లాక్‌డౌన్ ఎఫెక్ట్: మహారాష్ట్ర నుంచి తమిళనాడు - 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఏడుగురు యువకులు- 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరుకున్నారు
    • రచయిత, ప్రభూరావు ఆనంధన్
    • హోదా, బీబీసీ కోసం

తమిళనాడులోని నాగపట్నం జిల్లా తిరువరూర్‌కు చెందిన ఏడుగురు యువకులు ముంబయిలో పనిచేస్తారు. అయితే, దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో భాగంగా అంతటా అన్ని రకాల ప్రయాణాలనూ ప్రభుత్వాలు నిషేధించాయి. దాంతో, ఆ యువకులు 1,200 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి తమిళనాడులోని తమ సొంతూళ్లకు చేరుకున్నారు.

మార్చి 29న మహారాష్ట్రలోని ఉమర్‌ఖేడ్ నుంచి బయలుదేరారు. ఏప్రిల్ 4 మధ్యాహ్నం తమిళనాడులోని తిరుచ్చీ చేరుకున్నారు.

మధ్యమధ్యలో వీరు లిఫ్ట్ అడిగి లారీలు, ఆటోలు, బైక్‌లపైన కూడా ప్రయాణం చేశారు.

“నేను బీఎస్సీ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌ను. మహారాష్ట్రలోని ఉమెర్‌ఖేడ్ జిల్లాలో ఒక ప్రైవేటు సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాను. రెండు వారాల క్రితం మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో పెరిగింది. మేము ఉండే ప్రాంతంలో కంపెనీలన్నీ మూసివేశారు. ఉద్యోగులు ఎవరూ పనికి రావద్దని చెప్పారు” అని రాహుల్ ద్రవిడ్ బీబీసీతో చెప్పారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

కరోనావైరస్ భయం

“నాతో పాటు ఉండే మరో 22 మంది అక్కడే ఉండిపోయారు. మా పక్క ఇంట్లో ఇంకో 46 మంది కలిసి ఉంటున్నారు. వారిలో 60 మందికి పైగా తమిళనాడు వారే. వలస కార్మికుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం సహాయ శిబిరాలు ఏర్పాటు చేసింది. మమ్మల్ని అక్కడే ఉండాలని అధికారులు చెప్పారు.

అయితే, మాకు అక్కడి భాష (మరాఠీ) అర్థం కాదు. పోలీసులతో, రెవెన్యూ అధికారులతో సరిగా మాట్లాడలేకపోయాం. మరోవైపు, మీ స్వస్థలాలకు వెళ్లిపోండంటూ స్థానికులు మమ్మల్ని బెదిరించారు. దాంతో, ఆ క్యాంపులో ఉండలేకపోయాం. ఈ సమస్యలే కాకుండా, దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నది మహారాష్ట్రలోనే. అక్కడ ఉంటే మాకు కూడా అది సోకుతుందేమోనని భయపడ్డాం. ఎలాగైనా మా సొంతూళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం” అని రాహుల్ ద్రవిడ్ వివరించారు.

ఇంటికి చేరడమే లక్ష్యం

“లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి రవాణా సదుపాయం లేదు. కాలినడకనే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మొదట 50 మంది కలిసి వెళ్దామని అనుకున్నాం. కానీ, మధ్యలో పోలీసులు అరెస్టు చేస్తారేమో అన్న భయంతో 43 మంది వెనక్కి తగ్గారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులోనే వాళ్లు ఉన్నారు.“

“ఇంటికి చేరుకోవడం మా లక్ష్యం. క్యాంపు నుంచి బయలుదేరి నాందేడ్ చేరుకున్నాం. ఉమెర్‌ఖేడ్‌లోని క్యాంపు నుంచి నాందేడ్‌కు 240 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ తర్వాత షోలాపూర్‌... అలా వందల కిలోమీటర్లు నడుస్తూ వచ్చాం. సేలం జిల్లా మీదుగా తమిళనాడు చేరుకున్నాం. తిరుచ్చి జిల్లాకు చేరుకోవడానికి దాదాపు 1000 కిలోమీటర్ల దూరం నడిచాం” అని రాహుల్ చెప్పారు.

“మధ్యలో చాలా చోట్ల పోలీసులు, రెవెన్యూ అధికారులు మమ్మల్ని ఆపారు. సమీపంలోని సహాయ శిబిరాలలో ఉండాలని సూచించారు. కానీ, మేము ఆగలేదు. ఎలాగైనా సరే ఇంటికి చేరుకోవాలని అనుకున్నాం. తమిళనాడులోకి ప్రవేశించేందుకు స్థానికులు సాయం చేశారు. మా ప్రయాణ మార్గంలో చాలావరకు దుకాణాలు, మార్కెట్లు మూసివేసి ఉన్నాయి. మధ్యలో స్వచ్ఛంద సేవకులు ఇచ్చిన ఆహారంతో పాటు, ప్రభుత్వ క్యాంపుల దగ్గర తిన్నాం.“

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఏడుగురు యువకులు- 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరుకున్నారు

నిద్రలేని రాత్రులు

“కొన్ని చోట్ల మాత్రం దుకాణాలు తెరిచి ఉన్నాయి. అక్కడ బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కుని, మళ్లీ నడక ప్రారంభించాం. ఈ ప్రయాణంలో రెండు రాత్రులు నిద్రపోయాం. మిగతా రోజులు నిద్రలేకుండా రాత్రంతా నడుస్తూనే ఉన్నాం. మొదటి రోజు చాలా అలసిపోయాం. తర్వాత, మాలో ఉత్సాహం పెరిగేలా సరదాగా మాట్లాడుకోవడం ప్రారంభించాం. ఇప్పుడు 1,200 కిలోమీటర్ల దూరం నడిచామంటే మాకే ఆశ్చర్యం వేస్తోంది“ అని అని రాహుల్ అంటున్నారు.

“మేము ఇంత దూరం కాలినడకన వస్తున్నామని మా అమ్మానాన్నలకు చెప్పలేదు. లాక్‌డౌన్ కారణంగా మేము ఇబ్బంది పడతున్నామేమో అని వాళ్లు ఆందోళన చెందుతారు కాబట్టి, రోజూ ఫోన్‌లో మాట్లాడుతూ, ఉమెర్‌ఖేడ్ క్యాంపులో ఉన్నామని చెప్పి నమ్మించేవాళ్లం. ఈ ప్రయాణంలో మాకు ఎదురైన మరో పెద్ద సమస్య ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడం. ఫోన్‌లో ఛార్జింగ్ కోసం రోడ్డు పక్కన ఆపి ఉన్న వాహనాల దగ్గర ఆగేవాళ్లం. రోజూ మా కుటుంబ సభ్యులతో ఒక్కసారి మాట్లాడి మళ్లీ ఫోన్లను స్విచాఫ్ చేసేవాళ్లం.”

ఈ యువకులు తిరుచ్చి చేరుకున్నాక, స్థానిక సామాజిక కార్యకర్త అరుణ్ జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి వీరి పరిస్థితి గురించి వివరించారు.

“తలపై లగేజీ పెట్టుకుని కాలినడకన వస్తున్న యువకులను చూశాను. మండుటెండలో తిరుచ్చి- చెన్నై రహదారిపై నడుస్తూ బాగా అలసిపోయారు. ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగితే, ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి కాలినడకనే వస్తున్నామని చెప్పారు. ఆ మాటలు వినగానే, ఇటీవల ఓ యువకుడు మహారాష్ట్ర నుంచి తమిళనాడుకు కాలినడకన బయలుదేరి చనిపోయిన విషయం నాకు గుర్తుకొచ్చింది. ఈ యువకులు అలాగే నడిస్తే, అలసిపోయి అనారోగ్యానికి గురవుతారని అనిపించింది. కొందరు మీడియా మిత్రుల సహాయంతో వీళ్ల గురించి జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించాను” అని అరుణ్ చెప్పారు.

“ఈ యువకులను వారివారి సొంతూళ్లలో విడిచిపెట్టేందుకు ఒక వాహనానికి అనుమతి తీసుకున్నాను. మొదట అందరినీ కరోనావైరస్ పరీక్షల కోసం తిరువరూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాను. అందరికీ నెగెటివ్ అని వచ్చింది. ఆ తర్వాత అందరినీ వారివారి ఇళ్లకు చేర్చాను” అని అరుణ్ వివరించారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)