కరోనావైరస్‌: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, సునేథా పెరేరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్-19 మహమ్మారి రోజూ వందల మందిని బలి తీసుకుంటోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వీటికితోడు ఈ వైరస్‌తో చనిపోయినవారి అంత్యక్రియలు ప్రభుత్వాలకు పెను సవాలుగా మారాయి.

కానీ ఈ సమస్య ఒక దేశానిది కాదు. శ్రీలంక నుంచి ఇటలీ వరకూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ సమస్యను ఎదుర్కుంటున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించింది. ఇది వేగంగా వ్యాపిస్తుండడం వల్ల ఈ వైరస్ సోకిన వారిని బంధువులు, సన్నిహితులు ఎవరూ కలవడానికి అనుమతించరు.

చాలాకేసుల్లో కరోనా పాజిటివ్ రోగులు ఆస్పత్రుల్లోనే మరణించారు. ఆ సమయంలో వారి బంధువులకు చివరిచూపు కూడా దక్కదు. వారు అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేరు. కుటుంబ సభ్యుడికి తమ ఆచారాల ప్రకారం వాటిని నిర్వహించలేకపోవడం అనేది వారికి ఒక పెద్ద షాక్ లాంటిది.

కరోనావైరస్‌తో మరణించిన వారి మృతదేహాలను ఖననం చేయాలా, లేక దహనం చేయాలా? అనేది ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

ఇప్పటివరకూ కరోనా మృతుల శవాల అంత్యక్రియలు వారి, వారి మతాచారాల ప్రకారమే జరిగేది. కానీ, శ్రీలంకలో కరోనావైరస్ వల్ల చనిపోయిన ఒక వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు తన మతాచారాలకు విరుద్ధంగా చేయడం వివాదం సృష్టించాయి.

శ్రీలంకలో ఇప్పటివరకూ 167 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దేశంలో కోవిడ్-19 వల్ల ఐదుగురు మృతిచెందారు. 29 మంది కోలుకున్నారు.

శ్రీలంక పశ్చిమ తీరం దగ్గర ఉన్న నెగోంబో నగరంలో ఒక కరోనా మృతుడు ముస్లిం అయినా, అతడి అంత్యక్రియలు ఇస్లాం ఆచారాలకు భిన్నంగా చేశారు.

శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ పార్టీ నేత రవూఫ్ హకీమ్ దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ కూడా చేశారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

మార్చి 31న ఈ పోస్ట్ పెట్టిన రవూఫ్ మృతుడి అంత్యక్రియలను అతని మతాచారాల ప్రకారం ఖననం చేసేందుకు అనుమతి లభించకపోవడంపై విషాదం వ్యక్తం చేశారు.

“ఇది చాలా దురదృష్టకరం, ఖండించాల్సిన విషయం. కోవిడ్-19 వల్ల నెగోంబోలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేయడానికి అనుమతించలేదు. మా ఆచారాలకు విరుద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. హడావుడిగా జరుగుతున్న వాటిని ఆపడానికి మేం చాలా ప్రయత్నించాం. నెగోంబోలోనే ఖననం చేసే అవకాశాలు కూడా పరిశీలించాం. కానీ ఖననం చేయడానికి భూమిలో పది అడుగుల లోతు తవ్వితే, గొయ్యిలోకి ఊటనీరు వచ్చేస్తాయని చెప్పారు. శవం కొలంబోకు తీసుకెళ్లడానికి కూడా మాకు అనుమతి లభించలేదు” అని చెప్పారు.

రవూఫ్ తన పోస్టులో ప్రభుత్వం హడావుడి చేసి, కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు.

కానీ ఆయన పోస్టుకు స్పందించిన కొందరు “ప్రజల భద్రతకు సంబంధించిన విషయాల్లో, ఇలాంటి మత సంప్రదాయాలను పక్కన పెట్టాలి” అని ఆయనకు సూచించారు.

శ్రీలంకలో అంత్యక్రియల వివాదం

ఫొటో సోర్స్, Getty Images

మృతదేహాలకు సంబంధించి గైడ్‌లైన్స్

  • కరోనా రోగి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని మార్చురీ సిబ్బంది లేదా ఆరోగ్య సిబ్బంది చూసుకోవాలి.
  • మృతదేహాన్ని తాకకుండా ఉండడం తప్పనిసరి కాబట్టి, శవానికి రసాయనాలు పూయడానికి అనుమతించరు.

మృతదేహాల అంత్యక్రియలు ఎలా?

  • శవాన్ని ఏదైనా ఒక దేశం, లేదా ప్రాంతానికి తీసుకెళ్లాల్సి వచ్చినా, అంత్యక్రియలు చేసినా అన్ని రకాల మార్గదర్శకాలను పాటించేలా చూసుకోవాలి.
  • మృతదేహాన్ని తాకకుండా ఉండాలి.
  • మృతదేహాన్ని ఖననం లేదా దహనం చేసేవారు గ్లోవ్స్ వేసుకోవాలి.
  • అంత్యక్రియలు పూర్తయ్యాక సబ్బు, నీళ్లతో శుభ్రంగా స్నానం చేయాలి. ముఖ్యంగా చేతులు కడుక్కోవాలి.

శ్రీలంక ఎపిడమాలజీ యూనిట్(మహమ్మారి విజ్ఞాన విభాగం) కోవిడ్-19 మృతుల అంత్యక్రియలకు దిశానిర్దేశాలు జారీ చేసింది

  • గైడ్‌లైన్స్ ప్రకారం మృతదేహాలను దహనం చేయాలి.
  • కరోనా మృతులకు పోస్టుమార్టం చేయరు.
  • శవాన్ని తీసుకెళ్లడం, అంత్యక్రియల్లో ఎలాంటి ఆచారాలూ పాటించరు.
  • మృతదేహం సీల్డ్ బ్యాగ్‌లోనే ఉంచాలి.
  • శవాన్ని ఒకసారి సీల్ చేస్తే, దానిని మళ్లీ తెరవడానికి అనుమతించరు.
  • సీల్ చేసిన శవాన్ని శవపేటికలో ఉంచుతారు. ఆ తర్వాతే వాటిని తీసుకెళ్తారు.
  • మృతదేహం అంత్యక్రియలకు గరిష్టంగా 24 గంటల సమయం తీసుకుంటారు. అయితే. ఆ పని 12 గంటల లోపే పూర్తి చేయడం మంచిది.

“ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు అమలు చేయడానికి శ్రీలంక కట్టుబడి లేదు. మా దేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది స్థానిక ఆరోగ్య సేవలే నిర్ణయిస్తాయి” అని ఆ దేశ ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ జసింఘే మీడియాకు చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)