కరోనా వైరస్ విజృంభిస్తున్నా... రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకంత నిశ్చింతగా ఉన్నారు?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సారా రెయిన్స్‌ఫోర్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, తన బలాన్ని ప్రదర్శించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రచించుకున్న పెద్ద ప్రణాళికలన్నీ అమలు కావాల్సిన సమయం ఇది.
అనుకోకుండా కరోనావైరస్ ప్రబలడం... చమురు ధరలు, రష్యా కరెన్సీ రూబుల్ విలువ పతనమవ్వడం వంటి కారణాలతో ఎజెండా పూర్తిగా మారిపోయింది.
పుతిన్ తన 80ల వయసు వరకూ అధికారంలో కొనసాగేందుకు వీలుగా చేస్తున్న రాజ్యాంగ మార్పులపై ఏప్రిల్‌లో ఓటింగ్ జరపాలని ఇంతకుముందు నిర్ణయించారు.
'విక్టరీ డే' 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మేలో భారీ సైనిక పరేడ్ జరపాలనుకున్నారు.
కానీ, ఇప్పుడు వాతావరణం మారిపోయింది. అనిశ్చితి, ఆందోళనలు నెలకొన్నాయి.
Sorry, your browser cannot display this map


- కరోనావైరస్ లైవ్ పేజీ: అంతర్జాతీయ, జాతీయ, స్థానిక సమాచారం
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఇప్పటివరకూ రాజ్యాంగ మార్పులపై ఓటింగ్‌ను, పరేడ్‌ను అధికారికంగానైతే రద్దు చేయలేదు. విపత్కర పరిస్థితులున్నా, పుతిన్ ప్రశాంతంగా బయటకు కనిపించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, ఏప్రిల్ 22వ తేదీన జరగాల్సిన ఓటింగ్ కొంత ఆలస్యమవుతుందని మాత్రం పుతిన్ తాజాగా ప్రకటించారు.
'సమయానుగుణంగా' తీసుకున్న చర్యల వల్ల తమ దేశంలో కోవిడ్-19 వ్యాప్తి 'నియంత్రణలోనే' ఉందని ఆయన తెలిపారు.
శుక్రవారం నాటికి రష్యాలో 1036 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
కరోనావైరస్ విషయంలో యూరప్ 'నిర్వహణ వైఫల్యం'ఉందని విమర్శిస్తూ, యురోపియన్ యూనియన్‌లో ఐక్యత లోపించిందని పేర్కొంటూ రష్యా ప్రభుత్వ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
కరోనావైరస్ సంక్షోభం, క్వారంటీన్ చర్యల్లో యురోపియన్ నేతలంతా తలమునకలైన సమయంలో, పుతిన్ మాత్రం ఉక్రెయిన్ నుంచి కొంత భూభాగం రష్యాలో కలిసి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సంబరాలు జరుపుకునేందుకు క్రిమియాకు పయనమయ్యారు.
అంతా సజావుగా, ఎప్పటిలానే సాగుతోందని చెప్పేందుకు కావాలనే చేస్తున్న ప్రయత్నం ఇది. పుతిన్ బయట తిరుగుతున్నారు. జనాలను కలుస్తున్నారు. కరచాలనం చేస్తున్నారు. 'సోషల్ డిస్టెన్సింగ్' అసలు పాటించడం లేదు. కానీ ఇదంతా ఒక షో.

ఫొటో సోర్స్, EPA
అంతా సజావుగానే సాగుతున్నట్లు చర్యలు
పుతిన్‌కు దగ్గరగా వచ్చే ప్రతి ఒక్కరికీ ముందే అధికారులు కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
ఈ వారం క్రిమియాలో పుతిన్ చేతుల మీదుగా పతకాలు పొందే వాళ్లందరికీ పరీక్షలు జరుగుతున్నాయి. క్రెమ్లిన్ సిబ్బందికి, పాత్రికేయులకు కూడా పరీక్షలు చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం శరీర ఉష్ణోగ్రత మాత్రమే చూసేవారు.
''అధ్యక్షుడు ఏ అనుమానమూ లేకుండా తన పనిని తాను కొనసాగించేందుకు ఈ చర్యలు అవసరమని మేం భావిస్తున్నాం'' అని అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ బీబీసీతో చెప్పారు.
పుతిన్ మాత్రం పరీక్షలు చేయించుకోలేదు.
''ఆయనకు లక్షణాలేవీ లేవు. చక్కగా సమయం ప్రకారం పనులు చేసుకుంటున్నారు'' అని పెస్కోవ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కలవర పెడుతున్న అధికారిక గణాంకాలు
రష్యా అధికారిక గణాంకాల ప్రకారం చూసినా, దేశంలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల రేటు పెరుగుతోంది. ఆ లెక్కలను తప్పుగా చూపిస్తున్నారని చాలా మంది అనుమానిస్తున్నారు.
కోవిడ్-19ను పుతిన్ 'విదేశీ ముప్పు'గా చూపిస్తున్నా, దేశంలో నివారణ చర్యలైతే పెరుగుతున్నాయి.
సరిహద్దులు, పాఠశాలలను మూసివేయడం నుంచి గుంపులు కట్టడాన్ని నిషేధించడం వరకూ చాలా చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, వచ్చే వారం దేశవ్యాప్తంగా సెలవులు ప్రకటిస్తున్నట్లు పుతిన్ తెలిపారు. మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దేశంలో రెస్టారెంట్లు, కెఫేలు, పార్కులను మూసేస్తున్నట్లు ప్రకటించారు. నిత్యావసర వస్తువులు, ఫార్మసీలు మినహా మిగతా అన్ని షాపుల్ని కూడా మూసేస్తామని తెలిపారు.
ప్రజలు చర్చిలకు కూడా వెళ్లొద్దని ప్రభుత్వం సూచించింది.
కానీ, జనాలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలన్న ఆదేశాలు మాత్రం ఇవ్వలేదు. మాస్కో లాక్డౌన్ గురించి తాము కనీసం చర్చించడం కూడా లేదని ప్రభుత్వం గత శుక్రవారం వ్యాఖ్యానించింది.
రష్యా పాటిస్తున్న ఈ నిగ్రహానికి.. రాజ్యాంగ మార్పులపై ఓటింగ్ జరపాలన్న ఆలోచన, సాధ్యమైనంత త్వరగా తిరిగి ఎన్నిక కావాలని పుతిన్ పడుతున్న ఆరాటం కారణాలని చాలా మంది అనుమానిస్తున్నారు.
ఈ ప్రక్రియలో ఆశ్చర్యపరిచే స్థాయికి వేగం పెరిగింది. ముందు నుంచీ దీన్ని ఓ 'స్పెషల్ ఆపరేషన్' అని పిలుస్తున్నారు

ఫొటో సోర్స్, AFP
రష్యన్లనూ భయపెడుతున్న కరోనా
కరోనావైరస్ మహమ్మారిలా వ్యాపిస్తున్న సమయంలో పెన్షనర్లను మూకుమ్మడిగా ఓటింగ్‌కు తీసుకురావడం 'నేరమే' అవుతుందని ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ హెచ్చరించారు. ఓటింగ్‌ను వాయిదావేయడమో, లేక ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడమో జరగొచ్చని అధికారులు చెబుతూ వచ్చారు.
కానీ, రష్యా ఎలక్టోరల్ కమిషన్ పరిమిత సంఖ్యలోనే జనాలు వచ్చేలా బ్యాలెట్ పద్ధతిలో వారం పాటు ఓటింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు శుక్రవారం తెలిపింది.
''వాయిదా వేయకుండా, ఈ ఓటింగ్‌ను జరిపి తీరాలన్న బలమైన కాంక్ష కనిపిస్తోంది. రష్యాకు ఏ నష్టమూ జరగకుండానే పరిస్థితులు కుదుటపడుతాయని అధికారులు గట్టి నమ్మకంతో ఉన్నారు'' అని రాజకీయ విశ్లేషకుడు కాన్స్టాంటీన్ కలాషెవ్ నెజవిసిమయా గెజెటా వార్తా పత్రికతో అన్నారు.
భవిష్యత్తు భయంకరంగానే
ప్రభుత్వ వైఖరి భరోసా ఇచ్చేలా ఉందని కొందరు అంటున్నారు. 'ఎంత తక్కువ తెలుసుకుంటే, అంత బాగా నిద్రపడుతుంది' అన్న సామెత ఇక్కడ చాలా మందికి తెలుసు.
''మాకు ఇంకా తెలుసుకోవాలని లేదు. దాని వల్ల భయం కలుగుతుంది. చేతులు కడుక్కోవాలని, బయటకు ఎక్కువగా వెళ్లొద్దని మాకు తెలుసు. జనాలు వస్తువులన్నీ ఇప్పుడే కొనేసి పెట్టుకుంటున్నారు. పరిస్థితి భయానకంగా ఉంది'' అని మాస్కో పట్ణణవాసి క్సెనియా అన్నారు. ఆమె ఐస్‌క్రీమ్‌లు అమ్ముతుంటారు.
కానీ, ఆమె దుకాణానికి కొన్ని కి.మీ.ల దూరంలోనే సంక్షోభానికి సాక్ష్యంగా ఓ పెద్ద ఆసుపత్రి వేగంగా రూపుదిద్దుకుంటోంది. కరోనావైరస్ రోగుల కోసం 500 మందికి సరిపోయేలా దీన్ని రష్యా నిర్మిస్తోంది.
వైరస్ నియంత్రణపై అత్యవసర డ్రిల్స్ నిర్వహించామని, రష్యాలోని ప్రాంతాలన్నింటినీ హైఅలెర్ట్‌లో పెట్టామని రష్యా రక్షణ శాఖ తెలిపింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్; 'గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ సెంటర్ ఏర్పాటు... ఏప్రిల్ 15 దాకా ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి ' - కేసీఆర్
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: భారత్‌లో కేసులు ఎలా పెరుగుతాయి? 'లాక్డౌన్' ఎంతవరకూ ఫలిస్తుంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









