ఐసీఎంఆర్ - కోవ్యాక్సిన్: ‘ఆగస్టు 15 నాటికి కరోనావైరస్ వ్యాక్సిన్’.. హైదరాబాద్ నుంచే టీకా ఉత్పత్తి

ఫొటో సోర్స్, facebook/bharatbiotech
కరోనావైరస్ నుంచి భారత్ బయటపడే రోజులు దగ్గర్లోకి వస్తున్నాయా అంటే అవుననే అంటోంది భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్).
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్ టీకాను ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఐసీఎంఆర్ వడివడిగా అడుగులు వేస్తోంది.
ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న భారత్ బయోటెక్ సహా మిగతా ఇనిస్టిట్యూషన్లకు లేఖ రాశారు.
లేఖలో ఏముందంటే..
‘‘కోవిడ్ వ్యాక్సిన్ తీసుకురావడంలో భాగంగా క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేయడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కలిసి పనిస్తున్నాం.
దేశీయంగా తయారవుతున్న తొలి వ్యాక్సిన్ ఇది. దీన్ని భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పర్యవేక్షిస్తోంది.
క్లినికల్ ట్రయల్స్ త్వరితగతిన పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడానికి కృషి జరుగుతోంది.భారత్ బయోటెక్ ఈ దిశగా పనిచేస్తుంది..
అయితే, ఈ ప్రాజెక్టులో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న అన్ని చోట్ల నుంచి సరైన సహకారం అందడంపై ఈ లక్ష్యాన్ని చేరుకోవడమనేది ఆధారపడుతుంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖ నేపథ్యంలో ట్రయల్స్ పూర్తిగా విజయవంతమైతే కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో రానుందని అర్థమవుతోంది.
ఇప్పటికే డీజీసీఏ నుంచి అన్ని అనుమతులు వచ్చినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.
ఎక్కడెక్కడ ట్రయల్స్ జరుగుతున్నాయి..
డాక్టర్ బలరాం భార్గవ్ లేఖ ప్రకారం.. విశాఖ కేజీహెచ్, హరియాణాలోని రోహ్‌తక్ యూనివర్సిటీ, దిల్లీ ఎయిమ్స్, పట్నాలోని ఎయిమ్స్, హైదరాబాద్ నిమ్స్.. కర్నాటకలోని బెలగావి, మహారాష్ట్రలోని నాగపుర్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, తమిళనాడులోని ఎస్‌ఆర్ఎం నగర్, ఒడిశాలోని భువనేశ్వర్, గోవాలోని వివిధ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- అమెరికా: 2014 తర్వాత వేగవంతమైన వృద్ధి రేటు సాధించిన ఆర్థిక వ్యవస్థ
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- ‘ఉపాధి లేదు.. చేతిలో డబ్బు లేదు’.. మహిళలను టార్గెట్ చేస్తున్న అక్రమ రవాణా ముఠాలు
- ఆంధ్రప్రదేశ్: పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల విభజన లాభమా? నష్టమా?
- హైడ్రోజన్ విప్లవం ఇప్పటికైనా వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








