు చేతుల నుంచి నోటిలోకి చేరి వ్యాపించడం నుంచి కొంతమేర రక్షణ కల్పించగలవు.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో 2016లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం- వ్యక్తులు గంటలో ఇంచుమించు 23 సార్లు తమ ముఖాన్ని తాకారు.

ఇన్‌ఫ్లుయెంజా ఇన్‌ఫెక్షన్ నివారించడంలో ప్రత్యేక శ్వాస పరికరం(రెస్పిరేటర్) స్థాయిలో ఉపయోగపడుతుందని ఆస్పత్రి వాతావరణంలో జరిపిన అధ్యయనంలో తేలిందని నాటింగ్‌హాం విశ్వవిద్యాలయంలో మాలిక్యులర్ వైరాలజీ ప్రొఫెసర్ జొనాథన్ బాల్ చెప్పారు.

సాధారణంగా రెస్పిరేటర్లలో గాలిని వడపోసే వ్యవస్థ ఉంటుంది. గాల్లోని ప్రమాదకర పదార్థాల నుంచి రక్షణ కల్పించేలా వీటిని రూపొందిస్తారు.

మాస్క్‌ల ధారణ

ఫొటో సోర్స్, Getty Images

అధ్యయనాలను బట్టి చూస్తే- సాధారణ ప్రజలకు వైరస్‌ల నుంచి ఈ మాస్క్‌లు అంత ప్రభావవంతమైన రక్షణ కల్పిస్తాయని చెప్పలేమని ప్రొఫెసర్ బాల్ చెప్పారు. వీటిని ఎక్కువ సమయం ధరించడం సవాలుతో కూడుకొన్నదని వ్యాఖ్యానించారు.

ఈ మాస్క్‌లతో పోలిస్తే సాధారణ పరిశుభ్రతా చర్యలు మెరుగైన ఫలితాలను ఇస్తాయని బ్రిటన్లోని క్వీన్స్ యూనివర్శిటీ బెల్‌ఫాస్ట్‌లో 'వెల్‌కమ్-వోల్ఫ్‌సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎక్స్‌పరిమెంటల్ మెడిసిన్'‌కు చెందిన డాక్టర్ కోనర్ బాంఫర్డ్ చెప్పారు.

తుమ్మేటప్పుడు నోటికి ఏదైనా అడ్డం పెట్టుకోవాలని, చేతులను కడుక్కొంటుండాలని, శుభ్రం చేసుకోని చేతులతో నోటిని తాకకూడదని, వీటిని పాటిస్తే శ్వాస సంబంధ వైరస్‌ల బారిన పడే ముప్పును పరిమితం చేయొచ్చని ఆయన వివరించారు.

ఫ్లూ లాంటి వైరస్‌ల బారిన పడకుండా ఉండాలంటే- చేతులను వేణ్నీళ్లు, సబ్బుతో క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలని, సాధ్యమైనంత వరకు కళ్లను, ముక్కును తాకొద్దని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని బ్రిటన్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది.

ఫేస్ మాస్కుల వల్ల ఉపయోగం ఉండొచ్చనే భావన ఉందని, అయితే ఆస్పత్రి తరహా వాతావరణం వెలుపల వీటి వాడకంతో విస్తృతమైన ప్రయోజనం ఉంటుందనే ఆధారాలు పెద్దగా లేవని 'పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్'లో ఇన్‌ఫెక్షన్ల విభాగానికి చెందిన డాక్టర్ జేక్ డనింగ్ వ్యాఖ్యానించారు.

మాస్కులు సరిగా పనిచేయాలంటే వాటిని సరైన రీతిలో ధరించాలని, తరచూ మార్చాలని, జాగ్రత్తగా తొలగించాలని ఆయన వివరించారు.

ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)