కరోనావైరస్-లాక్‌డౌన్ ఎప్పుడు, ఎలా ముగుస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లాక్‌డౌన్ ఎత్తేస్తారా? దానిని ఎప్పుడు, ఎలా ముగిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలపై ఒక కన్నేద్దాం.
మనకు వేరే దారి లేదు. లాక్‌డౌన్ కొనసాగించాలి. ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్‌డౌన్ కొనసాగించాలని నేను గౌరవ ప్రధానమంత్రికి అపీల్ చేస్తున్నాను. దానికి ఏమాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు.
-కె.చంద్రశేఖరరావు, తెలంగాణ ముఖ్యమంత్రి
ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ కొనసాగించవచ్చు అనిమీడియాలో గత కొన్ని రోజులుగా చెబుతున్నారు. అది చూస్తున్న ప్రజలు పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14 తర్వాత ఏమవుతుంది అనేది ఇప్పుడప్పుడే చెప్పలేం. మా రాష్ట్రంలో ఒక్క కేసు ఉన్నా లాక్‌డౌన్ తెరవడం మంచిది కాదు.
-అవనీశ్ అవస్థీ, యూపీ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి
కేంద్రం రాష్ట్రాలను దీనిపై సలహా కోరింది. రాష్ట్రాలు తమ పరిస్థితులను బట్టి దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. లాక్‌డౌన్ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంరాజస్థాన్.
-అశోక్ గెహ్లాత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
మహారాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేయడం గురించి ఆలోచిస్తోంది.
-రాజేశ్ టోపే, ఆరోగ్య మంత్రి, మహారాష్ట్ర
ఏప్రిల్ 14 లేదా ఏప్రిల్ 20న లాక్‌డౌన్ ఎత్తివేస్తే, అస్సాం బయట ఉన్న అసామియా యువతీయువకులు అందరూ ఒకేసారి రాష్ట్రంలోకి వస్తారు. వారందరినీ 14 రోజులు క్వారంటైన్‌కు పంపడం అసాధ్యం, ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం వారందరినీ పెట్టడానికి తగినన్ని క్వారంటైన్ కేంద్రాలు లేవు.
-హిమంత్ బిస్వా శర్మ, ఆరోగ్య మంత్రి, అస్సాం
ఈ ప్రకటనలన్నీ దేశంలోని పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు చేసినవి. ఇవన్నీ చూస్తుంటే ఏప్రిల్ 14 తర్వాత దేశవ్యాప్తంగా ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదు అనే విషయం స్పష్టం అవుతోంది.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైపు నుంచి కూడా కొన్ని ఆంక్షలు విధిస్తామని చెబుతున్నాయి.
అయితే ఈ లాక్‌డౌన్ ఎలా ఎత్తివేస్తారు? ప్రభుత్వం బ్లూ ప్రింట్ ఏంటి? ఈ విషయాలను తెలుసుకోడానికి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాతో బీబీసీ మాట్లాడింది. ప్రభుత్వం కోవిడ్-19 కోసం ఏర్పాటు చేసిన 11 కమిటీల్లో ఒకదానికి ఆయన అధ్యక్షుడు కూడా.

ఫొటో సోర్స్, Getty Images
లాక్‌డౌన్ ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉంటుంది?
కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల రేటు ఏ హాట్‌స్పాట్ ఏరియాల్లో ఎక్కువగా ఉందో, అక్కడ లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం ప్రస్తుతం సాధ్యం కాదు అని డాక్టర్ గులేరియా చెప్పారు.
“అది సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ లాక్‌డౌన్ ఎత్తేయడం అంటే, కోవిడ్-19 రోగులను ఒక్కసారిగా పెంచడమే అవుతుంది. ఎక్కడైతే ఇప్పటివరకూ కరోనా కేసులు బయటపడలేదో, అక్కడ మనం మెల్లమెల్లగా లాక్‌డౌన్ ఎత్తివేయవచ్చు” అని రణదీప్ చెప్పారు.
దేశంలో 700 జిల్లాలకు పైనే ఉన్నాయి. ఇప్పటివరకూ 274 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దానిని బట్టి చూస్తే, ఏప్రిల్ 14 తర్వాత దాదాపు 450 జిల్లాల్లో లాక్‌డౌన్ సడలించవచ్చు.
దేని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు?
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రతి ఐదో రోజు రోగుల సంఖ్య రెట్టింపు అవుతోంది.
తబ్లీగీ జమాత్ మర్కజ్ నుంచి అంత భారీ సంఖ్యలో రోగులు బయటికి రాకుంటే ఈ వేగం మరింత తగ్గి ఉండేదని కేంద్రం చాలాసార్లు చెప్పింది.
లాక్‌డౌన్ గురించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునేముందు కొన్ని విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
ప్రభుత్వం 4 అంశాలను దృష్టిలో ఉంచుకుని దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అని డాక్టర్ గులేరియా చెబుతున్నారు.
- తర్వాత కూడా లాక్‌డౌన్ కొనసాగించడం వల్ల ఆర్థికవ్యవస్థపై దాని ప్రభావం ఎంత ఉంటుంది? ప్రభుత్వానికి ఆ నష్టాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉందా? అనేదానిపై దృష్టి పెట్టాలి.
- లాక్‌డౌన్ ఎత్తివేయడం అనేది ఒక పెద్ద జనాభా ఆరోగ్యంతో చెలగాటంగా మారుతుందా? అని ఆలోచించాలి.
- పారిశ్రామిక ప్రపంచానికి ఎదురయ్యే ప్రశ్నలను కూడా ప్రభుత్వం లాక్‌డౌన్‌కు జోడించి చూడాల్సుంటుంది. లాక్‌డౌన్ కొనసాగించాలా లేక ఎత్తివేయాలా అనే నిర్ణయం వల్ల భారత ఎగుమతులు-దిగుమతులు, మిగతా దేశాలతో ఉన్న సంబంధాలు, దేశంలోని మిగతా పరిశ్రమలపై ఎంత ప్రభావం పడుతుంది? అనేది చూడాలి.
- పేద వలస కార్మికుల పరిస్థితి. ప్రభుత్వం వారిని ఎంత వరకూ చేరుకోగలిగింది, వారి సమస్యలు ఏంటి, ప్రభుత్వం వాటిని పూర్తిగా పరిష్కరించగలదా? అనేది కూడా చూసుకోవాలి.
కేంద్రం లాక్‌డౌన్‌పై రాష్ట్రాల సలహా కోరడానికి కారణం ఇదే. బుధవారం ప్రధాని మోదీ వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడి, వారితో కూడా ఇదే విషయంపై చర్చించబోతున్నారు.

లాక్‌డౌన్ ఎలా ఎత్తివేస్తారు?
లాక్‌డౌన్ ఎత్తివేయాలంటే రెండు పద్ధతులు ఉంటాయని డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. వాటిలో మొదటిది గ్రేడెడ్ లేదా దశలవారీగా లాక్‌డౌన్ తొలగించడం. రెండోది ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా బయటపడని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ పూర్తిగా సాధారణ జీవనం ఉండేలా చేయడం.
డాక్టర్ రణదీప్ దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేయడానికి అనుకూలంగా మాట్లాడారు.
“ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని ప్రాంతాల్లో పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తేయవచ్చు. కానీ, భారత్‌లో అది సాధ్యం కాదు” అని ఆయన చెప్పారు.
అలా చేయడం వల్ల మరో కరోనా రోగి లేదా కరోనా ప్రభావిత ప్రాంతం నుంచి జనం అక్కడికి వెళ్లే ప్రమాదం ఉంటుంది అన్నారు.
“ప్రభుత్వం అలాంటి ప్రాంతాల్లో ప్రజల కదలికలను మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం హాట్‌స్పాట్లను ప్రత్యేక పద్ధతిలో, నాన్-హాట్‌స్పాట్ ఏరియాలను మరో విధంగా డీల్ చేయాల్సి ఉంటుంది” అని ఆయన తెలిపారు.
హాట్‌స్పాట్ అంటే దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ హాట్‌స్పాట్లను గుర్తించింది. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రత్యేక వ్యూహం కూడా రూపొందించింది. దానిని అమలు చేయడం ద్వారా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ అవకాశాలను అడ్డుకోవచ్చని భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ హాట్‌స్పాట్స్లో కొన్ని – దిల్లీ(నిజాముద్దీన్, దిల్షాద్ గార్డెన్), మీరఠ్, అహ్మదాబాద్, మహారాష్ట్ర(ముంబయి, పుణె), కేరళ(కాసర్‌గోడ్, పత్తనంథిట్ట)
అయితే హాట్‌స్పాట్‌లు రోజురోజుకూ మారుతున్న పరిస్థితితోపాటు మారుతూ ఉంటాయి. ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం భారత్‌లో మొత్తం 21 హాట్‌స్పాట్లు ఉన్నాయి.
“హాట్‌స్పాట్ ఏరియాలను ఏప్రిల్ 14 తర్వాత కూడా మిగతా ప్రాంతాల నుంచి పూర్తిగా కటాఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది” అని డాక్టర్ గులేరియా భావిస్తున్నారు.
అంటే ఆ ప్రాంతాల్లో రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించాలి. లేదంటే ఇప్పటివరకూ కేసులు లేని ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు బయటపడవచ్చు.
లాక్‌డౌన్ గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ విమానాలను ఎగిరే అనుమతి ఇవ్వాలి, ఏ రైళ్లను మళ్లీ ట్రాక్ మీదకు తీసుకురావాలి అనేది అత్యంత పెను సవాలుగా నిలవబోతోంది.
“దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తేయడం అంటే, మొదట ఒక జిల్లాను కరోనా ఫ్రీ చేయడం, తర్వాత ఇంకో జిల్లా, అలా ఎక్కడెక్కడ కరోనా రోగుల సంఖ్య సున్నాకు చేరుతుందో అక్కడ లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ రావాలి. ఆ సమయంలో మిగతా ప్రాంతాల నుంచి అక్కడకు ఎవరూ రాకుండా చూసుకోవాలి” అని గులేరియా చెప్పారు.
విదేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం ఎప్పటివరకు?
విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రభుత్వం ఎప్పటివరకూ నిషేధం విధించగలదు అనేది కూడా లాక్‌డౌన్‌లో ఎదురయ్యే ఒక పెద్ద ప్రశ్న.
విదేశాల నుంచి వచ్చిన వారివల్లే భారత్‌లో కరోనా కేసులు నమోదయ్యాయి అని గులేరియా భావిస్తున్నారు.
“లాక్‌డౌన్ తర్వాత విదేశాల నుంచి ఎవరైనా వస్తే ప్రభుత్వం వారిని నేరుగా క్వారంటైన్‌కు పంపించే నిబంధనలు అమలు చేయవచ్చు. ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్, టెస్టింగ్ పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే, ఇప్పుడు మేం ర్యాపిడ్ టెస్టింగ్ గైడ్‌లైన్స్ కూడా జారీ చేశాం. గురువారం నుంచి దేశంలో వాటిని ప్రారంభించబోతున్నాం” అన్నారు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

పరిస్థితిలో స్పష్టత ఎప్పుడు?
“ఏప్రిల్ 10 లేదా 12 తర్వాత కేంద్రం దగ్గర ఎక్కువ డేటా ఉంటుంది. లాక్‌డౌన్ వల్ల ఎంత ప్రభావం ఉంది, అది ఏయే ప్రాంతాలపై ప్రభావం చూపింది అనేదానిపై అప్పటికి స్పష్టత వస్తుంది. అప్పుడు ప్రభుత్వం కరోనా గ్రాఫ్ ఇంకా పెరుగుతూనే ఉందా, లేక కాస్త ‘ఫ్లాట్’ అయ్యిందా? అని ఒక నిర్ణయం తీసుకునే స్థితిలో ఉంటుంది. అందుకే, తన తర్వాత చర్యలు ఎలా ఉంటాయి అనేది ప్రభుత్వం ఏప్రిల్ 10-12 మధ్య ప్రకటించవచ్చు” అంటారు డాక్టర్ గులేరియా.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది? కంటైన్మెంట్ ఆపరేషన్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది?
- కరోనావైరస్: ప్రాణాలు కాపాడుకోవడానికి డస్ట్ బిన్ కవర్లు వేసుకుంటున్న బ్రిటన్ వైద్య సిబ్బంది
- ప్రజల కదలికలను స్మార్ట్ ఫోన్ల ద్వారా కనిపెడుతున్న గూగుల్.. భారతదేశంలో లాక్‌డౌన్ ప్రకటించాక పరిస్థితిపై రిపోర్ట్
- కరోనావైరస్: ఈ మహమ్మారికి ముంబయి కేంద్రంగా ఎలా మారింది?
- లాక్‌డౌన్ ఎఫెక్ట్: మహారాష్ట్ర నుంచి తమిళనాడు - 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు
- ఇండియా లాక్‌డౌన్: ‘‘కరోనా సోకకపోయినా ఇంత శోకాన్ని మిగులుస్తుందని నేను అనుకోలేదు’’
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









